ETV Bharat / bharat

స్ట్రీట్​ ఫుడ్​ టేస్ట్ ఇంట్లో! - ఉల్లి పకోడీలు ఇలా చేసుకుంటే అద్దిరిపోతాయి! - Street Style Onion Pakoda Recipe - STREET STYLE ONION PAKODA RECIPE

Street Style Soft Onion Pakoda Recipe : వాతావరణం కాస్త చల్లబడిందంటే చాలు.. వేడివేడిగా ఏమైనా తింటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి టైమ్​లో పకోడీలు ఆరగిస్తే ఎలా ఉంటుంది? వారెవా అనాల్సిందే. అయితే.. ఇవి బయట తింటే అన్ హెల్దీ. అందుకే.. ఇంట్లోనే ఈ అద్దిరిపోయే పకోడీలు ఈజీగా ప్రిపేర్ చేసుకోండి! అది కూడా స్ట్రీట్​ బండి టేస్ట్​లో...

How To Make Soft Onion Pakoda
Street Style Soft Onion Pakoda Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 4, 2024, 10:05 AM IST

How To Make Street Style Soft Onion Pakoda Recipe : స్వీట్ షాప్స్, మిర్చి బండ్ల దగ్గర దొరికే పకోడీలు ఎంతో రుచికరంగా ఉంటాయి. కానీ.. ఇంట్లో తయారు చేస్తే అలాంటి టేస్ట్ రాదు. లోపం ఎక్కడుందో కూడా చాలా మందికి అర్థం కాదు. అలాంటి వారికోసం పక్కా కొలతలతో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునేలా 'మెత్తని ఆనియన్ పకోడీ' రెసిపీ తీసుకొచ్చాం. రుచి బయట బండ్ల మీద దొరికే పకోడీలకు ఏమాత్రం తీసిపోదు! మరి, ఇంకెందుకు ఆలస్యం స్ట్రీట్ ఫుడ్ స్టైల్​లో మెత్తని ఆనియన్ పకోడీ(Pakodi) ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు :

  • శనగ పిండి - 300 గ్రాములు (2 కప్పులు)
  • ఉల్లిపాయలు - 3(మీడియం సైజ్​లో ఉండేవి)
  • పచ్చిమిర్చి - 4
  • అల్లం తరుగు - ఒకటిన్నర టేబుల్​స్పూన్
  • నెయ్యి - రెండున్నర టేబుల్​స్పూన్లు ½
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • వంట సోడా - పావు టీస్పూన్
  • కొత్తిమీర - 1/3 కప్పు(సన్నగా తరుక్కోవాలి)
  • జీలకర్ర - అర టీస్పూన్
  • ఉప్పు - రుచికి తగినంత
  • నీరు - పిండి కలుపుకోవడానికి కావాల్సినంత

చికెన్ డోనట్స్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేయండి!

తయారీ విధానం :

  • మెత్తని ఉల్లి పకోడీని ప్రిపేర్ చేసుకునే ముందు.. ఉల్లిపాయలను అర అంగుళం ముక్కలుగా ఉండేట్లు కట్ చేసుకోవాలి. అంటే.. చీలికలు, సన్నని తరుగులా కాకుండా కాస్త మందంగా బిళ్ల బిళ్లలుగా ఉండేట్లు తరుక్కోవాలి.
  • ఇలా కట్ చేసుకోవడం ద్వారా పకోడీ వేయించుకుంటున్నప్పుడు ఆనియన్స్ ఆయిల్​లో సగం మెత్తగా ఉడికి తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే.. పచ్చిమిర్చి పావు అంగుళం సైజ్​లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటు అల్లాన్ని సన్నగా తరుక్కోవాలి.
  • ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగుని ఒక బౌల్​లోకి తీసుకోవాలి.
  • రెండు రెమ్మలు కరివేపాకు, జీలకర్ర, వంటసోడా, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర కూడా పైన చెప్పినవిధంగా తరిగి, అందులో వేసుకోవాలి.
  • ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని గట్టిగా పిండుతూ కలుపుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఆనియన్స్ పాయలు పాయలుగా విడిపోవడమే కాదు.. వాటిలోని నీరంతా కిందకు దిగిపోతుంది.
  • తర్వాత అందులో శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత.. ఆ మిశ్రమంలో కాసిన్ని నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండిలా చిక్కగా ఉండేట్లు కలుపుకోవాలి.
  • అంతేకానీ.. పిండి నీళ్లలా జారిపోయేలా కాకుండా చూసుకోవాలి.
  • ఇలా మిక్స్ చేసుకున్నాక పిండిని వేగంగా 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. లేదంటే పకోడీలు పైన వేగి లోపల పిండి ఉండ కట్టేస్తుందనే విషయాన్ని గుర్త్తుంచుకోవాలి.
  • ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక స్టౌ మీద ప్లాట్​గా లేని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. అది బాగా వేడి అయ్యాక పిండిని పకోడీల్లా వేసుకోవాలి.
  • అలా వేసుకున్నాక పకోడీలను రెండు నిమిషాలు వేగనివ్వాలి. ఆ తర్వాత వాటిని తిప్పి మరోవైపు వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా వేయించుకున్నాక.. ప్లేట్​లోకి తీసుకోవాలి. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే మెత్తని స్ట్రీట్ స్టైల్ పకోడీలు రెడీ!
  • ఆపై టమాటా, పుదీనా లాంటి చెట్నీలు లేకపోయినా పకోడీలనే తిన్నా సూపర్‌గా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఇలా పకోడీలను ప్రిపేర్ చేసుకొని ఇంటిల్లిపాదీ రుచి చూడండి.

టీవీ రిమోట్ - స్నాక్స్ : నష్టం జరిగే ముందు అర్థంకాదు - జరిగిన తర్వాత అర్థమైనా ఉపయోగం లేదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.