ETV Bharat / business

మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేయాలా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​! - Mutual Fund Investment Tips

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 3:43 PM IST

Mutual Fund Investment Tips : మీరు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. మ్యూచువల్ ఫండ్స్​ నేరుగా స్టాక్ మార్కెట్ల పనితీరుపై ఆధారపడి ఉంటాయి. కనుక వీటిలో రిస్క్, రివార్డ్ రెండూ ఎక్కువగానే ఉంటాయి. అందుకే మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేసే ముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాల గురించి ఇప్పుడు చూద్దాం.

MUTUAL FUND INVESTMENT STRATEGY
Mutual Fund Investment Tips (ANI)

Mutual Fund Investment Tips : ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. కష్టపడకుండా, చాలా సులువుగా డబ్బు సంపాదించవచ్చనే అపోహ చాలా మందిలో ఉండడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. మరికొందరు హై రిస్క్ ఉండే ఈక్విటీ షేర్లలో కాకుండా, ఈక్వీటీ మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం (యాంఫీ) నివేదిక ప్రకారం, తొలిసారిగా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టినవారు, ప్రధానంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్లు అన్నీ మంచివేనా? ఎలాంటి మ్యూచువల్ ఫండ్లు లాభాలను అందిస్తాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పోర్ట్‌ఫోలియో నిర్మాణం
మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టేటప్పుడు మనం చాలా విషయాలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. తొలుత మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయబోయే మ్యూచువల్ ఫండ్ గురించి కనీస అవగాహనకు రావాలి. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. అయితే స్టాక్ మార్కెట్లతో పోలిస్తే, మ్యూచువల్ ఫండ్లలో నష్టభయం కొంత తక్కువ. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, రిస్క్ ఎక్కువగా ఉండే ఫండ్లు కూడా ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. లేదంటే మన డబ్బులన్నీ ఆవిరి అయిపోతాయి. మన అవసరాలకు, ఆర్థిక వనరులకు సరితూగే ఫండ్లను ఎంపిక చేసుకుంటే సేఫ్. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మ్యూచువల్ ఫండ్లు మంచి పెట్టుబడి సాధనాలు. మనం అంతకాలం పాటు ఎదురుచూడగలమా? లేదా? అనేది నిర్ణయించుకున్నాకే వాటిలో పెట్టుబడి పెట్టాలి. పదవీ విరమణ ప్రణాళికలు, సొంతిల్లు, ఇంటి రుణం తీర్చడం, పిల్లల చదువు, పిల్లల పెళ్లిళ్లు లాంటి ఆర్థిక అవసరాలను తీర్చేలా, ఒక పక్కా ప్రణాళికతో మ్యూచువల్ ఫండ్​ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవాలి.

స్టాక్ మార్కెట్‌తో ప్రభావితం అవుతోందా?
ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు 1, 3, 5, 10 ఏళ్ల వ్యవధిలో ఆ ఫండ్‌ ఎంత రాబడిని అందించిందో మనం తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్‌ డౌన్ అయిన సందర్భాల్లో ఆ ఫండ్ ఎలా ప్రభావితం అవుతోంది? దాని విలువలో హెచ్చుతగ్గులు ఎంతమేర జరుగుతున్నాయి? అనేది చెక్ చేసి చూడాలి. స్టాక్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులున్నా, విలువను స్థిరంగా నిలుపుకుంటూ, క్రమంగా పురోగతి సాధిస్తున్న ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది.

బెంచ్‌మార్క్ అలా ఉంటే?
మ్యూచువల్‌ ఫండ్‌ పనితీరు గురించి ఒక అంచనాకు వచ్చేందుకు, దాని బెంచ్‌మార్క్‌తో పోల్చి చూడాలి. అదే విభాగంలోని ఇతర ఫండ్లు ఎంత మేరకు రాబడిని అందిస్తున్నాయో తెలుసుకోవాలి. మ్యూచువల్‌ ఫండ్‌ బెంచ్‌మార్క్, ఇతర ఫండ్లను అధిగమించేలా రాబడిని అందిస్తుంటే, అది మంచి ఫండ్ అని చెప్పుకోవచ్చు.

ఏయే రంగాల్లో పెట్టుబడులు
మనం పెట్టుబడిగా పెట్టే డబ్బును మ్యూచువల్‌ ఫండ్‌‌ కంపెనీలు చాలా రంగాల్లో తిరిగి పెట్టుబడిగా పెడుతుంటాయి. అందుకే మనం ఫండ్‌ను ఎంపిక చేసుకునే క్రమంలో అది ఏయే రంగాల్లో, ఏయే కంపెనీల్లో పెట్టుబడులు పెడుతోందో తెలుసుకోవాలి. నష్టభయం తక్కువగా ఉండే రంగాలు, కంపెనీల్లో పెట్టుబడి పెట్టే ఫండ్లకు ప్రయారిటీ ఇవ్వొచ్చు. తొలిసారిగా ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు ఈ జాగ్రత్త చర్యను తప్పనిసరిగా పాటించాలి. వైవిధ్యంగా విభిన్న రంగాల్లో పెట్టుబడులను కలిగి ఉన్న ఫండ్లను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకటి, రెండు రంగాలు రాణించలేకపోయినా, మిగతా రంగాల మెరుగైన పనితీరుతో ఫండ్ విలువ స్థిరమైన రేటుతో పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒకే రంగంలో పెట్టుబడి పెట్టే ఫండ్లు స్టాక్ మార్కెట్ పరిణామాలతో త్వరగా ప్రభావితం అవుతుంటాయని మనం గుర్తుంచుకోవాలి. డెట్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు వాటి క్రెడిట్‌ నాణ్యతను చెక్ చేయాలి.

వ్యయ నిష్పత్తి
మ్యూచువల్ ఫండ్లలో మనం పెట్టే పెట్టుబడి నుంచి నిర్వాహక కంపెనీలు కొంత మొత్తాన్ని నిర్వహణ ఖర్చుల కోసం మినహాయించుకుంటాయి. దీన్నే వ్యయ నిష్పత్తి అంటారు. తక్కువ వ్యయ నిష్పత్తి కలిగిన మ్యూచువల్ ఫండ్లను ఎంపిక చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. కొన్నిసార్లు మంచి మ్యూచువల్ ఫండ్లు అధిక వ్యయ నిష్పత్తిని కలిగి ఉంటాయి. అటువంటి టైంలో ఆ ఫండ్ ఎంత మేర రాబడి ఇస్తోంది అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

నోట్ : స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్​ గురించి సరైన అవగాహన పెంచుకున్న తరువాత మాత్రమే వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. లేదా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవాలి. అప్పుడే మీరు నష్టపోకుండా ఉంటారు. దీర్ఘకాలంలో మంచి రాబడిని సంపాదించగలుగుతారు.

ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్ - ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్​ - వాటిని రీప్లేస్​ చేయాల్సిందే! - FASTag New Rules From August 1st

హోం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఏజెంటును కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలివే! - Home Insurance Questions

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.