ETV Bharat / bharat

'కిల్లర్' తోడేళ్ల పనిబట్టేందుకు సూపర్ ప్లాన్- ఆ బొమ్మలు, చిన్నారుల మూత్రంతో ఎర! - Wolf Attack In Uttar Pradesh - WOLF ATTACK IN UTTAR PRADESH

Wolf Attack In Uttar Pradesh : ప్రజలపై దాడి చేసి చంపేస్తున్న తోడేళ్లను పట్టుకునే ప్రయత్నాలను ఉత్తర్​ప్రదేశ్​ సర్కార్ ముమ్మరం చేసింది. వాటిని పట్టుకునేందుకు పిల్లల మూత్రంలో ముంచిన రంగురంగుల టెడ్డీ బొమ్మలను తోడేళ్లకు ఎరగా వేస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఆపరేషన్ కొనసాగుతుండగా, సోమవారం వేకువజామున తోడేళ్లు 3 ఏళ్ల బాలికను చంపేశాయి.

Wolf Attack In Uttar Pradesh
Wolf Attack In Uttar Pradesh (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2024, 11:44 AM IST

Wolf Attack In Uttar Pradesh : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌ జిల్లా వాసులను కంటి మీద కునుకులేకుండా చేస్తున్న తోడేళ్లను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 'ఆపరేషన్‌ భేడియా'లో భాగంగా తోడేళ్లను పట్టుకునేందుకు పిల్లల(చిన్నారుల) మూత్రంతో తడిపిన రంగురంగుల టెడ్డీ బొమ్మలను ఎరగా వేస్తున్నారు. ఈ బొమ్మలను వ్యూహాత్మకంగా నది ఒడ్డున, తోడేళ్లు విశ్రాంతి తీసుకునే స్థలాలు, గుహలకు దగ్గరగా ఉంచారు. మనుషుల వాసనను తోడేళ్లకు తెలియజేసేందుకు అధికారులు ఈ వినూత్న ప్రయత్నాన్ని చేపట్టారు.

"తోడేళ్లు నిరంతరం తమ స్థావరాలను మారుస్తూ ఉంటాయి. సాధారణంగా అవి రాత్రిపూట వేటాడతాయి. ఉదయానికి తిరిగి వాటి గుహలకు చేరుకుంటాయి. తోడేళ్లను పట్టుకునేందుకు మేము ఒక ప్లాన్ చేశాం. తోడేళ్లను తప్పుదారి పట్టించి, వాటిని గుహల నుంచి బయటకు రప్పిస్తాం. అప్పుడు అక్కడ ఉన్న ఉచ్చులు, బోనులలో అవి చిక్కుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. తోడేళ్లను థర్మల్ డ్రోన్లను ఉపయోగించి ట్రాక్ చేస్తున్నాం. బాణసంచా కాల్చడం, శబ్దం చేయడం ద్వారా వాటిని ఉచ్చుల వైపు మళ్లేటట్లు చేస్తున్నాం. అవి ప్రధానంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుంటాయి. అందుకే, మేము పిల్లల మూత్రంతో తడిపిన రంగురంగుల పెద్ద టెడ్డీ బొమ్మలను వాటికి ఎరగా వేస్తున్నాం. "
-- అజిత్ ప్రతాప్ సింగ్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్

