Student Murder Case In Bengaluru : రూ.2,000 కోసం స్నేహితుడి సోదరిని హత్య చేశాడు ఓ బాలుడు. దొంగతనం చేసిన నగదును తిరిగి ఇవ్వాలని కోరిన యువతిని దారుణంగా హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటలో జరిగింది.
అసలేం జరిగిందంటే
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, బెంగళూరులోని సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ లేఅవుట్లో ఉంటున్న ప్రబుద్ద(19) పీయూసీ చదువుతుంది. ప్రబుద్ధ సోదరుడు, నిందితుడు ఇద్దరు స్నేహితులు. ఈ క్రమంలోనే నిందితుడు అప్పుడప్పుడు మృతురాలి ఇంటికి వస్తుండేవాడు. ఓ రోజు నిందితుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా వేరే బాలుడి కళ్లజోడు పగిలిపోయింది. దానిని సరిచేయించడానికి నగదు కావాల్సి వచ్చింది. అయితే, ఆ తర్వాత ప్రబుద్ధ ఇంటికి వెళ్లిన నిందితుడు, ఆమె పర్సులో నుంచి రూ.2,000 దొంగలించాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రబుద్ధ తన నగదును తిరిగి ఇవ్వాలని నిందితుడిని అడిగింది.
అయితే, మే 15 మధ్యాహ్నం ప్రబుద్ధ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పడు వెళ్లి నగదును దొంగలించినందుకు క్షమించమని కాలు పట్టుకుని లాగాడు. ప్రబుద్ధ కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇదే అదనుగా అనుకుని భావించిన నిందితుడు ప్రబుద్ధ చేయి, గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా నిందితుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. అనంతరం బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. దీంతో బాలుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ హోమ్‌కు తరలించారు.
పోలీసు స్టేషన్లో వ్యక్తి మృతి- పోలీసులే కారణమంటూ బంధువులు దాడి
పోలీసుల అదుపులో ఉన్న ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో జరిగింది. అయితే ఆ వ్యక్తి మృతికి పోలీసులే కారణమంటూ బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనలు చేపట్టారు. కొంతమంది స్టేషన్ లోపలకి చోరబడి వస్తువులను ధ్వంసం చేశారు. రాళ్లు విసిరి 5 పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 11మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, చన్నగిరి ప్రాంతానికి చెందిన ఆదిల్(30)పై గ్యాంబ్లింగ్ ఆరోపణలు ఉండటం వల్ల శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. కొద్ది సేపటికే ఆదిల్ స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆస్పత్రి తీసుకెళ్లగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
గుడికి వెళ్తుండగా ప్రమాదం- ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి - haryana road accident