Supreme Court On CAA Petition : కొత్తగా నోటిఫై చేసిన పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లు విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మార్చి 19వ తేదీన విచారణ ఉంటుందని శుక్రవారం వెల్లడించింది. సీఏఏ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు దానిని అమలును నిలిపివేయాలని కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
'రాజ్యాంగ విరుద్ధం- వివక్షపూరితం'
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై కొన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధం, వివక్షపూరితమైందంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(IUML) అభ్యంతరం వ్యక్తం చేసింది.
'అన్నింటినీ విచారిస్తాం'
సీఏఏ చట్టం అమలును నిలిపివేయాలని తన పిటిషన్‌లో పేర్కొంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. దాంతోపాటు అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది. "మంగళవారం దీనిపై వాదనలు వింటాం. మొత్తం 190కి పైగా కేసులు ఉన్నాయి. అన్నింటినీ విచారిస్తాం" అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు స్పష్టం చేసింది.
శరణార్థుల నిరసన
మరోవైపు, పౌరసత్వ సవరణ చట్టం అమలుపై కాంగ్రెస్ పార్టీ, విపక్ష ఇండియా కూటమి చేస్తున్న వ్యాఖ్యలపై పాకిస్థాన్,అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులు మండిపడ్డారు. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వెలువల నిరసన తెలిపారు. ఆ సమయంలో వారిని నిలువరించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ కార్యాలయం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
-
#WATCH | Refugees from Pakistan and Afghanistan breach barricades during their protest in Delhi against the INDIA alliance and Congress leaders over their statements on the implementation of CAA.
— ANI (@ANI) March 15, 2024
(Visuals from Ashoka Road, near AICC headquarters) pic.twitter.com/XSMqT8reqm
'సీఏఏను వెనక్కి తీసుకోం'
ఆశ్రయం కోరి వచ్చినవారికి భారత పౌరసత్వం కల్పించడమనేది మన సార్వభౌమ నిర్ణయమని, దానిపై రాజీ పడేది లేదని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఇందుకోసం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏను) ఎన్నటికీ వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఏ దేశ ముస్లింలైనా భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లలో హింసకు గురైన ముస్లిమేతర మైనారిటీల కోసం ఉద్దేశించిందని చెప్పారు. ఏ పౌరుడి హక్కులను ఈ చట్టం తొలగించదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
'CAAను చూసి భారతీయ ముస్లింలు భయపడొద్దు- హిందువులతో సమానంగా వారికి హక్కులు'
CAA కొత్త పోర్టల్ ప్రారంభం- త్వరలో మొబైల్ యాప్ కూడా- కావాల్సిన పత్రాలివే!