ETV Bharat / bharat

'బ్యాలెట్ పేపర్లు, వీడియోలను తీసుకురండి'- చండీగఢ్​ మేయర్​ ఎన్నికపై సుప్రీం తీర్పు - bjp vs aap chandigarh

SC On Chandigarh Polls : చండీగఢ్ మేయర్​ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మేయర్ ఎన్నికలో ఉపయోగించిన బ్యాలెట్ పత్రాలు, వీడియోలను సుప్రీంకోర్టుకు తీసుకురావాలని, అందుకోసం ఒక జ్యుడీషియల్ అధికారిని నియమించాలని పంజాబ్​, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్​ను ఆదేశించింది.

SC On Chandigarh Polls
SC On Chandigarh Polls
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 4:52 PM IST

Updated : Feb 19, 2024, 7:23 PM IST

SC On Chandigarh Polls : చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక ఉతర్వులు ఇచ్చింది. మేయర్‌ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్‌ పత్రాలు, వీడియోను మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల కల్లా తమ ముందుంచాలని ఆదేశించింది. ఆ రికార్డులన్నింటిని సురక్షితంగా దిల్లీకి చేరవేసేందుకు ఒక జ్యుడీషియల్ అధికారిని నియమించాలని పంజాబ్ హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఆదేశాలు ఇచ్చింది.

మేయర్ ఎన్నికలో అక్రమాలు జరిగాయని దాన్ని రద్దు చేసి, మళ్లీ పోలింగ్‌ జరిపించాలని కోరుతూ ఆమ్‌ఆద్మీ పార్టీ తరఫు కౌన్సిలర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆప్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో జరిగిన హార్స్‌ ట్రేడింగ్‌ తమను బాధించిందని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. బ్యాలెట్ పత్రాలపై ఇన్‌టూ(x) మార్క్‌ ఎందుకు వేశారని రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మాసిహ్‌ను ప్రశ్నించింది. చెల్లుబాటుకాని బ్యాలెట్ పత్రాలపై ఇన్‌టూ మార్క్‌ వేశానని అనిల్ వెల్లడించారు. ఎనిమిది పత్రాలపై అలా వేసినట్లు త్రిసభ్య ధర్మాసనానికి తెలిపారు. ఆప్‌ కౌన్సిలర్లు గందరగోళం సృష్టించి, బ్యాలెట్ పత్రాలు లాక్కోవడానికి యత్నించారని ఆరోపించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒక రిటర్నింగ్ అధికారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ క్రాస్‌ ఎగ్జామినేషన్ చేయడం ఇదే తొలిసారి.

సుప్రీంకు ఆప్ కౌన్సిలర్
జనవరి 30న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారితో కలిసి బీజేపీ మోసాలకు పాల్పడిందని ఆప్‌, కాంగ్రెస్‌ ఆరోపించాయి. ఈ క్రమంలోనే ఎన్నిరల రిటర్నింగ్ అధికారి బ్యాలెట్‌ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఆప్‌ కౌన్సిలర్‌ కుల్దీప్ కుమార్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 5న విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎన్నికల అధికారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసినట్లు వీడియో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది.

'ఎన్నికల నిర్వహణ తీరు ఇదేనా? ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇది ప్రజాస్వామ్యం హత్యే. ఆయనపై విచారణ జరపాలి' అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీని భద్రపరచాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్​ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి వ్యక్తిగతంగా ఫిబ్రవరి 19న హజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు రిటర్నింగ్‌ అధికారి అనిల్ మసీహ్ సోమవారం హాజరయ్యారు.

మేయర్ రాజీనామా
చండీగఢ్ మేయర్‌ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న కేసు సుప్రీంకోర్టులో విచారణ జరిగిన ముందు రోజే(ఆదివారం) మేయర్ పదవికి మనోజ్ సోంకర్ రాజీనామా చేశారు. మరోవైపు, మేయర్ రాజీనామా చేసిన రోజే ముగ్గురు ఆమ్‌ ఆద్మీ పార్టీ( ఆప్) కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. కొత్తగా బీజేపీలోకి మారిన వారితో కలిపితే బీజేపీ కౌన్సిలర్ల సంఖ్య 14కు చేరింది. ఆప్‌నకు 13, కాంగ్రెస్‌కు 7, శిరోమణి అకాలీదళ్‌కు ఒక కౌన్సిలర్‌ ఉన్నారు.

'మళ్లీ మళ్లీ సమన్లు పంపొద్దు, అప్పటివరకు ఆగండి'- ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ ఆరో 'సారీ'

'కేంద్రం ఆధార్​ కార్డులను డీయాక్టివేట్​ చేస్తుంది'- బంగాల్​ సీఎం దీదీ ఆరోపణలు

Last Updated : Feb 19, 2024, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.