ETV Bharat / bharat

'పార్టీలో అవినీతిపరులకు అడ్డూ అదుపు లేదు- మెడికో హత్యాచారంపై దీదీ అరకొర చర్యలు' : TMC నేత జవహర్‌ సర్కార్‌ - TMC MP Jawhar Sircar Resigns - TMC MP JAWHAR SIRCAR RESIGNS

TMC MP Jawhar Sircar Resigns : బంగాల్​లో మమతా సర్కార్​కు బిగ్​ షాక్ తగిలింది!. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ జవహర్‌ సర్కార్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆర్​జీ కర్ ఘటనపై మమత వ్యవహరించిన తీరుపై విమర్శలు గుప్పించారు.

TMC MP Jawhar Sircar
TMC MP Jawhar Sircar (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 4:55 PM IST

TMC MP Jawhar Sircar Resigns : బంగాల్​లోని ఆర్​జీ కర్‌ ఆసుపత్రి ఘటనపై ఇప్పటికే సీబీఐ విచారణ, సుప్రీం కోర్టు ఆగ్రహంతో అతలాకుతలం అవుతున్న మమత ప్రభుత్వానికి మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జవహర్‌ సర్కార్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాసిన లేఖలో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని లేఖలో ఎండగట్టారు. ఘటనపై చర్యలు తీసుకోవడాంలో మమత నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఆర్​జీ కర్‌ ఘటనకు నిరసనగా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జవహర్‌ సర్కార్‌ లేఖలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మమతాకు రాసిన లేఖలో ''పార్టీలో అస్మదీయులు, అవినీతిపరులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అవినీతిపై ప్రభుత్వానికి ఆందోళన లేకపోవడం, ఒక వర్గం నాయకులు మిగిలిన వారిని అణగదొక్కడం వంటి చర్యలతో నాకున్న భ్రమలు తొలగిపోయాయి. అవినీతి అధికారులు అందలం ఎక్కడం వంటి విషయాలను నేను అంగీకరించలేకపోతున్నాను. పార్టీలో ఉన్న ఇన్ని సంవత్సరాలలో ఈ స్థాయి ఆందోళన, ప్రభుత్వ విశ్వాస రాహిత్యాన్ని నేను ఎన్నడూ చూడలేదు.

ఆర్​జీ కర్‌ ఆస్పత్రిలో భయంకర ఘటన జరిగిన తర్వాత ఓపిగ్గా నెలరోజులపాటు ఎదురు చూశాను. మీరు (మమతా బెనర్జీ) పాత శైలిలో నేరుగా రంగంలోకి దిగి జూనియర్‌ డాక్టర్ల సమస్యపై స్పందిస్తారని ఆశించాను. కానీ, అది జరగలేదు. ప్రభుత్వం ఇప్పుడు చాలా ఆలస్యంగా అరకొర చర్యలు తీసుకొంది. పార్లమెంట్‌లో బంగాల్‌ సమస్యలు ప్రస్తావించేందుకు మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఇక ఎంపీగా కొనసాగలేను. అవినీతి, మతతత్వం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో నియంతృత్వంపై పోరాడటంలో ఏమాత్రం రాజీలేదు'' అని జవహర్‌ మమతకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

సందీప్ ఘోష్ విషయంలో మమత సర్కార్​పై విమర్శలు
ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాల ఆసుపత్రిలో వైద్యురాలి అత్యాచారం, హత్యపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ అవినీతి ఆరోపణల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే అతడిని ఈడీ, సీబీఐ విచారిస్తున్నాయి. అతడి ఆస్తులపై దాడులు నిర్వహించాయి. వీటికి సంబంధించి అతడికి సుప్రీం కోర్టులో కూడా ఊరట లభించలేదు. రెసిడెంట్‌ డాక్టర్‌ హత్యాచారం ఘటన జరిగిన ప్రదేశంలో మరమ్మతులకు ఆదేశాలు జారీ చేసింది కూడా అతడేనని తేలింది. అతడికి మరో కళాశాలలో పోస్టింగ్‌ ఇవ్వడంతో మమత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి.

'ఆదివారంలోపు మెడికో కేసు తేల్చకుంటే సీబీఐకి అప్పగిస్తా'- బంగాల్​ పోలీసులకు మమత డెడ్​లైన్

ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్‌కు లై డిటెక్టర్‌ టెస్ట్​- ప్రధాని మోదీకి మమత లేఖ - Kolkata Doctor Case

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.