తోడేళ్లను చంపాలని చూసిన బ్రిటిషర్లు
తోడేళ్లు, నక్కలు, పెంపుడు కుక్కలు, అడవి కుక్కలు- ఇవన్నీ ఒకే జాతికి చెందినవని సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రమేశ్ కుమార్ పాండే తెలిపారు. దశాబ్దాల క్రితమే బ్రిటిషర్లు ఈ ప్రాంతం నుంచి తోడేళ్లను నిర్మూలించాలని ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. వాటిని చంపినవారికి బహుమతులు కూడా అందించారని వివరించారు. అయినప్పటికీ, తోడేళ్లు బతికాయని చెప్పుకొచ్చారు. "జంతువులను పట్టుకోవడానికి పలు రకాల ఎరలను ఉపయోగిస్తారు. పక్షుల నుంచి పంటలను రక్షించడానికి పొలాల్లో దిష్టిబొమ్మలను ఎలా ఉపయోగిస్తారో, అదే విధంగా జంతువులను పట్టుకోవడానికి అటవీ శాఖ టెడ్డీ బొమ్మలను ఉపయోగిస్తుంది. ఇటువంటి పద్ధతులు విజయవంతమయ్యాయని రికార్డుల్లో లేదు. అయినప్పటికీ మానవ-వన్యప్రాణుల సంఘర్షణకు పరిష్కారం కనుక్కొవడానికి ఇలాంటి వినూత్న ప్రయత్నాలు చేపట్టాలి." అని తెలిపారు.

తోడేళ్ల దాడిలో 3ఏళ్ల చిన్నారి బలి
ఇదిలా ఉండగా సోమవారం వేకువజామున కూడా తోడేళ్లు 3 మూడేళ్ల బాలికపై దాడి చేసి హతమార్చాయి. మరో ఇద్దరు మహిళలను గాయపర్చాయి. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తోడేలును చాలాసార్లు గుర్తించామని, అప్పుడు అటవీ అధికారులకు ఫోన్ చేస్తే వీడియో ప్రూఫ్ అడిగారని చెప్పుకొచ్చారు. "తోడేళ్ల దాడిలో నా మూడేళ్ల కుమార్తె మరణించింది. నా బిడ్డ రెండు చేతులను తోడేలు కొరికింది. మేము కూలీ పనులకు వెళ్లి పిల్లల్ని పెంచుకుంటున్నాం. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇంటికి తలుపులు చేయించుకోలేకపోయాం." అని తోడేళ్ల దాడిలో మరణించిన మూడేళ్ల బాలిక తల్లి తెలిపారు.

'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
తోడేళ్లు తమ ఆవాసాలను మారుస్తున్నందున వాటిని పట్టుకోవడంలో అధికారులు ఇబ్బంది పడుతున్నారని బహ్రాయిచ్ జిల్లా కలెక్టర్ మోనికా రాణి తెలిపారు. తోడేళ్లు ప్రతి 5-6 రోజులకు తన కార్యాచరణను మార్చుకుంటున్నాయని తెలిపారు. వేర్వేరు గ్రామాలపై దాడి చేస్తున్నాయని చెప్పారు. ప్రజలు ఇళ్లలోనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. "మేము ఇప్పటివరకు 4 తోడేళ్లను పట్టుకున్నాం. మరో రెండు మిగిలి ఉన్నాయి. మా బృందం నిరంతరం పెట్రోలింగ్ చేస్తోంది. వీలైనంతర త్వరగా వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాం." అని బహ్రాయిచ్ జిల్లా కలెక్టర్ మోనికా రాణి చెప్పారు.

కాగా, బహ్రాయిచ్‌ జిల్లాలోని మెహ్సి తాలుకాలో రెండు నెలల్లో ఎనిమిది మందిని తోడేళ్ల మంద బలి తీసుకుంది. వారిలో ఏడుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. పదుల సంఖ్యలో తోడేళ్ల దాడిలో గాయపడ్డారు. మనుషులను తినడం అలవాటైన తోడేళ్ల నుంచి గ్రామస్థులను రక్షించేందుకు ఉత్తర్​ప్రదేశ్‌ ప్రభుత్వం రంగంలోకి దిగింది. తోడేళ్లను పట్టుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి 'ఆపరేషన్ భేడియా' అని పేరు పెట్టింది. ఈ క్రమంలో ఆపరేషన్ చేపడుతోంది. ఇప్పటికి నాలుగు తోడేళ్లను పట్టుకోగా, మరో రెండింటి కోసం గాలిస్తోంది.

8 మందిని చంపిన తోడేళ్ల కోసం వేట- ఎట్టకేలకు 'ఆపరేషన్‌ భేడియా'లో పురోగతి! - Wolf Attack In Uttar Pradesh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.