ETV Bharat / bharat

భక్తులకు తీపి వార్త​ : తిరుమల స్వామివారి లడ్డూపై కీలక నిర్ణయం! - Tirumala Laddu Taste Increase - TIRUMALA LADDU TASTE INCREASE

Tirumala : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్​న్యూస్​ చెప్పింది. తిరుమలకు సంబంధించిన పలు విషయాల్లో గత కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదులకు చెక్​ పెట్టే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో తిరుమలకు మంచి రోజులు రాబోతున్నాయని పలువురు భక్తులు భావిస్తున్నారు.

Tirumala
Tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 1:49 PM IST

Tirumala Laddu Taste Increase: తిరుమల అంటే స్వామి వారిని దర్శిస్తే కనులకు ఎంత ఇంపుగా ఉంటుందో.. తిరుపతి ప్రసాదం తింటే అంత కమ్మగా ఉంటుంది. అందుకే.. తెలిసిన వారు ఎవరైనా తిరుపతి వెళ్లారంటే మొహమాటం లేకుండా లడ్డూ ప్రసాదం ఎక్కడ? అని అడుగుతారు. తిరుపతి లడ్డూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. ఇతర ప్రాంతాల్లో కూడా చాలా ఫేమస్.​ ఇంత ప్రాచుర్యం పొందిన​ శ్రీవారి లడ్డూ నాణ్యత తగ్గిందనే అభిప్రాయం చాలా కాలం నుంచి భక్తులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో తిరుమలకు మంచి రోజులు రాబోతున్నాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

భక్తులకు నాణ్యమైన, రుచికరమైన లడ్డూలని అందించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు టీటీడీ ఈవో శ్యామలరావు పలు సూచనలు చేశారు. శ్రీవారి లడ్డూ నాణ్యతను మరింత పెంచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి విషయంపై ఫోకస్ చేశారు. నాణ్యమైన నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి..? కొనుగోలు చేసిన నెయ్యిని ప్రస్తుతం పరీక్షిస్తున్న విధంగా కాకుండా మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా పరీక్షించాలి? వంటి అనేక అంశాలపై చర్చించారు.

వారంతా ఎంత పుణ్యం చేసుకున్నారో - ప్రతీవారం తిరుమల శ్రీవారి దర్శనం! - Good News for Tirupati Local People

లడ్డూ నాణ్యత పెంచేందుకు ఎస్ఎస్ఐ నిబంధనల ప్రకారం నాణ్యమైన నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారు? ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అగ్ మార్క్, టీటీడీ నిబంధనల ప్రకారం నెయ్యి నాణ్యత ఎలా ఉండాలి? అనే విషయాలను అధికారులకు వివరించారు. లడ్డూ నాణ్యత మరింత పెంచడానికి అవసరమైన నెయ్యిని సమకూర్చుకోవడానికి త్వరలోనే సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఈవో ఆదేశించారు.

ఇక ఇది వరకే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై టీటీడీ అధికారులు, "పోటు" సిబ్బందితో సమీక్ష చేశారు ఈవో. స్వచ్ఛమైన నెయ్యి, యాలకులు, శనగపిండి ఉపయోగించి మరింత రుచికరంగా తిరుమల లడ్డూలను తయారు చేసి.. మొదట నాణ్యతను పరిశీలించాలని సూచించారు. దీంతో.. త్వరలోనే స్వామి వారి లడ్డూలు మరింత రుచికరంగా అందుబాటులోకి రానున్నాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

18 గంటల సమయం: శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా శనివారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీసీ వరకు క్యూలైన్‌లో వేచిఉన్నారు. వీరికి సుమారు 18 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని టీటీడీ తెలిపింది. శుక్రవారం శ్రీవారిని 66 వేల 256 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.54 కోట్లు హుండీ కానుకలు లభించాయి. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది.

టీటీడీ గుడ్ న్యూస్ - ఉచితంగా కారు సాకర్యంతో స్వామి దర్శనం- వారికి మాత్రమే! - Free Darshan for Senior Citizens

తిరుమల వెళ్తున్నారా? - కొండపై గదులు దొరక్కపోతే ఏం చేయాలి? - ఇలా చేస్తే పక్కా! - Rental Rooms in Tirumala

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.