Special Treatment Jailed Actor Darshan : అభిమాని హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు రాచమర్యాదలు చేసిన ఏడుగురు జైలు అధికారులపై వేటు పడింది. అధికారులను సస్పెండ్ చేసి ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు కర్ణాటక హోం శాఖ మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. అంతేకాకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరించాలని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌కు చెబుతానని ఆయన సోమవారం అన్నారు.
"ఈ విషయం నాకు తెలిసిన వెంటనే, సీనియర్ అధికారుల బృందం జైలుకు వెళ్లి తనిఖీ చేయాల్సిందిగా డీజీపీని ఆదేశించాను. దర్శన్‌కు ఆ అధికారులు సహాయం చేశారని విచారణలో తేలింది. జైలులో సీసీటీవీ, జామర్స్ ఉన్నా ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళనకరం." అని మంత్రి వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి సీరియస్
ఈ ఘటనను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీరియస్‌గా తీసుకున్నారు. బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని సూచించారు. దర్శన్‌తో పాటు మరికొందరిని తక్షణమే వివిధ జైళ్లకు తరలించాలని, ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించారు.
'రాహుల్ గాంధీ- న్యాయం అంటే ఇదేనా?'
దర్శన్ జైలు ఘటనపై బీజేపీ నేత షెహజాద్ పూనావాలా స్పందించారు. కర్ణాటక కాంగ్రెస్ వీవీఐపీ మనస్తత్వాన్ని, అవినీతిని ఈ ఘటన తెలియజేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విచారణ ఖైదీకి రాచమర్యాదలు చేస్తున్నట్లు బయటకు వచ్చిన ఫొటో ద్వారా తెలుస్తోందని, న్యాయం అంటే ఇదేనా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. దర్శన్‌ను జైలుకు పంపారా? లేక రిసార్ట్‌లో ఉంచారా అని నిలదీశారు. కర్ణాటక హోం మంత్రి, జైళ్ల శాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఇంకా ఎంత మందికి ఇలా రాచమర్యాదలు చేస్తున్నారో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
#WATCH | On a purported photo of jailed Kannada film actor Darshan Thoogudeepa smoking a cigarette, BJP leader Shehzad Poonawalla says, " this is shows karnataka congress' vvip mentality and corruption. a murder accused's pictures are coming out which shows him being given special… pic.twitter.com/DSA1EGz52j
— ANI (@ANI) August 26, 2024
ఇదీ జరిగింది
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు గత రెండు మూడు రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఓ చిత్రం అనేక అనుమానాలకు తావిచ్చింది. తాజాగా వీటికి బలం చేకూరుస్తూ ఓ వీడియో సైతం బయటకు రావడం గమనార్హం. అందులో ఆయన తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడినట్లుగా ఉంది.
#Darshan “Naa Fans kosam nenu Hero ayyanu. So jail nundi video calls chesta.” pic.twitter.com/m3fWukvBqp
— selfiewithtrain (@selfiewithtrain) August 26, 2024
వీడియో కాల్‌లో ఓ వ్యక్తి అవతలి వైపు మరో వ్యక్తితో మాట్లాడాడు. మధ్యలో దర్శన్ చేతికి ఫోన్ ఇచ్చి పక్కకు జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇద్దరూ ఒకరికొకరు హాయ్ చెప్పుకొంటూ పలకరించుకున్నారు. అనంతరం తిన్నావా అని అవతలి వ్యక్తి అడగ్గా దర్శన్ నవ్వుతూ అయిపోయిందంటూ సమాధానం ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. కాసేపు ముచ్చటించుకున్న తర్వాత ఇద్దరూ బై చెప్పుకొన్నారు. 25 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో దర్శన్ మంచి వెలుతురు ఉన్న గదిలో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆయన వెనకాల కిటికీ పరదాలు ఉన్నాయి. కొక్కేలకు దుస్తులూ వేలాడదీసి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
నోట్లో ఎముకలు, బిర్యానీ కుక్కి కరెంట్ షాక్- పవిత్ర కళ్లముందే దర్శన్ చిత్రహింసలు