UP Train Accident Today : ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో చండీగఢ్- డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ముగ్గురు మరణించారు. 33 మంది గాయపడ్డారు. గురువారం మధ్యాహ్నం 2.35 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన రైలు ఉదయం 11.30 గంటలకు చండీగఢ్ స్టేషన్ నుంచి అసోంలోని డిబ్రూగఢ్‌కు బయల్దేరింది. గురువారం మధ్యాహ్నం యూపీలోని ఝులాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో రైలులోని నాలుగు ఏసీ బోగీలు సహా 12 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే రైలు పట్టాలు తప్పిన వెంటనే ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వారంతా కేకలు వేయడం ప్రారంభించారు. రైలు ఆగిన వెంటనే దిగి పరుగులు తీశారు.
VIDEO | A few bogies of Dibrugarh Express derailed near UP's Gonda railway station earlier today. Details awaited. pic.twitter.com/SfJTfc01Wp
— Press Trust of India (@PTI_News) July 18, 2024
హెల్ప్‌లైన్ నంబర్స్ ఏర్పాటు
డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనపై రైల్వేశాఖ దర్యాప్తు ప్రారంభించింది. హెల్ప్‌లైన్ నంబర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన వివరాలను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. కొన్ని రైళ్లను దారి మళ్లిస్తామని తెలిపింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రందగా గాయపడ్డ వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50000 అనౌన్స్ చేసింది. CRS విచారణతో పాటు, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.
- v=
In regard with the derailment of 15904 Dibrugarh Express in Lucknow division of North Eastern Railway, the helpline numbers are issued. pic.twitter.com/pe3CECrnmf
— Ministry of Railways (@RailMinIndia) July 18, 2024
సీఎంల స్పందన
మరోవైపు, గోండా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కూడా రైలు ప్రమాదంపై స్పందించారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు, సంబంధిత వర్గాలతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు సీఎంఓ వెల్లడించింది. మృతుల్లో తమ రాష్ట్రానికి చెందిన వారెవరు లేరని హిమంత బిశ్వశర్మ తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు.
#UPCM @myogiadityanath ने जनपद गोंडा में ट्रेन हादसे का संज्ञान लेते हुए जिला प्रशासन के अधिकारियों को मौके पर पहुंचकर राहत कार्य में तेजी लाने के निर्देश दिए हैं।
— CM Office, GoUP (@CMOfficeUP) July 18, 2024
मुख्यमंत्री जी ने अधिकारियों को घायलों को तत्काल अस्पताल पहुंचाकर उनके समुचित उपचार के निर्देश दिए हैं। साथ ही,…
‼️HCM Dr @himantabiswa has been briefed about the derailment of Dibrugarh - Chandigarh express in Uttar Pradesh.
— Chief Minister Assam (@CMOfficeAssam) July 18, 2024
HCM is monitoring the situation and the Government of Assam is in touch with relevant authorities.
'కవచ్' ఉంటే బంగాల్ రైలు ప్రమాదం తప్పేదా? అసలేంటీ వ్యవస్థ? - Kavach System In Railway