ETV Bharat / bharat

రోబోలా 10ఏళ్ల బాలుడు- చిప్స్ ఉంటేనే మాట్లాడడం, వినడం- ఛార్జింగ్ అయిపోతే సైలెంట్- ఎందుకలా? - Robot boy Adarsh ​​Pathak

Robot boy Adarsh ​​Pathak Story : ఆదర్శ్ అనే పదేళ్ల బాలుడు అచ్చం రోబోలానే ప్రవర్తిస్తున్నాడు. తల లోపల, బయట అమర్చిన చిప్స్ ఆన్​లో ఉంటే మాట్లాడగలడు, ఎదుటివారు చెప్పింది వినగలడు. ఆ చిప్స్ ఛార్జింగ్ అయిపోయినా, ఆగిపోయినా రోబోలా సైలంట్​గా ఉండిపోతాడు. అసలేందుకు ఆ బాలుడికి తల లోపల, బయట చిప్స్​ను పెట్టారు? అందుకు ఎంత ఖర్చయ్యింది? తెలుసుకుందాం.

Robot boy Adarsh ​​Pathak Story
Robot boy Adarsh ​​Pathak Story (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 12:00 PM IST

Robot boy Adarsh ​​Pathak Story : బిహార్​కు చెందిన 10 ఏళ్ల బాలుడుకి రోబోలా మెదడులో చిప్ అమర్చారు. అలా చేస్తేనే గానీ ఆ పిల్లాడు మాట్లాడలేడు. ఎదుటివారు చెప్పింది వినలేడు. తల లోపల, బయట పెట్టిన ఆ చిప్స్ ఛార్జింగ్ అయిపోగానే నోరు మూగబోతుంది. చెవులు కూడా వినిపించవు. అందుకే రూ.2 కోట్లు ఖర్చు చేసి మరి ఆ పిల్లాడి మెదడులో చిప్స్​ను పెట్టించారు అతడి తల్లిదండ్రులు. అసలేందుకు ఆ బాలుడి మెదడులో చిప్స్​ను పెట్టారు? నెలకు ఆ బాలుడికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందాం.

బెగుసరాయ్​కు ఆదర్శ్ పాఠక్(10) పుట్టుకతోనే బర్త్‌ అఫాసియా అనే వ్యాధి ఉంది. అంటే పుట్టిన తర్వాత శిశువు ఒక నిమిషం లోపు ఏడవకపోవడం వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక బర్త్ ఆఫాసియా వ్యాధి వస్తుంది. ఈ వ్యాధికి గురైన ఆదర్శ్​కు చిన్నప్పటి నుంచి ఎదుటివారు చెప్పింది వినపడేది కాదు. అలాగే మాట్లాడేవాడు కాదు. కుటుంబ సభ్యులు ఆదర్శ్​ను చాలా మంది వైద్యుల వద్దకు తీసుకెళ్లాని ప్రయోజనం ఉండేది కాదు. అందులో కొందరు మాత్రం ఈ వ్యాధికి అమెరికాలో చికిత్స చేయించవచ్చని చెప్పారు. ఆదర్శ్ మామూలు మనిషిలా వినడం, మాట్లాడతాడని సంతోషించి అతడి తండ్రి ప్రదీప్ పాఠక్ తన భూమిని అమ్మి వచ్చిన డబ్బులతో వైద్యం కోసం అమెరికా తీసుకెళ్లాడు. అక్కడ ఆదర్శ తల లోపల, బయట వైద్యులు చిప్స్​ను అమర్చారు. అప్పటి నుంచి సాధారణ మనుషుల్లాగా వినడం, మాట్లాడడం ప్రారంభించాడు. అంటే అచ్చం రోబోలా అన్నమాట. ఆ చిప్​లు ఛార్జింగ్ అయిపోతే ఆదర్శ్ మాట్లాడలేదు. వినలేడు. బొమ్మలా సైలంట్​గా ