ETV Bharat / bharat

3 అడుగుల పొడవు, 18 కేజీల బరువున్న డాక్టర్​- అప్పుడు ప్రభుత్వం తిరస్కరణ- ఇప్పుడు వరల్డ్​ రికార్డ్​కు అర్హత! - ప్రపంచంలోనే పొట్టి వైద్యుడు గణేశ్

Shortest Doctor Ganesh Baraiya : తనకు ఉన్న శారీరక వైకల్యాన్ని అధిగమించి మరి ఓ యువకుడు డాక్టర్​ అయ్యారు. వయస్సు 23 సంవత్సరాలు ఎత్తు 3 అడుగులు మాత్రమే. ఆ ఎత్తు కారణంగా వైద్య కళాశాలలో చదువుకునేందుకు నిరాకరించింది ప్రభుత్వం. అయినా సరే కోర్టుకు వెళ్లి మరీ అర్హత సాధించి ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేశారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అనే విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Shortest Doctor Ganesh Baraiya
Shortest Doctor Ganesh Baraiya
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 10:31 AM IST

Shortest Doctor Ganesh Baraiya : తనకు ఉన్న శారీరక వైకల్యాన్ని అధిగమించి ఓ యువకుడు డాక్టర్ అయ్యారు. నీట్​లో మంచి మార్కులు సాధించిన యువకుడికి ఎత్తు కారణంగా మెడికల్ కాలేజీలో సీటు నిరాకరించారు. అంతటితో కుంగిపోకుండా పట్టువదలని విక్రమార్కుడిలాగా సుప్రీం కోర్టు వెళ్లి మరీ అర్హత సాధించారు ఆ యువకుడు. ఇప్పుడు ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేసి ఇంటర్న్​షిప్​ను ప్రారంభించారు. ఆయనే గుజరాత్​కు చెందిన గణేశ్ బరైయా.

కాలేజీకి వెళ్లిన మొదటి వ్యక్తి
భావ్​నగర్ జిల్లా గోరఖి గ్రామానికి చెందిన గణేశ్ బరైయా వయసు 23 సంవత్సరాలు. కానీ ఎత్తు మాత్రం 3 అడుగులు. బరువు 18 కేజీలు. 72శాతం లోకోమోటివ్ వైకల్యంతో బాధపడతున్నారు. గణేశ్​కు 8మంది తోబుట్టువులు ఉన్నారు. కానీ వారిలో ఎవరికి ఇలా లేదు. విగతా వారితో పోల్చితే తాను తక్కువ ఎత్తు ఉన్నానని గణేశ్ ఏనాడూ కుంగిపోకుండా చదువుపై దృష్టి పెట్టారు. 10వ తరగతి పూర్తి చేశారు. గణేశ్​ తోబుట్టువులు 10వ తరగతి వరకే చదువుకున్నారు. వాళ్ల కుటుంబంలో కాలేజీకి వెళ్లి చదివిన మొదటి వ్యక్తిగా గణేశ్ నిలిచారు. ఆ తర్వాత ఇంటర్​ పూర్తి చేశారు. 2018లో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష నీట్​లో 233 మార్కులు సాధించారు. కానీ తన వైకల్యం కారణంగా వైద్య కళాశాలలో ప్రవేశాన్ని గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది.

సుప్రీం కోర్టులో పిటిషన్
గణేశ్​ అంతటితో నిరాశ కుంగిపోకుండా తన కాలేజీ ప్రిన్సిపల్ దల్పత్ కటారియా సాయంతో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కటారియా గణేశ్​కు అందించారు. దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం గణేశ్​కు వైద్య కళాశాలలో ప్రవేశం కల్పించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో భావ్​నగర్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్​ను పూర్తి చేశారు గణేశ్. ప్రస్తుతం ఇంటర్న్​షిప్​తో భాగంగా భావ్​నగర్​ వైద్య కళాశాలలో రోగుల వద్దకు వెళ్లి వైద్యం చేస్తున్నారు. అయితే గణేశ్​ మాత్రం డెర్మటాలజీ డాక్టర్​ కావాలని అనుకుంటున్నారు. గణేశ్​ ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్​ టైటిల్​కు అర్హత సాధించాడని మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ హేమంత్ మెహతా తెలిపారు.

విద్యార్థులకు సైకిళ్లు ఇచ్చిన కూలీ- ఆదాయంలో కొంత పొదుపు- యువకుడిపై ప్రశంసలు

సోదరి ఎగ్జామ్​ కోసం సాహసం- మంచులో 4కి.మీల 'రోడ్డు' వేసిన సోదరుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.