ETV Bharat / bharat

ఎన్నికల బరిలో ఒకే పేరుతో వేర్వేరు అభ్యర్థులు- పార్టీల అసలు వ్యూహమిదే! - Same Name Candidates In Bengaluru

Same Name Candidates In Bengaluru : సార్వత్రిక ఎన్నికల సమరంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు పార్టీలు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల పేరుతో ఉన్న వారిని స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపాయి. ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులను బరిలోకి దింపి ఓట్లు చీల్చే వ్యూహం పన్నాయి. ఇప్పుడు ఒకే పేరు బరిలో నిలిచిన అభ్యర్థుల వల్ల ప్రధాన పార్టీలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.

Same Name Candidates In Bengaluru
Same Name Candidates In Bengaluru
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 12:55 PM IST

Same Name Candidates In Bengaluru : సార్వత్రిక ఎన్నికల సమరంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. గెలుపునకు ఉన్న ఏ అవకాశాలను విడిచి పెట్టకుండా పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో ఉన్న వారి పేర్లే ఇప్పుపడు తలనొప్పిగా మారాయి. అదే పేర్లు మీద ఉన్న కొంతమందిని ఎన్నికల్లో బరిలోకి దింపి ఓట్లు చీల్చే వ్యుహాన్ని అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న అధికార కాంగ్రెస్‌, ఈ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ ఈ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి.

బరిలో ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులు
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. దక్షిణాదిలో మంచి పట్టున్న కర్ణాటకలో అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ప్రతిపక్ష బీజేపీ కూడా పట్టుదలతో ఉంది. ఇప్పటికే జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ మొత్తం 28 నియోజకవర్గాల్లో గెలుపొందేందుకు వ్యూహరచన చేస్తోంది. రెండు పార్టీలు విభిన్న ఎన్నికల వ్యూహంతో దూసుకెళ్తున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీ అభ్యర్థులను స్వంతంత్ర అభ్యర్థులుగా బరిలో దింపుతున్నారు. ఒకే పేరున్న అభ్యర్థిని బరిలో దింపి ఓట్లను చీల్చేందుకు వ్యూహం అమలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో వార్తల్లో నిలుస్తున్న బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో కూడా ఇదే వ్యూహాన్ని ఇరు పార్టీలు అమలు చేస్తున్నాయి. మంజునాథ్‌ పేరుతో ఐదు, సురేష్ పేరుతో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి.

బెంగళూరులో ఇలా
బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేష్‌, బీజేపీ అభ్యర్థి డాక్టర్ సీఎన్ మంజునాథ్ మధ్య ప్రధాన పోరు నడుస్తోంది. ఇప్పుడు ఇరు పార్టీలు అదే పేరుతో ఉన్న అభ్యర్థులను బరిలోకి దింపాయి. బీజేపీ అభ్యర్థి డాక్టర్ సీఎన్ మంజునాథ్ పేరుతో ఉన్న సి. మంజునాథ్, ఎన్. మంజునాథ్, మంజునాథ్.కె, సి.ఎన్. మంజునాథ్ ఇదే నియోజకవర్గం నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేష్‌ పేరుతో ఉన్న ఎన్.సురేష్ బరిలో నిలిచారు. ఇలాగే మాజీ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ బరిలో ఉన్న నియోజకవర్గంలో అదే పేరుతో ఉన్న డి. సుధాకర్, కె. సుధాకర్‌ నామినేషన్లు వేశారు. చిక్కబళ్లాపూర్‌లో కాంగ్రెస్‌కు చెందిన రక్షా రామయ్యపై మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. చిక్కమగలూరులో సురేష్‌పై బీజేపీ అభ్యర్థి కోట శ్రీనివాస్‌ పూజారి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే పేరుతో పూజారి, సుప్రీత్ పూజారి నామపత్రాలు దాఖలు చేసి ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్‌కు చెందిన ముద్ద హనుమేగౌడపై కూడా అదే పేరుతో ఉన్న వారు పోటీ చేస్తున్నారు.

అభ్యర్థుల పేర్లతో పార్టీలకు తలనొప్పి
బెంగళూరు నార్త్‌ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై శోభ, శోభన్ బాబు నామపత్రాలు దాఖలు చేశారు. బెంగళూరు సెంట్రల్ అభ్యర్థిగా మన్సూర్ అలీఖాన్ పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి ముక్తార్ అలీఖాన్‌ కూడా పోటీ చేస్తున్నారు. మైసూరు-కొడగు లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా యదువీర్ వడయార్‌ యడ్యూరప్ప, హెచ్‌డీ రేవణ్ణ పేరుతో ఉన్న అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో చాలామంది పోటీ నుంచి తప్పుకున్నారు కానీ ఒకరిద్దరు మాత్రం ఎన్నికల బరిలోనే నిలిచారు. ఇప్పుడు ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులు తమకు తలనొప్పిగా మారారని నేతలు అంటున్నారు.

తొలి విడత ఎన్నికల్లో 135 మంది మహిళలు పోటీ- కేవలం 8 శాతమే - Women In LS Polls 2024 1st Phase

బాలీవుడ్ టు కోలీవుడ్- లోక్​సభ బరిలో ఎందరో సినీ తారలు- ఎవరెవరెంటే? - Actors In Lok Sabha Polls 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.