ETV Bharat / bharat

కాళ్లు లేకున్నా ట్రైసైకిల్​పై ఫుడ్​​ డెలివరీ- ఆగిన చోటే మొదలైన కథ! ఇదే 'ముగ్గురు మొనగాళ్ల' సక్సెస్ స్టోరీ! - Specially Abled Delivery Agents

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 1:57 PM IST

Specially Abled Food Delivery Agents in Guwahati : శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా, లేనిపోని కష్టాలు ఊహించుకుని బాధపడతారు చాలా మంది. కానీ కొంతమంది ఎలాంటి కష్టాలు వచ్చానా, ఏ పరిస్థితులు వచ్చిన మనోధైర్యంతో ఎదుర్కొంటారు. అలాంటి కోవకు చెందిన ముగ్గురు దివ్యాంగులు ట్రైసైకిల్స్​పై ఫుడ్​ డెలవరీ చేస్తూ అందరికీ ఆదర్శనంగా నిలుస్తున్నారు. మనిషి సంకల్పానికి వైకల్యం కూడా అడ్డుకాదని నిరూపించారు. మరి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? వాళ్ల స్టోరీలేంటో చూద్దాం.

Specially Abled Food Delivery Agents in Guwahati
Specially Abled Food Delivery Agents in Guwahati (ETV Bharat)

Specially Abled Food Delivery Agents in Guwahati : అసోంలోని గువాహటి వీధుల్లో తిరిగేవారికి అన్వర్ హుస్సేన్, సత్తార్ అలీ, సమ్​సుల్ హక్​ అనే వ్యక్తులు ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటారు. ఆ ముగ్గురి జీవిత ప్రయాణం తెలియక పోయినా, వారిని చూసిన వెంటనే ఒక అద్భుతాన్ని చూసినట్టుగా ఆశ్చర్యపడిన వారు ఎందరో. కారణం, వారు ముగ్గురు దివ్యాంగులు. వైకల్యం ఉందని, తాము ఏమీ చేయలేమని నిస్సహాయతతో అక్కడే ఆగిపోలేదు. ఎవరి మీదా ఆధారపడకుండా తమ జీవన ప్రయాణాన్ని కొనసాగించారు. మనిషి సంకల్ప శక్తి, మనో బలంతో ఇలా కూడా చేయచ్చా అని అందరూ ఆశ్చర్యపడేలా డెలివరీ బాయ్స్​గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

7ఏళ్ల పాటు మంచంపైనే!
అసోంలోని బిలాసిపరా గ్రామానికి చెందిన అన్వర్ హుస్సేన్​ పని కోసం గువాహటికి వచ్చాడు. 2015లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. సుమారు 7ఏళ్ల పాటు ఆసుపత్రిలో మంచంపై ఉన్న అన్వర్​ ఎవరిపై ఆధార పడకూడదని నిర్ణయించుకున్నాడు. అనంతరం ఫుడ్​ డెలివరీ బాయ్​గా స్విగ్గీలో చేరాడు. తన ట్రైసైకిల్​​పైనే చాలా మందికి ఫుడ్​ను సరఫరా చేస్తున్నాడు. దీంతో ఆదాయాన్ని సంపాదిస్తూ జీవితాన్ని హాయిగా గడుపుతున్నాడు. అయితే తాను గతంలో రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు అన్వర్ తెలిపాడు. కానీ ఇప్పుడు మనోధైర్యంతో ఫుడ్​ డెలివరీ బాయ్​గా పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

స్వీగ్గీలో ఉద్యోగం
ఒకప్పుడు సత్తార్ అలీ జీవితం చాలా సరదాగా సాగిపోయేది. కానీ 2015లో చెట్టుపై నుంచి పడి వెన్నెముక విరిగింది. ఎనిమిది సంవత్సరాలపాటు మంచం మీదే గడచిపోయింది. అయితే తాను అక్కడే ఆగిపోకూడదనుకున్న సత్తార్ అలీ, తనలాంటి మరో ఇద్దరినీ కలిశాడు. అప్పుడే జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించాలన్న కోరిక అన్వర్​కు కలిగింది. ఏదో ఒక పని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగాల కోసం వెతకడం ప్రారంభించి చివరికి స్విగ్గీలో ఫుడ్​ డెలివరీ బాయ్​గా చేరాడు.
ఇక సమ్​సుల్ అనే మరో దివ్యాంగుడిది​ కూడా ఇలాంటి కథే. 15 ఏళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్​లో పక్షవాతానికి గురయ్యాడు. ఆ తర్వాత మెల్లగా కోలుకున్నాడు. కానీ ట్రైసైకిల్​కే పరిమితమయ్యాడు. మిగితా ఇద్దరికి లాగానే సమ్​సుల్​ కూడా ప్రస్తుతం స్విగ్గీలో డెలివరీ బాయ్​గా పని చేస్తున్నాడు.

కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం- శామ్ పిట్రోడాకు మళ్లీ బాధ్యతలు

సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్​- తానేం తప్పు చేయలేదన్న దిల్లీ సీఎం - Kejriwal Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.