ETV Bharat / business

వాలెంటైన్స్​ డే స్పెషల్​ : లైఫ్​లో ప్రేమ మాత్రమే కాదు ఇదీ కీలకమే! - జాయింట్​ అకౌంట్​ బెనిఫిట్స్​

Benefits of Joint Account : ప్రేమికులు ఎంతో ఇష్టంగా జరుపుకునే వాలెంటైన్స్​ డే వచ్చేసింది. అయితే.. మీ లవర్​కు గిఫ్ట్స్​, సర్​ప్రైజ్​ ప్లాన్​ చేయడం ఎప్పుడూ ఉండేదే. ఈసారి అలాకాకుండా జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మీ పార్ట్​నర్​తో కలిసి జాయింట్​ అకౌంట్​ ఓపెన్​ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Benefits of Joint Account
Benefits of Joint Account
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 2:00 PM IST

Benefits of Joint Account on the Occasion of Valentines Day: నేడు ప్రేమికులు ఎంతో ఇష్టంగా జరుపుకునే వాలెంటైన్స్ డే. ఈ రోజున తాము ప్రేమించే వారిని స్పెషల్​గా కలుసుకోవాలని, వారికి గిఫ్ట్స్​, సర్​ప్రైజ్​ ఇవ్వాలని భావిస్తుంటారు. ఇందుకోసం ఎన్నో ప్లాన్స్ వేస్తారు. అయితే.. ఈ వాలెంటైన్స్ డేకి సరికొత్త ప్లాన్ వేయండి. జీవితంలో ప్రేమ ఎంత అవసరమో, డబ్బు కూడా అంతే అవసరం. కాబట్టి.. ప్రేమికులిద్దరూ కలిసి బ్యాంకులో జాయింట్​ అకౌంట్​ ఓపెన్​ చేయండి. దానివల్ల భవిష్యత్తు గురించిన ఆలోచన, భద్రత కోసం చేయాల్సిన పొదుపు వంటి అంశాల పట్ల అవగాహన పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. మరి.. ఈ అకౌంట్​ వల్ల ప్రయోజనాలు ఏంటి? ఏఏ బ్యాంకులు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

జాయింట్​ అకౌంట్​ అంటే ఏమిటి? ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సంయుక్తంగా కలిగి ఉండే బ్యాంకు అకౌంట్​ను జాయింట్ అకౌంట్ అని పేర్కొంటారు. సాధారణంగా కుటుంబ సభ్యులు, భార్యాభర్తలు, వ్యాపార భాగస్వాములు ఈ అకౌంట్​ను కలిగి ఉంటారు. ఇకపోతే పొదుపు ఖాతాలను అందించే అన్ని బ్యాంకులు, ఉమ్మడి ఖాతాను తెరవడానికి అనుమతిస్తాయి.

దంపతుల కోసం బెస్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్​ - ఏకంగా రూ.5.55 లక్షల వడ్డీ!

ఉమ్మడి పొదుపు ఖాతా ప్రయోజనాలు:

  • జాయింట్ అకౌంట్ హోల్డర్లు సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
  • ఇద్దరూ అకౌంట్​లోని డబ్బుకు యాక్సెస్ కలిగి ఉంటారు.
  • జాయింట్ ఖాతాలు సాధారణంగా పర్సనల్​ అకౌంట్​ కంటే అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. డబ్బు ఆదా చేయడానికి ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి.
  • ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బు ట్రాన్స్​ఫర్ చేయడానికి అనుకూలమైన మార్గాలను బ్యాంకులు అందిస్తాయి.
  • ఉమ్మడి పెట్టుబడులు, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు కూడా జాయింట్ ఖాతాలను ఉపయోగించవచ్చు.
  • చాలా బ్యాంకులు డెబిట్ కార్డ్‌లు, చెక్ బుక్‌లు వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

భారతదేశంలో జాయింట్​ అకౌంట్​లను అందిస్తోన్న బ్యాంకుల జాబితా ఇదే..

  • ఎస్‌బిఐ(SBI)
  • ఐసిఐసిఐ(ICICI)
  • హెచ్‌డిఎఫ్‌సి(HDFC)
  • ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
  • యస్ బ్యాంక్ (Yes Bank)
  • కోటక్ మహీంద్రా
  • ఆర్‌బిఎల్ బ్యాంక్
  • డిబిఎస్
  • ఇండస్‌ఇండ్
  • ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్.. తదితర బ్యాంకులు జాయింట్ ఖాతాలను అందిస్తున్నాయి.

ఆర్థికం అత్యంత కీలకం..

ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ప్రేమికులైతే.. వారు తప్పకుండా జాయింట్ అకౌంట్​ మెయింటెయిన్ చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తుకు సంబందించిన ఏదైనా ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇద్దరూ త్వరపడే అవకాశం ఉంటుంది. డబ్బు దుబారా చేయకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగే ఛాన్స్ ఉంటుంది. డబ్బుకు ప్రేమ అవసరం లేకపోయినా.. ప్రేమకు తప్పకుండా డబ్బు కావాల్సిందే. అప్పుడే అవసరాలన్నీ తీర్చుకుంటూ.. ఆనందంగా జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. కాబట్టి.. ప్రేమికులు ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా రిజల్యూషన్ తీసుకోండి. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయండి. మీ భవిష్యత్తుకు ఆర్థిక పునాది వేసుకోండి.

Joint Bank Account Benefits : జాయింట్​ అకౌంట్​ అంటే ఏంటి? అదెలా పని చేస్తుంది? లాభమెంత?

అకౌంట్​లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే నెగిటీవ్​లోకి వెళ్తుందా? - ఆర్​బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.