Ayushman Bharat 70 Years Scheme : కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని 70 ఏళ్లు పైబడిన వయసు కలిగిన సీనియర్ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 70 ఏళ్లు, ఆపై వయస్సు కలిగిన వారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం గొప్ప మానవతా దృక్పథంతో కూడుకున్నదన్నారు. తాజా నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది కలుగుతుందని మంత్రి తెలిపారు. వారి సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కుతుందని వెల్లడించారు.
ఇప్పటికే ఈ పథకం కింద లబ్దిదారులుగా ఉన్న కుటుంబాల్లో ఉన్న సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో రూ.5లక్షలు బీమా వర్తింపజేస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇతర బీమా పథకాల్లో చేరి ఉన్నవారు ఏదైనా (కొనసాగిస్తున్న బీమా లేదా పీఎంజేఏవై) ఎంచుకొనేందుకు వెసులుబాటును సైతం కల్పించారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో కేంద్రం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు వైద్యసేవలు ఉచితం.
#WATCH | After the Cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, " it has been decided to cover our senior citizens who are more than 70 years old under universal health coverage, ayushman bharat pm jan arogya yojana. this is a very big decision. there is a great… pic.twitter.com/jllM8GjjTL
— ANI (@ANI) September 11, 2024
'పీఎం ఈ-డ్రైవ్‌కు' పచ్చజెండా
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రూ.10,900 కోట్లతో 'పీఎం ఈ-డ్రైవ్' పథకానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా 88,500 ఛార్జింగ్ స్టేషన్లకు కేంద్రం తోడ్పాటు అందించనుంది. అలాగే, 31,350 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.12,461 కోట్ల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఎలక్ట్రిక్ వెహికల్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
EV వాహనాల ఛార్జింగ్ సమస్యలకు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను (ఈవీపీసీఎస్) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈవీ వాహనాల వినియోగం అధికంగా ఉన్న నగరాల్లో ఈవీపీసీఎస్లను ఏర్పాటుు చేయనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన నగరాల్లో రహదారులపై అమర్చనున్నారు. ఈ పథకం ద్వారా ఈ-4వాట్స్ (ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్) కోసం 22,100 ఫాస్ట్ ఛార్జర్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ-బస్సుల కోసం 1,800 ఫాస్ట్ ఛార్జర్‌లు, ఈ-టూ విల్లర్/తీ వాట్స్ కోసం 48,400 ఫాస్ట్ ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ. 2,000 కోట్లు వెచ్చించనుంది.
ఆయుష్మాన్ భారత్ బీమా కవరేజీ రూ.10లక్షలకు పెంపు! ఇంతకీ అర్హులు ఎవరంటే? - Ayushman Bharat Scheme