ETV Bharat / bharat

లేటరల్ ఎంట్రీలపై వెనక్కి తగ్గిన కేంద్రం- రద్దు చేయాలని యూపీఎస్​సీకి లేఖ! - Lateral Entry UPSC Issue - LATERAL ENTRY UPSC ISSUE

Lateral Entry UPSC Issue : లేటరల్ ఎంట్రీలపై ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గింది! ఉన్నత ఉద్యోగాల్లో లేటరల్‌ ఎంట్రీపై సంయుక్త కార్యదర్శులు, ఉప కార్యదర్శులు/ డైరెక్టర్ల నియామకానికి నియమాక ప్రకటనను ఉపసంహరించుకోవాలని యూపీఎస్​సీకి లేఖ రాసింది.

Union Minister On Lateral Entry
Union Minister On Lateral Entry (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 20, 2024, 3:00 PM IST

Updated : Aug 20, 2024, 3:34 PM IST

Lateral Entry UPSC Issue : లేటరల్ ఎంట్రీ ద్వారా నియామకాలు చేపట్టేందుకు యూపీఎస్​సీ విడుదల చేసిన ప్రకటనలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఉన్నత ఉద్యోగాల్లో లేటరల్‌ ఎంట్రీపై సంయుక్త కార్యదర్శులు, ఉప కార్యదర్శులు/ డైరెక్టర్ల నియామకానికి నియమాక ప్రకటనను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ యూపీఎస్​సీ చైర్మన్ ప్రీతి సూదన్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం శాఖల్లో అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలంటే ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో వెల్లడించారు. సామాజిక న్యాయంపై మోదీ సర్కారు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ అంశాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

"రాజ్యాంగం ప్రకారం సమానత్వం, సామాజిక న్యాయం సూత్రాలకు అనుగుణంగా నియామకాలు ఉండాలి. లేటరల్ ఎంట్రీలో నియమాకాల్లో నిబంధనలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ప్రధాన మంత్రి మోదీ సామాజిక భద్రతపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ అంశాన్ని సమీక్షించి, సంస్కరించాల్సిన అవసరం ఉంది. అందువల్ల 17.8.2024న జారీ చేసిన లేటరల్ ఎంట్రీ రిక్రూట్‌మెంట్ ప్రకటనను రద్దు చేయాలని యూపీఎస్​సీని కోరుతున్నాం" కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తన లేఖలో పేర్కొన్నారు.

ప్రధాని మోదీ ముఖ్యమైన నిర్ణయం తీసుకుని రాజ్యాంగ నిబద్ధతను కాపాడారని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సామాజిక న్యాయం పట్ల తనకున్న నిబద్ధతను ఎప్పటినుంచో చూపిస్తున్నారని తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్‌ సూత్రాలను పరిగణనలోకి తీసుకోలేదని, కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడారా? అని అశ్వినీ వైష్ణవ్ ప్రశ్నించారు.

రాజ్యాంగాన్ని అన్ని విధాల రక్షిస్తాం!
మరోవైపు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఎక్స్‌ వేదికగా లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను అన్ని విధాల రక్షిస్తామని తెలిపారు. లేటరల్‌ ఎంట్రీ వంటి బీజేపీ కట్రలను ఎట్టిపరిస్థితుల్లో అమలు పరచకుండా చూస్తామన్నారు. కులగణన ద్వారా, 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని రద్దు చేయడం ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని మరోసారి పునరుద్ఘాటించారు. లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షపార్టీల లేటరల్‌ నియామకాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం కారణంగానే నియామక నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కేంద్రం కోరినట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

'లేటరల్‌ ఎంట్రీ పేరుతో - ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను బీజేపీ హరిస్తోంది' - రాహుల్ గాంధీ - Rahul Gandhi On Lateral Entry

పార్టీలో ఎన్నో అవమానాలు- ఎవరు తోడుగా వస్తే వారితో వెళ్తా: చంపయీ - Champai Soren Letter

Last Updated : Aug 20, 2024, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.