ETV Bharat / bharat

అరుణాచల్​ మళ్లీ బీజేపీదే - సిక్కింలో SKM క్లీన్​స్వీప్​! - Sikkim Arunachal Pradesh Counting - SIKKIM ARUNACHAL PRADESH COUNTING

Sikkim Arunachal Pradesh Counting
Sikkim Arunachal Pradesh Counting (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 2, 2024, 9:03 AM IST

Updated : Jun 2, 2024, 12:43 PM IST

Sikkim Arunachal Pradesh Counting : ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సిక్కింలో అధికార సిక్కిం క్రాంతి కారీ మోర్చా-SKM దూసుకుపోతోంది. సిక్కింలోని మొత్తం ఆరు జిల్లాలకు చెందిన ఓట్లు ఒకే చోట లెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కించారు. తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను గణిస్తున్నారు.

LIVE FEED

12:38 PM, 2 Jun 2024 (IST)

అరుణాచల్​లో బీజేపీ విజయం
అరుణాచల్​లో బీజేపీ మ్యాజిక్​ ఫిగర్​ను క్రాస్​ చేసి విజయం ఢంకా మోగించింది. 60 సీట్లలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 31 సీట్లు గెలిచింది. మరో 14 స్థానాల్లో అధిక్యంలో ఉంది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది.

సిక్కింలో SKM క్లీన్​స్వీప్
మరోవైపు సిక్కింలో ఎస్​కేఎమ్​ పార్టీ మరో సారి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు సాధించింది. మొత్తం 32 స్థానాల్లో 18 సీట్లలో విజయం సాధించి మ్యాజిక్​ ఫిగర్​ 17ను దాటింది. మరో 13 సీట్లలో లీడ్​లో ఉంది.

11:42 AM, 2 Jun 2024 (IST)

సిక్కిం ముఖ్యమంత్రి విజయం
సిక్కిం సీఎం, ఎస్‌కేఎమ్ అధినేత పిఎస్ తమంగ్, రెనాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎస్‌డీఎఫ్‌కు చెందిన సోమ్ నాథ్ పౌడియాల్‌పై 7,044 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఎస్​కేఎమ్​ 11 స్థానాల్లో విజయం సాధించింది. మరో 20 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఎస్​డీఎప్​ ఒక స్థానంలో ముందంజలో ఉంది.

10:54 AM, 2 Jun 2024 (IST)

అరుణాచల్ ప్రదేశ్​

పార్టీగెలుపుఅధిక్యంమొత్తం
BJP153146
NPEP066
NCP033
PPA022
IND101

సిక్కిం

పార్టీగెలుపుఅధిక్యంమొత్తం
SKM42731
SDF011

10:20 AM, 2 Jun 2024 (IST)

బీజేపీ కార్యాలయం వద్ద కోలాహలం
అరుణాచల్​ ప్రదేశ్​లో బీజేపీ విజయం దిశగా సాగుతోంది. ఇప్పటికే పది సీట్లు గెలిచి, 33 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ఇటానగర్​లోని బీజేపీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలొకంది. కార్యాలయాన్ని పూలతో అలంకరించారు.

9:58 AM, 2 Jun 2024 (IST)

అరుణాచల్ ప్రదేశ్​

పార్టీగెలుపుఅధిక్యంమొత్తం
BJP103343
NPEP066
NCP044
PPA033
IND022

సిక్కిం

పార్టీగెలుపుఅధిక్యంమొత్తం
SKM03030
SDF011

9:14 AM, 2 Jun 2024 (IST)

సిక్కింలో SKM హవా కొనసాగుతోంది. 29 స్థానాల్లో ఈ పార్టీ అధిక్యంలో ఉంది. సిక్కిం డెమొక్రాటిక్ పార్టీ(SDF) ఒక్క స్థానంలో ముందంజలో కొనసాగుతోంది. మరోవైపు అరుణాచల్​ప్రదేశ్​లో బీజేపీ డానిమేషన్​ కనపడుతోంది. ఇప్పటికే 10 సీట్లు ఏకగ్రీవంగా గెలిచిన కమలదళం 31 సీట్లలో ముందంజలో ఉంది. NPEP 8, PPA 2, NCP 3 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక ఇక్కడ స్వంతంత్రులు 2 సీట్లలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు.

9:09 AM, 2 Jun 2024 (IST)

సిక్కింలో SKM హవా
ఈశాన్య రాష్ట్రం సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిలో అధికార సిక్కిం క్రాంతి కారీ మోర్చా-SKM దూసుకుపోతోంది. 32 అసెంబ్లీ స్థానాలకుగాను 27 చోట్ల SKM అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

9:02 AM, 2 Jun 2024 (IST)

అరుణాచల్​లో బీజేపీ ముందంజ
అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిలో బీజేపీ ముందంజలో ఉంది. 16 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నేషనల్ పీపుల్స్ పార్టీ NPP అభ్యర్థులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఉదయం ఆరు గంటల నుంచే భారీ భద్రత మధ్య అరుణాచల్‌ ప్రదేశ్‌లో 50శాసనసభ స్థానాల పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టారు. అరుణాచల్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, పది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏప్రిల్‌ 19న మిగిలిన 50 అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది.

అరుణాచల్‌ప్రదేశ్‌లో 24 జిల్లాలు ఉండగా ఆయా జిల్లాల ప్రధాన కేంద్రాల్లో లెక్కింపు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అరుణాచల్​ప్రదేశ్​వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం కల్లా తుది ఫలితాలు వెలువడతాయని అంచనా వేస్తున్నారు. 2 వేల మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు.

Last Updated : Jun 2, 2024, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.