ETV Bharat / bharat

అయోధ్య రాముడి గుడికి రూ.2100 కోట్ల చెక్​- కానీ ఓ బిగ్​ ట్విస్ట్​! - PM Relief Fund Donation To Ayodhya - PM RELIEF FUND DONATION TO AYODHYA

PM Relief Fund Donation To Ayodhya : అయోధ్య రామ మందిరానికి పీఎం రిలీఫ్ ఫండ్​ పేరుతో రూ.2,100 కోట్ల విలువైన చెక్కు అందింది. ఈ మేరకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.

PM Relief Fund Donation To Ayodhya
PM Relief Fund Donation To Ayodhya (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2024, 1:53 PM IST

PM Relief Fund Donation To Ayodhya : ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్​కు భారీ విరాళం అందేలా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​కు రూ.2,100 కోట్ల చెక్కు రావడం చర్చనీయాంశమైంది. ఈ చెక్కును పంపిన వ్యక్తి దానిపై తన పేరు, మొబైల్ నంబర్, అడ్రస్​ను రాశారు. కానీ చెక్కును ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ పేరు మీద ట్రస్ట్​కు పోస్టు ద్వారా పంపించారు. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. రెండు రోజుల క్రితమే ఈ చెక్కు తమ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. అయితే ఆ చెక్​ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపించాల్సిందిగా ట్రస్టు అధికారులను ఆదేశించినట్లు చంపత్​ రాయ్​ చెప్పారు.

ఎఫ్​డీల్లో రూ.2,600 కోట్లు
ప్రస్తుతం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరిట బ్యాంకు ఖాతాలో 2600 కోట్ల రూపాయల ఫిక్స్​డ్ డిపాజిట్ ఉందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. రామ మందిరం మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్​ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అందులో తెల్లని పాలరాతితో రామయ్య విగ్రహాన్ని ఉంచనున్నట్లు వెల్లడించారు. "టైటానియంతో శ్రీరామ దర్బార్ నిర్మిస్తాం. ఇది భద్రతాపరంగా బాగుంటుంది. ఎప్పటికీ దెబ్బతినదు. రామ్ దర్బార్​లో రామయ్య, జానకి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుజ్ఞుడు, హనుమాన్ విగ్రహాలు కూర్చున్నట్లు ఉంటాయి. అవి శుక్రవారం ట్రస్ట్​కు చేరాయి." అని చంపత్ రాయ్ వెల్లడించారు.

శరవేగంగా రామమందిర నిర్మాణ పనులు
అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసేందుకు ఆలయ నిర్మాణ కమిటీ సన్నాహాలు చేస్తోంది. కీలకమైన ఆలయ శిఖరంతో పాటు మొదటి, రెండో, మూడో అంతస్తుల పనులను వచ్చే ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రామజన్మభూమి కాంప్లెక్స్​లో వివిధ దేవతలకు చెందిన మొత్తం ఎనిమిది ఆలయాలను నిర్మించనున్నారు. శేషావతార్, మహర్షి విశ్వామిత్ర, మహర్షి వాల్మీకి, మహర్షి అగస్త్య, మహర్షి వశిష్ఠ, నిషాద్ రాజ్, అహల్యా దేవి ఆలయాలను నిర్మించనున్నారు. కాగా, ఈ ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్య రామయ్యకు ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలలకు చెందిన వేలాది మంది భక్తులు, వీఐపీలు హాజరయ్యారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దర్శనానికి భక్తులను అనుమతించారు.

అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ- తొలి వర్షానికే గర్భగుడిలోకి నీరు- విగ్రహం ఎదురుగానే! - Ayodhya Ram Mandir Leakage

అయోధ్య బాలరాముడికి బహుబలి కానుకలు - 1600 కేజీల గద, 1100కిలోల ధనుస్సు - 1600 KG Gada To Ayodhya Ram Mandir

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.