ETV Bharat / bharat

చెవుల్లోకి దూరుతూ వింత పురుగుల బీభత్సం- ఇళ్లు విడిచి వెళ్తున్న ప్రజలు- ఎక్కడో తెలుసా? - strange insects in assam - STRANGE INSECTS IN ASSAM

Strange Insects In Assam : అసోంలోని తేజ్​పుర్​లో వింత పురుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వీటి కారణంగా కొందరు తమ ఇళ్లు విడిచిపెట్టి వేరేచోట తలదాచుకుంటున్నారు.

Strange Insects In Assam
Strange Insects In Assam
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 10:11 AM IST

చెవుల్లోకి దూరుతూ వింత పురుగుల బీభత్సం

Strange Insects In Assam : అసోంలోని తేజ్​పుర్​లో వింత పురుగులు భాయాందోళనలకు గురిచేస్తున్నాయి. బామ్​ పోర్బోటియా ప్రాంతంలో గత నాలుగైదు రోజులుగా ఇంటా, బయటా ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. దీంతో స్థానికులు తమ ఇళ్లను విడిచిపెట్ట వేరే చోటుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పురుగుల బారినుంచి ఎలా బయటపడాలో తెలియక స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అయితే ఈ కీటకాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అనే దానిపై స్పష్టత లేదు. స్థానికులు మాత్రం ఈ పురుగులు అకస్మాత్తుగా ఈ ప్రాంతంలో కనిపించాయని చెబుతున్నారు. ఇలాంటి వాటిని ఇంతకుముందు ఎన్నడూ ఇక్కడ చూడలేదని తెలిపారు. వెదురు పూతలోని పదార్థాన్ని తింటూ ఈ కీటకాలు పెరుగుతున్నాయని అన్నారు. బయట చెట్లపైనే కాకుండా అవి చుట్టూ ఉన్న ఇళ్లల్లోకి చేరుతున్నాయని చెప్పారు.

అయితే ఈ పురుగులు ఇళ్లలోకి చేరటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గృహాల్లో ఆహారపు ధాన్యాలు, దుస్తులు, బెడ్​లపై ఈ పురుగులు చేరుతున్నాయని స్థానికులు తెలిపారు. అంతేకాకుండా పిల్లల చెవుల్లో దూరుతున్నాయని చెప్పారు. పురుగుల మందు కొట్టినా ఈ సమస్య తీరడం లేదని దీనికి తోడు రెట్టింపు సంఖ్యలో ఉద్భవిస్తున్నాయని వాపోయారు. దీని కారణంగా కొందరు స్థానికులు తమ ఇళ్లను వదిలి వేరే చోట తలదాచుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇంతటి బీభత్సం సృష్టిస్తున్న ఈ పురుగులు ఏమిటన్నది స్పష్టం కాలేదు. వీటిని ఇక్కడితో ఆపకపోతే ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం లేకపోలేదు.

కీటకాలు బీభత్సం- లక్షల హెక్టార్లలో పంట నష్టం
ప్రపంచాన్ని కరోనా తర్వాత అంతగా బంబేలెత్తించింది మిడతలదాడి. వేలెడంత కూడా లేని ఈ కీటకాలు వివిధ దేశాల్లోని లక్షల ఎకరాల్లో పంటలను నాశనం చేశాయి. కోట్లమంది ఆహార భద్రతకు పెనుముప్పు కలిగించాయి. వీటిని కట్టడి చేయడానికి కోట్ల డాలర్లు ఖర్చు అయింది. 2020లో మిడతల దాడికి ఆఫ్రికా విలవిలలాడింది. ఇది 25 ఏళ్లలో కనీవినీ ఎరుగని తీవ్రస్థాయి దాడి అని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) అప్పట్లో ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక ఈ మిడతలు భారత్‌లోనూ బీభత్సం సృష్టించాయి. 2020లో రాజస్థాన్‌, గుజరాత్‌, పంజాబ్‌లో 3.5 లక్షల హెక్టార్లలో పంటను ఈ కీటకాలు నాశనం చేశాయి. భారత ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో వాటి కట్టడికి చర్యలు చేపట్టింది. 1993 తర్వాత ఇంత భారీ స్థాయిలో మన దేశంపై మిడతలు దాడి చేయడం ఇదే మొదటిసారి. యెమన్‌, సోమాలియా, సూడాన్‌ల నుంచి పాకిస్థాన్‌ గుండా ఇవి భారత్‌కు చేరాయి. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

12 రాష్ట్రాలు, 88 నియోజకవర్గాలు- రెండో విడత పోలింగ్​కు​ అంతా రెడీ - Lok Sabha Elections 2024

అమేఠీలో రాహుల్‌, రాయ్‌బరేలీలో ప్రియాంక పోటీ- నామినేషన్లకు ముందు అయోధ్యకు పయనం! - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.