ETV Bharat / bharat

హైదరాబాద్‌ To గోవా - తక్కువ బడ్జెట్​లో తెలంగాణ టూరిజం స్పెషల్​ ప్యాకేజీ! వివరాలివే! - TELANGANA TOURISM GOA TOUR PACKAGE

Telangana Tourism Goa Tour Package 2024: మీరు ఈ సమ్మర్‌లో ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి గోవాకు వెళ్లాలనుకుంటున్నారా ? అయితే, మీ కోసమే తెలంగాణ టూరిజం ఒక స్పెషల్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌లో గోవాకు వెళ్లాలనుకునే వారికి ఈ టూర్‌ బెస్ట్‌ ఆప్షన్‌! మరిన్ని వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

Telangana Tourism Goa Tour Package 2024
Telangana Tourism Goa Tour Package 2024 (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 2:55 PM IST

Telangana Tourism Goa Tour Package 2024: నిత్యం టూరిస్టులతో కళకళలాడే గోవాకు మన దేశంలోని పర్యాటకులతో పాటు.. ఎంతో మంది విదేశీయులు కూడా వస్తుంటారు. మరి మీరు కూడా మీ ఫ్రెండ్స్‌ అండ్​ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి గోవా ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా ? అయితే, మీకో గుడ్‌న్యూస్‌. చాలా తక్కువ బడ్జెట్‌లోనే తెలంగాణ టూరిజం (Telangana Tourism) గోవా టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి లేట్​ చేయకుండా.. గోవా ట్రిప్‌ ఎన్ని రోజులు ఉంటుంది ? ఒక్కరికి ఎన్ని డబ్బులు ఛార్జ్‌ చేస్తారు ? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ టూరిజం హైదరాబాద్ నుంచి గోవాకు.. గోవా ప్యాకేజ్‌ టూర్‌- ఇటెనరరీ (GOA PACKAGE TOUR – ITINERARY) పేరుతో ట్రిప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ నాలుగు రోజుల పాటు ఉంటుంది. హైదరాబాద్​ నుంచి ఈ టూర్​ స్టార్ట్​ అవుతుంది. వివరాలు చూస్తే..

హైదరాబాద్ - గోవా టూర్ షెడ్యూల్ ఇదే :

  • మొదటి రోజు బషీర్‌బాగ్‌ నుంచి మధ్యాహ్నాం 2 గంటలకు గోవాకు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా జర్నీ చేసిన తర్వాత గోవాకు చేరుకుంటారు.
  • రెండవ రోజున ఉదయం 6 గంటలకు కలంగుట్ (Calangute) చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో ఫ్రెషప్‌ అయిన తర్వాత.. నార్త్‌ గోవాలోని మపుసా సిటీ, బోగ్దేశ్వర్ ఆలయం, ఫోర్ట్‌ అగుడా, బాగా బీచ్‌, కలంగుట్‌ బీచ్‌ వంటివాటిని చూస్తారు.
  • మూడవ రోజున సౌత్‌ గోవాలో టూర్‌ ఉంటుంది. ఇక్కడ డోనా పౌలా బీచ్, మిరామార్ (గాస్పర్ డయాస్ బీచ్), ఓల్డ్ గోవా చర్చిలు, మంగేషి టెంపుల్, కోల్వా బీచ్, మార్డోల్ బీచ్‌లలో ఎంజాయ్‌ చేయొచ్చు.
  • సాయంత్రం పాన్‌జిమ్‌లో క్రూజ్‌బోట్‌లో జర్నీ ఉంటుంది. ఇక్కడ జర్నీ కోసం మీరే సొంతంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అది ఒక్కొక్కరికి రూ.500లను చెల్లించాల్సి ఉంటుంది.
  • తర్వాత నైట్‌ కలంగుట్‌ చేరుకుని.. అక్కడే స్టే చేస్తారు.
  • నాలుగవ రోజున ఉదయం 11 గంటలకు కలంగుట్‌ నుంచి హైదరాబాద్‌కు జర్నీ స్టార్ట్‌ అవుతుంది.
  • ఐదవ రోజున మార్నింగ్‌ 6 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. దీంతో గోవా టూర్‌ పూర్తవుతుంది.

ఛార్జీలు చూస్తే: ట్రిప్‌కు వెళ్లాలనుకునే పెద్దలకు ఒక్కరికి రూ. 11,999లను టికెట్ ధరగా నిర్ణయించారు. అదే పిల్లలకు రూ. 9599లను టికెట్‌ ధరగా ప్రకటించారు. అదే మీరు ఈ టూర్‌కు సింగిల్‌ ఆక్యుపెన్సీలో వెళ్తే రూ.14,900లను చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్‌ను బుకింగ్‌ చేసుకున్న వారిని హైదరాబాద్‌ నుంచి గోవాకు బస్సులో తీసుకెళ్తారు. ఎవరైనా బడ్జెట్‌లో గోవా ట్రిప్‌కు వెళ్లాలనుకునే వారు.. తెలంగాణ టూరిజం ఆఫిషియల్‌ వెబ్‌సైట్‌ https://tourism.telangana.gov.in/p వెళ్లి బుకింగ్‌ చేసుకోవచ్చు. టూర్ ప్యాకేజీ మరిన్ని వివరాల కోసం https://tourism.telangana.gov.in/p వెబ్‌సైట్‌ను సంప్రదించండి. ఇంకో ముఖ్య విషయం ప్రతి సోమవారం హైదరాబాద్‌ నుంచి గోవాకు ట్రిప్‌ ప్రారంభమవుతుంది.

Goa Trip Plan Necessary Things : గోవా ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా..! ఇవి మీ వెంట ఉన్నాయా..?

హైదరాబాద్​ To షిరిడీ- IRCTC స్పెషల్ టూర్‌​ ప్యాకేజీ- అతి తక్కువ ధరలో సాయి దర్శనం! - irctc shirdi tour package

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.