ETV Bharat / business

పర్సనల్​ లోన్​ కోసం అప్లై చేస్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్! - Personal Loan Expert Tips - PERSONAL LOAN EXPERT TIPS

Personal Loan Expert Tips : డబ్బు అవసరం ఎప్పుడు, ఏ విధంగా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే అత్యవసర సమయాల్లో చాలా మంది పర్సనల్‌ లోన్స్​ కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే బ్యాంకులు ఉద్యోగులకు, స్వయం ఉపాధి పొందేవారికి పర్సనల్ లోన్​ను ఎలా ఇస్తాయి? వ్యక్తిగత రుణాలు తీసుకునేటప్పుడు మనం కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Dos and Don'ts While Applying for Personal Loan
Personal Loan Expert Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 12:32 PM IST

Personal Loan Expert Tips : అత్య‌వ‌స‌రంగా డ‌బ్బు కావాలి ఎలా? అనే ప్ర‌శ్న వ‌చ్చిన‌ప్పుడు చాలా మందికి గుర్తుకు వ‌చ్చేది వ్య‌క్తిగ‌త రుణం. బ్యాంకులు ముంద‌స్తు ఆమోదంతో ఆఫ‌ర్ చేస్తుండ‌డం, ఆన్​లైన్​లో త‌క్కువ స‌మ‌యంలోనే ఆమోదించ‌డం, హామీ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేక‌పోవ‌డం - ఇటువంటి అనుకూల‌త‌లు ఉండ‌డం వ‌ల్ల చాలా మంది పర్సనల్ లోన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. వాహన, గృహ రుణాలతో పోలిస్తే పర్సనల్ లోన్స్​కు వడ్డీ ఎక్కువ ఉంటుంది. అందుకే బ్యాంకులు కూడా వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. సాధారణంగా బ్యాంకులు వ్యక్తిగత రుణాన్ని ఉద్యోగి జీతాన్ని బట్టి ఇస్తాయి. అయితే వ్యాపారులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి రుణాలు ఎలా ఇస్తాయి? పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు పరిగణనలోని తీసుకోవాల్సిన విషయాలేంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భారీ వడ్డీ రేట్లు
డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని బట్టి స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఎంత మొత్తం రుణం ఇవ్వాలో బ్యాంకులు నిర్ణయిస్తాయి. అయితే దరఖాస్తుదారుని అర్హత, క్రెడిట్ స్కోర్, రుణ కాలపరిమితిని బట్టి వీటి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. సాధారణంగా పర్సనల్ లోన్స్​పై వడ్డీ రేటు 12 శాతం నుంచి 21 శాతం వరకు ఉంటుంది. ఇది చాలా ఎక్కువ. అందుకే వ్యక్తిగత రుణాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పర్సనల్ లోన్స్​ను గృహ, వాహన రుణాల కంటే ఎక్కువ వడ్డీ రేటుతో ఇస్తాయి బ్యాంకులు. పైగా ఇవి అసురక్షిత రుణాలు కూడా. అందువల్ల మీ వార్షిక జీతం కంటే ఎక్కువ మొత్తంలో లోన్ తీసుకోకూడదు. ఒక వేళ తీసుకుంటే, మీ ఆర్థిక స్థితి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

వారికి మాత్రమే లోన్స్​!
ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేయడానికి, బ్యాంకులు వారి మూడు నెలల పే స్లిప్​లను ప్రూఫ్​గా తీసుకుంటాయి. స్వయం ఉపాధి పొందే వారికి లోన్ ఇచ్చేటప్పుడు వారి డెబిట్, క్రెడిట్ కార్డ్‌ హిస్టరీని చూస్తాయి. దాదాపు 6-12 నెలల క్రెడిట్ హిస్టరీని పరిశీస్తాయి. చాలా బ్యాంకులు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నవారికి మాత్రమే రుణాలు ఇస్తుంటాయి. సాధారణ కంపెనీల్లో పనిచేసేవారికి వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికి ఇష్టపడవు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.

20 శాతానికి మించకుండా!
వ్యక్తిగత రుణాలపై ఈఎంఐ అనేది మీ నెలవారీ ఆదాయంలో 20 శాతానికి మించకుండా చూసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పర్సనల్ లోన్ ఈఎంఐకే మీ ఆదాయంలో ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతే, ఇక మీ పిల్లల చదువులు, నెలవారీ ఖర్చులు, కరెంట్ బిల్లులు లాంటి అత్యవసరాలకు ఇబ్బందిపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. 'వీలైనంత తక్కువ మొత్తంలో వ్యక్తిగత రుణం తీసుకోవాలి. మరే ఇతర మార్గాల ద్వారా డబ్బు దొరకనప్పుడు మాత్రమే పర్సనల్ లోన్స్ తీసుకోవాలి. అలాగే వ్యక్తిగత రుణాల కాలపరిమితిని వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రధానంగా పర్సనల్ లోన్​ కాలవ్యవధి 12 నెలల కంటే మించకుండా చూసుకోవడం మంచిది' అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

వ్యక్తిగత రుణాన్ని ఎప్పుడు తీసుకోవాలి?
ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఏదైనా అనుకోని దుర్ఘటనలు జరిగినప్పుడు పర్సనల్ లోన్స్ తీసుకోవచ్చు. కానీ హాలీడే ట్రిప్ వంటి సరదాల కోసం వ్యక్తిగత రుణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. 'వీలైనంత వరకు వ్యక్తిగత రుణాలను తీసుకోవద్దు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి వ్యక్తిగత రుణాలు తీసుకోకండి. గృహ, బంగారు రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణాలపై విధించే వడ్డీ చాలా ఎక్కువ. కనుక మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఉంటేనే పర్సనల్ లోన్ తీసుకోండి' అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మీరు త్వరగా కోటీశ్వరులు కావాలా? 15x15x15 రూల్ ఫాలో అయిపోండి! - 15x15x15 Investing Rule

గతుకుల రోడ్లపై కూడా దూసుకుపోవాలా? ఈ టాప్-10 బైక్స్​పై ఓ లుక్కేయండి! - Best Off Road Bikes

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.