ETV Bharat / bharat

పంచాయతీ సభ్యుడిపై గ్రామస్థుల ప్రేమ- అమ్మాయిని వెతికి మరీ పెళ్లి

Unique Marriage In Karnataka : గ్రామస్థులు అందరూ కలిసి తమ గ్రామ పంచాయతీ సభ్యుడికి వధువుని వెతికి మరీ వివాహం జరిపించారు. అలానే పెళ్లి ఖర్చులు కూడా భరించారు. మరోవైపు ఓ అనాథ యువతికి జిల్లా పరిపాలన యంత్రాంగం పెళ్లి జరిపించింది. ఇంటర్వ్యూ ద్వారా వరుడ్ని ఎంపిక చేశారు.

Unique Marriage In Karnataka
Unique Marriage In Karnataka
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 9:22 PM IST

Unique Marriage In Karnataka : గ్రామస్థులు అందరూ కలిసి తమ గ్రామ పంచాయతీ సభ్యుడికి అమ్మాయిని వెతికి మరీ వివాహం చేశారు. పెళ్లి ఖర్చులు కూడా భరించారు. ఈ వేడుకను ఘనంగా జరిపించి నూతన దంపతులను ఆశ్వీరాదించారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

దావణగారే మండలంలోని గూడాల్ గ్రామ పంచాయతీ సభ్యుడు అంజినప్ప(45). అంజినప్ప అంటే ఊరందరికీ ప్రేమ. గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేశాడు. అలానే తన ఓమ్ని కారును అంబులెన్స్ రూపంలో మార్చి అత్యవసర సేవలు అందిస్తున్నాడు. అలానే గ్రామంలో ప్రజలకు ఏ పని చేయడానికైనా ముందుకు వచ్చి మరి చేసేవాడు. ప్రజలకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉండేవాడు. ఫలితంగా అంజినప్పను మూడు సార్లు పంచాయితీ సభ్యుడిగా గ్రామస్థులు ఎన్నుకున్నారు.

అయితే అంజినప్ప తన చెల్లిళ్ల కోసం పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ గ్రామస్థులు పెళ్లి చేసుకోవాలని ప్రోత్సహించారు. స్వయంగా గ్రామస్థులే వధువును చూశారు. హర్పనహళ్లి మండలానికి చెందిన పల్లవితో ఫిబ్రవరి 2న పెళ్లి చేశారు. కులమత భేదాలు లేకుండా గ్రామస్థులు అందరు కలిసి వివాహనికి కావాల్సిన మొత్తం ఖర్చులు భరించారు.

అనాథ యువతికి పెళ్లి చేసిన జిల్లా యంత్రాంగం
అనాథ ఆశ్రమంలో పెరిగిన ఓ యువతికి జిల్లా యంత్రాంగం వివాహం జరిపించింది. ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇంటర్వ్యూ ఆధారంగా వరుడిని ఎంపిక చేశారు. జిల్లా పరిపాలన యంత్రాంగం మొత్తం వధువు కుటుంబంగా నిలిచి ఈ వేడుకను ఘనంగా జరిపించారు. ఈ వివాహం హరియాణాలో జరిగింది.

ఇంటర్వ్యూ ద్వారా వరుడు ఎంపిక
కరిష్మా(19)ను చిన్నప్పుడే తల్లిదండ్రులు ఓ అనాథ అశ్రమంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ముందు బహదూర్​ఘర్​లో ఉండేది. ఆ తర్వాత రోహ్​తక్​ బాల్ భవన్​లోని అనాథ ఆశ్రమంలో పెరిగింది. అక్కడే ఇంటర్​ వరకు చదువుకుంది. కరిష్మా పెళ్లి కోసం వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చారు. పెళ్లికి 10 దరఖాస్తులు వచ్చాయి. అయితే వరుడిని ఎంపిక చేసేందుకు జిల్లా పరిపాలన యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 10 మందిని ఇంటర్వ్యూ చేసి ఇద్దరిని సెలక్ట్ చేశారు. ఆ ఇద్దరిని కరిష్మాకు పరిచయం చేశారు. చివరిగా రోహ్​తక్​కు చెందిన నిక్కూ గులియాను కరిష్మా ఎంపిక చేసింది. నిక్కూ గులియా ఒక టెలికాం కంపెనీ సూపర్​ వైజర్​గా పని చేస్తున్నాడు.

Unique Marriage In Haryana
కరిష్మా, నిక్కూ గూలియా పెళ్లి

ఫిబ్రవరి 2న వివాహ తేదీని నిర్ణయించారు. ఈ పెళ్లిని అనాథ అశ్రమంలోనే నిర్వహించారు. అందుకు అయ్యే ఖర్చులను మైక్రో పౌండేషన్ పెట్టుకుంది. ఈ వేడకకు జిల్లా సెషన్స్​ కోర్టు న్యాయమూర్తి నీర్ల కుల్వంత్, డీసీ అజయ్​కుమార్, రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్​పర్సన్​ రంజితా మెహతా వచ్చారు. అదే సమయంలో బీజేపీ నేత అజయ్​ ఖుండియా వధువు మేనమామగా ఉన్నారు.

వరుడు లేకుండానే వందలాది యువతుల పెళ్లి- ఎందుకో తెలిస్తే షాక్​!

70 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన వృద్ధ జంట.. కన్నీళ్లు పెట్టుకున్న వధువు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.