ETV Bharat / bharat

వాలెంటైన్స్​ డే వాస్తు - మీ లవర్​కు ఈ గిఫ్ట్స్​ ఇవ్వాలి, అలాంటివి ఇవ్వొద్దు! - February 14

Valentines day gift ideas as per vastu : ప్రేమికుల దినోత్సవం వచ్చేస్తోంది. దీంతో.. ఇప్పట్నుంచే ప్రేమికులు వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. పార్ట్​నర్​కు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా.. అని ఆలోచిస్తుంటారు. అయితే.. వాస్తు ప్రకారం కొన్ని గిఫ్టులు ఇవ్వొద్దని సూచిస్తున్నారు నిపుణులు!

Valentines day gift ideas as per vastu
Valentines day gift ideas as per vastu
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 2:53 PM IST

వాలెంటైన్స్ డే కోసం ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. తమ ప్రేమను వ్యక్తం చేయడానికి కొందరు.. ఉన్న ప్రేమను బలపరుచుకోవడానికి మరికొందరు.. ఇలా లవర్స్​ అంతా ఫిబ్రవరి 14 కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ సందర్భంగా.. తమ లవర్​ను ఎంతగా ప్రేమిస్తున్నామో చెప్పేందుకు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. అయితే.. గిఫ్టులు ఇవ్వడానికి కూడా వాస్తు చూడాలని చెబుతున్నారు కొందరు వాస్తు నిపుణులు. కొన్ని రకాల బహుమతులు ఇవ్వకూడదని చెబుతూ.. ఎలాంటివి ఇవ్వాలో సూచిస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఫిబ్రవరి నెల వచ్చిందంటే.. ప్రేమికుల్లో ఆనందం మరింతగా పెరిగిపోతుంది. వారి ఊహలకు మరింతగా రెక్కలు మొలుస్తాయి. తమ పార్ట్​నర్​ను ఎంతగా ప్రేమిస్తున్నామో చెప్పేందుకు ఎదురు చూస్తుంటారు. కొందరు ఫిబ్రవరి 14న ఓపెన్ అయిపోతే.. మరికొందరు ముందునుంచే ప్రేమ పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇందుకోసం వాలెంటైన్ వీక్ ను ఫాలో అవుతుంటారు.

ఫిబ్రవరి 7వ తేదీ నుంచి వాలెంటైన్స్ వీక్ స్టార్ట్ అవుతుంది. ఈ వారంలో రోజుకో ప్రత్యేకత ఉంటుంది. 7వ తేదీన "రోజ్ డే"తో మొదలై.. 13వ తేదీన "కిస్ డే"తో ముగుస్తుంది. ఆ తర్వాతి రోజున ఎంతగానో ఎదురు చూసే.. ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే.. ఈ లవర్స్ డే సందర్భంగా పార్ట్​నర్స్​.. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. ఈ బహుమతుల్లో అదీ ఇదీ అని కాకుండా అన్ని రకాలూ ఉంటాయి. కొందరు పువ్వులు ఇచ్చుకుంటారు. మరికొందరు చాక్లెట్లు, టెడ్డీ బేర్ లాంటి బొమ్మలు, ఫొటో ఫ్రేమ్‌లు, ఫోన్లు వంటి.. అనేక వస్తువులను బహుమతిగా ఇస్తారు. అయితే.. వాస్తు శాస్త్ర నిపుణులు మాత్రం.. ఈ రోజున కొన్ని బహుమతులు ఇస్తే ఇద్దరి మధ్య ప్రేమస సంతోషం పెరుగుతాయి. మరికొన్ని బహుమతులు ఇస్తే ఇబ్బందులు రావొచ్చు అని చెప్తున్నారు.

ఇంటికి వాస్తు ఎలా చూస్తారో తెలిసిందే. అదేవిధంగా ప్రేమకూ వాస్తు చూడాలని చెబుతున్నారు. కాబట్టి, బహుమతిగా ఏం ఇస్తున్నారు అనేది ముఖ్యమని అంటున్నారు. అనుకూలమైన గిఫ్ట్స్ ఇవ్వడం ద్వారా.. మీ బంధానికి అవి మరింత మాధుర్యాన్ని యాడ్ చేస్తాయని చెబుతున్నారు. వ్యతిరేకమైనవి ఇస్తే ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. ఈ లెక్క ప్రకారం.. ప్రేమికుల రోజున ఎలాంటి ముళ్ల జాతికి చెందిన మొక్కలనూ బహుమతిగా ఇవ్వొద్దని సూచిస్తున్నారు. అది మీ రిలేషన్ షిప్​లో టెన్షన్ క్రియేట్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మీ భాగస్వామికి వెదురు మొక్కను బహుమతిగా ఇస్తే.. చక్కగా ఉంటుందని చెబుతున్నారు. వెదురు మొక్కను గిఫ్ట్ గా ఇవ్వడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. దీన్ని అదృష్ట మొక్కగా భావిస్తారు. ఇలాంటి బహుమతి ఇవ్వడం ద్వారా మీ జీవితంలో అభివృద్ధి, శ్రేయస్సు నిలుస్తాయని చెబుతున్నారు.

లవర్స్ డే రోజున పార్ట్​నర్​కు లాఫింగ్ బుద్ధను కూడా బహుమతిగా ఇవ్వొచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. లాఫింగ్ బుద్ధ ఇంటికి శాంతిని కలిగించడంతోపాటు మీ జీవితాల్లో ఆనందాలను నింపుతుందని సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రంలో లాఫింగ్ బుద్ధను శాంతికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు.

ఇంకా ఫ్లవర్స్.. ఈ ప్రపంచంలో అత్యంత ప్రియమైన బహుమతులు పువ్వులే. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఎరుపు రంగు గులాబీ పుష్పాలను గిఫ్ట్​గా ఇవ్వడం మంచిదట. ముళ్లు వివాదాలను సూచిస్తే.. పువ్వులు ప్రేమ బంధానికి గుర్తుగా ఉంటాని చెబుతున్నారు. ఇలా.. వాస్తు అనుకూలమైన బహుమతులను ప్రేమికుల దినోత్సవాన ఇచ్చిపుచ్చుకోవాలని సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.