ETV Bharat / bharat

ప్రేమికుల రోజున మీ లవర్​కు ఈ గిఫ్ట్‌ ఇవ్వండి - ఖర్చు తక్కువ ఎఫెక్ట్ ఎక్కువ! - tips for Valentines Day Gifts

Valentines Day Gifts : ప్రేమికుల రోజున మీ లవర్​కు ఏదైనా గిఫ్ట్‌గా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా? ఏం ఇవ్వాలో అర్థం కావట్లేదా? అయితే.. ఈ లిస్టు చూడండి.. తక్కువ ఖర్చులో మంచి ఎఫెక్టివ్​గా ఉంటాయి!

Valentines Day Gifts
Valentines Day Gifts
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 1:01 PM IST

Valentines Day Gifts : ఫిబ్రవరి నెల.. ఇది అందరికీ మామూలు సాధారణ నెలలానే కనిపిస్తుంది. కానీ, ప్రేమికులకు మాత్రం ఎంతో అమూల్యమైన మాసం. మనసుకు నచ్చిన, మనసు దోచిన వారికి.. తమ ప్రేమను తెలియజేయడానికి ఫిబ్రవరి 14 అద్భుతమైన సమయంగా భావిస్తుంటారు. అందుకే ఎన్నో ప్రేమ జంటలు ఈ ఫిబ్రవరి నెల గురించే ఎంతో ఉత్సహాంగా ఎదురు చూస్తుంటాయి.

అయితే, మీరు ఎంతగానో ప్రేమించే మీ ప్రేయసి లేదా ప్రేమికుడికి మీరు వాలెంటైన్స్ డే రోజు ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటున్నారా ? అయితే, ఇక్కడ ఉన్న వాటిలో ఏదో ఒకటి అందించండి. వారు మీ ప్రేమను పది కాలాల పాటు గుర్తుంచుకోవడం గ్యారంటీ. ఆ అద్భుతమైన రూ.500లలోపు గిఫ్ట్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బుక్స్‌ :
మీరు ఎంతగానో ప్రేమించే వ్యక్తికి బుక్‌ రీడింగ్ అంటే ఇష్టం ఉంటే.. ఏదైనా ఒక మంచి పుస్తకాన్ని వారికి వాలెంటైన్స్ డే రోజు గిఫ్ట్‌గా ఇవ్వండి. ఆ పుస్తకంలో ప్రతీ పేజీ చదువుతున్నప్పుడు మీరు వారితో ఉన్నట్లే వారు భావిస్తారు. ఆ పుస్తకం తోడుంటే మీరు వారి వెన్నంటే ఉన్నరనే భరోసాతో జీవిస్తారు.

పెర్ఫ్యూమ్ :
మనం ఎంత బాగా రెడీ అయినా కూడా ఒక్కసారి బాడీకి పెర్ఫ్యూమ్‌ను స్పే చేసుకున్నామంటే రోజంతా ఆ ఉత్సహం వేరేలా ఉంటుంది. అయితే, మీ ప్రేయసికి మీరు అనుక్షణం గుర్తుండాలంటే వారికి ప్రేమికుల రోజు మంచి పెర్ఫ్యూమ్‌ బాటిల్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి.

సన్ గ్లాసెస్ :
దాదాపు రోజురోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతోంది. కాబట్టి, మీ ప్రేయసికి ప్రేమికుల రోజు సన్‌గ్లాసెస్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి. దీనివల్ల వారు గ్లాసెస్‌ పెట్టుకున్న ప్రతిసారీ వారి కళ్లకు రక్షణ మీరందంచిన సన్‌గ్లాసెస్‌ను చూసుకుని మురిసిపోతుంటారు.

ఇయర్ ఫోన్స్ :
నేటి డిజిటల్‌ యుగంలో స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఇయర్‌ ఫోన్స్ వంటివి కచ్చితంగా ఉంటాయి. అయితే, మీరు మీ ప్రేయసికి ఫిబ్రవరి 14వ తేదీన బహుమతిగా బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు లేదా వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను అందించండి. దీంతో వారు మ్యూజిక్‌ను వింటున్న ప్రతి క్షణం మీ గురించే ఆలోచిస్తుంటారు.

మెుబైల్ ఫోన్ బ్యాక్ కవర్ :
స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు తమ ఫోన్ బ్యాక్ కవర్‌ విభిన్నంగా ఉండాలని ఆలోచిస్తుంటారు. అయితే, మీరు వాలెంటైన్స్ డే రోజు గిఫ్ట్‌గా ఏదైనా మంచి డిజైన్‌ ఉన్న బ్యాక్‌కవర్‌ను మీ లవర్‌కు అందించండి.

వాలెంటైన్స్ వీక్​లో ఇవాళ "ప్రపోజ్ డే" - స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్ మీకోసం!

వాలెంటైన్స్​ డే వాస్తు - మీ లవర్​కు ఈ గిఫ్ట్స్​ ఇవ్వాలి, అలాంటివి ఇవ్వొద్దు!

Lovers Kissing Viral Video : ఇదేందయ్యా ఇదీ.. వేగంగా వెళ్తున్న కారు టాప్‌పై రెచ్చిపోయిన ప్రేమ జంట.. వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.