Vande Bharat Sleeper Trains : ప్రయాణికుల కోసం వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే మెరుగ్గా ఉండే ఈ రైళ్ల ట్రయల్ రన్ త్వరలోనే ప్రారంభం కానుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆగస్టు 15 నాటికి ట్రయల్ నిర్వహించనున్నట్లు వివరించారు.
మెరుగైన సౌకర్యాలతో
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ పూర్తి చేసుకుని ఇంకో రెండు నెలల్లో పటాలెక్కనుంది. దీంతో ఇప్పటివరకు కూర్చొని ప్రయాణించేందుకు వీలుండే ఈ వందేభారత్ రైళ్లలో ఇక నుంచి స్లీపర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలను అందించనుంది. మిగతా రైళ్లతో పోలిస్తే ఈ ప్రీమియం రైలులో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
'వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ పూర్తి చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండు నెలల్లో మొదటి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపైకి వస్తుంది. ఈ రైళ్లను బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML) వారు తయారు చేస్తున్నారు. ప్రయాణికులకు ఆత్యాధునిక మెరుగైన సౌక్యరాలతో అందించనుంది. దాదాపు 200 కిమీ వేగంతో ప్రయాణించేలా ఈ స్లీపర్ రైళ్లను రూపొందించారు. ఏసీ ఫస్ట్ క్లాస్ 1, టూ - టైర్ ఏసీ 4, త్రీ టైర్ ఏసీ 11 కంపార్ట్మెంట్లతో మొత్తం 16 బోగీలతో ఈ రైళ్లను తయారు చేశారు' అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఛైర్‌కార్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య సర్వీసులను అందిస్తున్నాయి. ఇక మరిన్ని మెరుగైన సదుపాయలు కల్పించడంలో భాగంగా దాదాపు 40 వేల సాధారణ కోచ్‌లను అధునాతన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తరహా కోచ్‌లుగా మారుస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది.
రైల్వే మంత్రిత్వ శాఖ అరుదైన రికార్డ్
మరోవైపు భారతీయ రైల్వే అరుదైన రికార్డ్‌ను సాధించింది. ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్ సర్వీస్ ఈవెంట్‌గా 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్'లో చోటు సంపాదించింది. రైల్వే బ్రిడ్జిల ప్రారంభోత్సవం, రైల్వే స్టేషన్ల శంకుస్థాపన కోసం ఈ ఏడాది ఫిబ్రరి 26న రైల్వే మంత్రిత్వ శాఖ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా 2,140 చోట్ల ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మొత్తం 40,19,516 మంది హాజరయ్యారు. దీంతో అతి పబ్లిక్ సర్వీస్ ఈవెంట్‌గా రికార్డ్ సృష్టించింది.
అదుపుతప్పి అలకనంద నదిలో పడ్డ వాహనం- 14మంది మృతి- నిద్రమత్తే కారణం! - Vehicle Fell Into River
వాహనదారులకు బిగ్ షాక్- పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన ప్రభుత్వం- ఎంతంటే?