ETV Bharat / bharat

25ఏళ్ల క్రితం చెత్తకుప్పలో దొరికిన అంధురాలు- ఇప్పుడు అందరికీ ఆదర్శం- టార్గెట్ IAS - Blind Girl Success Story

Visually Impaired Girl Got Government Job : 25 ఏళ్ల క్రితం కన్న తల్లిదండ్రులే వద్దనుకుని చెత్తకుప్పలో పడేసిన తర్వాత లభ్యమైన ఓ చిన్నారి నేడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. పుట‍్టుకతోనే కంటిచూపు కోల్పోయిన ఆ యువతి సెక్రటేరియట్‌లో క్లర్క్ కమ్ టైపిస్ట్ జాబ్ సాధించి అందరి చూపును తనవైపు తిప్పుకునేలా చేసింది. త్వరలోనే ఉద్యోగంలో చేరనున్న ఆమె ఐఏఎస్ అవ్వడమే తన లక్ష్యమని చెబుతోంది. ఆమె ఎవరు? ఎలా చదువుకుంది? వెనుక నుంచి యువతిని ఎవరు నడిపించారు?

Visually Impaired Girl Got Government Job
Visually Impaired Girl Got Government Job (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 3:53 PM IST

  • విధి ముందు తలవంచలేదు ఆ యువతి
  • లోపాన్ని కూడా లెక్కచేయలేదు
  • కన్న తల్లిదండ్రులే పుట్టగానే వద్దనుకున్నారు
  • కానీ ఆమె చివరకు అందరి చూపు తనవైపు తిప్పుకుంది

దాదాపు 25 ఏళ్ల క్రితం పుట్టుకతోనే కన్న తల్లిదండ్రులే చెత్తకుప్పలో పడేసిన అమ్మాయే ఇప్పుడు మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్​ పరీక్షలో పాస్ అయ్యి ముంబయి సెక్రటేరియట్‌లో క్లర్క్ కమ్ టైపిస్ట్ జాబ్ సంపాదించుకుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరితో ప్రశంసలు అందుకుంది. తన తలరాతను తానే రాసుకుంది! ఆమె పేరే మాలా పాపల్కర్.

వివరాల్లోకి వెళ్తే, మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్​ సమీపంలోని చెత్తకుప్పలో 25 ఏళ్ల క్రితం ఓ చిన్నారి కనిపించింది. ఆ పాప పుట్టుకతోనే అంధురాలు. ఆ చిన్నారిని జల్గావ్​లోని రిమాండ్ హోమ్​కు తరలించారు పోలీసులు. తల్లిదండ్రుల కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంధుల అనాథాశ్రమంలో ఆ చిన్నారిని చేర్చారు పోలీసులు.

తన ఇంటి పేరుతో!
Visually Impaired Girl Got Government Job : దివంగత అంబాదాస్ పంత్ వైద్య దివ్యాంగ్ చిల్డ్రన్స్ హోమ్ డైరెక్టర్, పద్మశ్రీ గ్రహీత శంకర్ బాబా పాపల్కర్‌(81)కు ఆ చిన్నారి బాధ్యతను అప్పగించారు పోలీసులు. ఆయనే ఆ చిన్నారికి తన ఇంటి పేరుతో మాలా పాపల్కర్ అని నామకరణం చేశారు. ఆధార్ కార్డ్, రెసిడెంట్ సర్టిఫికెట్ మొదలైన డాక్యుమెంట్లు సిద్ధం చేసి ఆమె చదువుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. బ్రెయిలీ లిపిలో చదువు చెప్పించారు.

శంకర్ బాబా చెప్పిన వివరాల ప్రకారం, మాలాకు చిన్నప్పటి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. పట్టుదలతో కష్టపడి చదువు కొనసాగించింది. 10వ తరగతి, 12వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అమరావతిలోని విదర్భ జ్ఞాన్ విజ్ఞాన్ సంస్థలో ఆర్ట్స్ డిగ్రీ గ్రూప్​లో చేరింది. 2018లో మొదటి ర్యాంక్‌తో పాస్​ అయ్యింది. 2019లో పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. అమరావతిలోని యూనిక్ అకాడమీ డైరెక్టర్ అమోల్ పాటిల్ ఆమెకు విలువైన మార్గదర్శకత్వం అందించారు. అలా ఎంతో కష్టపడి చదివి మాలా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.

'మాలా నాకు పెద్ద సవాల్​'
అయితే మాలాకు మార్గనిర్దేశం చేసిన యూనిక్ అకాడమీ డైరెక్టర్ అమోల్ పాటిల్ 'ఈటీవీ భారత్'తో మాట్లాడారు. "ఇప్పటి వరకు ఎంతో మంది విద్యార్థులకు చదువు చెప్పాను. కానీ మాలా నాకు పెద్ద సవాల్‌. నిజానికి శంకర్ బాబా పాపల్కర్ ఇచ్చిన ఈ బాధ్యత నాకు పెద్ద పరీక్ష. మాలా పట్టుదల, కృషిని నేను నమ్మాను. గురువారం సాయంత్రం మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే ముందుగా శంకర్ బాబాయ్​కు ఫోన్ చేసి శుభవార్త తెలియజేశాను" అని తెలిపారు.

Visually Impaired Girl Got Government Job
ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మాలా (Source : ETV Bharat)

శ్రమశక్తితో విజయం!
శంకర్ బాబా పాపాల్కర్ కూడా భావోద్వేగానికి గురవుతూ ఈటీవీ భారత్​తో మట్లాడారు. "చెత్తకుప్పలో దొరికిన ఓ అమ్మాయి నేడు దృఢ సంకల్పం, శ్రమశక్తితో విజయం సాధించింది. పద్మశ్రీ అవార్డును అందుకోవడం కన్నా మాల విజయం పట్ల మరింత గర్వపడుతున్నాను. మాలా అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంది. వేల మంది విద్యార్థులు హాజరైన పరీక్షలో మాలా విజయం సాధించడం నిజంగా సంతోషించదగ్గ విషయం" అని తెలిపారు శంకర్ బాబా.

'IAS అవ్వడమే నా లక్ష్యం'
మహారాష్ట్ర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని మాలా తెలిపింది. "నేను అక్కడితో ఆగను. సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాయాలనుకుంటున్నాను. పద్మశ్రీ శంకర్ బాబా పాపల్కర్ పేరును ఉన్నత సిత్థికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. IAS అవ్వడమే నా లక్ష్యం. దేవుడే నన్ను ఈ అనాథాశ్రమానికి చేర్చారు" అని తెలిపింది మాలా.

వాట్సాప్ గ్రూపును రూ.6,400 కోట్ల కంపెనీగా మార్చిన యువకుడు - ఒక్క ఐడియాతో లైఫ్ ఛేంజ్​! - Dunzo Founder Kabeer Biswas

భళా బండి గాయత్రి- టాటా స్టీల్‌ మొదటి మహిళ ఉద్యోగి సక్సెస్ స్టోరీ - Bandi Gayathri success story

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.