ETV Bharat / bharat

తగ్గిన 'వందేభారత్‌' స్పీడ్- గంటకు 76 కిలోమీటర్లే! - What Is Vande Bharat Train Speed

Vande Bharat Train Speed : వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు స‌గ‌టున గంట‌కు 76 కిలోమీట‌ర్ల వేగంతోనే ప్రయాణిస్తున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత మూడేళ్లలో 84 కిలోమీటర్ల వేగం నుంచి 76 కిలోమీటర్ల వేగానికి తగ్గిందని తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అప్‌గ్రేడ్‌ కానీ ట్రాక్‌ల వల్లే వేగం తగ్గించాల్సి వస్తోందని వివరించింది. ఓ ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నలకు రైల్వే మంత్రిత్వశాఖ సమాధానం ఇచ్చింది.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 5:27 PM IST

Vande Bharat Train Speed : వందే భారత్‌ రైలు సగటు వేగం గత మూడేళ్లలో గంటకు 84 కిలోమీటర్ల వేగం నుంచి 76 కిలోమీటర్ల వేగానికి తగ్గిందని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా అందిన ఓ దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. వందే భారత్‌ రైలు సగటు వేగం ఎంతో చెప్పాలంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ అనే వ్యక్తి రైల్వే శాఖకు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దానికి వందేభారత్ రైళ్ల సగటు వేగం 2020-21లో 84.48 కిలోమీటర్లు ఉందని, 2023-24 నాటికి ఆ సగటు వేగం 76.25 కిలోమీటర్లకు తగ్గిందని రైల్వే మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది.

వేగం తగ్గడానికి ఇవే కారణాలు!
వందే భారత్‌ రైళ్ల వేగం తగ్గడానికి కారణాలను కూడా రైల్వే మంత్రిత్వ శాఖ వివరించింది. భౌగోళిక కారణాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల వేగ పరిమితులు విధించామని చెప్పింది. ముంబయి CSMT నుంచి మడ్గావ్ మధ్య నడిచే వందే భారత్ రైలును ఉదాహరణగా పేర్కొంటూ సెంట్రల్ రైల్వే జోన్ అధికారి ఒకరు వేగం ఎందుకు తగ్గిందో వివరించారు. కొంకణ్ రైల్వే జోన్ ప్రాంతంలో ఎక్కువ భాగం ఘాట్లు ఉంటాయని, ఇక్కడ రైళ్లు తక్కువ ఎత్తు ఉన్న పర్వత శ్రేణుల గుండా వెళ్తాయని తెలిపారు. అలాంటి ప్రాంతాల్లో ప్రయాణం చాలా కష్టమని, అందుకే వందే భారత్‌ రైళ్ల వేగాన్ని పెంచడం వల్ల భద్రతతో రాజీ పడాల్సి రావచ్చని వెల్లడించారు. వర్షాకాలంలో అన్ని రైళ్లకు గరిష్ఠ వేగాన్ని 75 కిలోమీటర్లుగా ఉంచాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.

2019న ప్రారంభించిన వందే భారత్ సెమీ-హై స్పీడ్ రైలు గరిష్ఠంగా 160 కిమీ వేగంతో నడుస్తోంది. ట్రాక్ పరిస్థితులు అనుకూలించని కారణంగా దిల్లీ- ఆగ్రా మార్గంలో మినహా దేశంలో ఎక్కడా 130 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో రైళ్లు వెళ్లలేకపోతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. దిల్లీ-ఆగ్రాల మధ్య భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై స్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ 160 కిలోమీటర్లు వేగంతో దూసుకుపోతోంది. అక్కడ మాత్రమే వందే భారత్ 160 కి.మీ. వేగంతో నడుస్తోంది. మిగిలిన ప్రదేశాల్లో వందే భారత్‌ రైలు గరిష్ఠ వేగం 130 కిమీ కన్నా తక్కువని మరొక రైల్వే అధికారి తెలిపారు.

దేశంలో వందేభారత్ రైళ్లు బాగా ప్రాచుర్యం పొందాయని, మార్చి 31 వరకు 2.15 కోట్ల మందికి పైగా ప్రయాణించారని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం 284 జిల్లాలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అనుసంధానించామని భవిష్యత్తులో ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుందని వివరించింది.

ఆర్టీఐ దరఖాస్తుదారు ఏమన్నారంటే?
అయితే ఆర్టీఐ ద్వారా రైల్వేకు దరఖాస్తు చేసిన మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ సమాచారం అందిన తర్వాత మీడియాతో మాట్లాడారు. 2020-21లో వందేభారత్ రైళ్ల సగటు వేగం 84.48గా ఉందని, ఇది 2022-23లో 81.38 కిలోమీటర్లకు తగ్గిందని వివరించారు. 2023-24లో 76.25కి తగ్గిందని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.