Bank Holidays In May 2024 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2024 మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 11 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.
List Of Bank Holidays In May 2024
2024 మే నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే!
- మే 1 (బుధవారం) : మే 1న అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా బ్యాంక్‌లకు పబ్లిక్ హాలీడే ఉంటుంది.
- మే 5 (ఆదివారం) : మే 5న ఆదివారం కనుక బ్యాంక్‌లకు సాధారణ సెలవు ఉంటుంది.
- మే 8 (బుధవారం) : రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (బంగాల్లో బ్యాంక్‌లకు సెలవు)
- మే 10 (శుక్రవారం) : అక్షయ తృతీయ. అందువల్ల ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.
- మే 11 (శనివారం) : మే నెలలో రెండో శనివారం ఇది. అందుకే బ్యాంకులకు సాధారణ సెలవు.
- మే 12 (ఆదివారం) : సాధారణ సెలవు
- మే 16 (గురువారం) : సిక్కిం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. అందుకే సిక్కింలో ఉన్న బ్యాంకులకు ఆ రోజు సెలవు.
- మే 19 (ఆదివారం) : బ్యాంకులకు సాధారణ సెలవు
- మే 23 (గురువారం) : బుద్ధ పూర్ణిమ. ఉత్తర్‌ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోన్ని బ్యాంకులకు ఆ రోజు సెలవు ఉంటుంది.
- మే 25 (శనివారం) : నజ్రుల్ జయంతి, నాలుగో శనివారం. అందువల్ల బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
- మే 26 (ఆదివారం) : ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు.
సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : మే నెలలో 11 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. కనుక బ్యాంక్‌లకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు.
Bank holiday for Lok Sabha Election 2024 : లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఆ తేదీలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బ్యాంక్ హాలీడే | డేట్ |
లోక్ సభ మూడో దశ పోలింగ్ | మే 7 |
లోక్ సభ నాలుగో దశ పోలింగ్ | మే13 |
లోక్ సభ ఐదో దశ పోలింగ్ | మే 20 |
లోక్ సభ ఆరో దశ పోలింగ్ | మే 25 |
ఏ దశలో - ఏ రాష్ట్రాలు :
- మే 07 మూడో దశ (12 రాష్ట్రాలు/యూటీ, 94 స్థానాలు)
అస్సాం (4), బిహార్ (5), ఛత్తీస్‌గఢ్ (7), గోవా (2), గుజరాత్ (26), కర్ణాటక (14), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), యూపీ (10), బంగాల్ (4), దాద్రానగర్ హవేలీ, దమన్ దీవ్ (2), జమ్మూకశ్మీర్ (1) - మే 13 నాలుగో దశ (I0 రాష్ట్రాలు/యూటీ, 96 స్థానాలు)
ఆంధ్రప్రదేశ్ (25), బిహార్ (5), ఝార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), తెలంగాణ (17), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూకశ్మీర్ (1) - మే 20 ఐదో దశ (8 రాష్ట్రాలు/యూటీ, 49 స్థానాలు)
బిహార్ (5), ఝార్ఖండ్ (3), మహారాష్ట్ర (13), ఒడిశా (5), యూపీ (14), బంగాల్ (7), జమ్మూకశ్మీర్ (1), లద్దాఖ్ (1) - మే 25 ఆరో దశ (7 రాష్ట్రాలు/యూటీ, 57 స్థానాలు)
బిహార్ (8), హరియాణా (10), ఝార్ఖండ్ (4), ఒడిశా (6), యూపీ (14), బంగాల్(8), దిల్లీ (7)
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ 5 తప్పులు చేయవద్దు! - Mutual Fund Investment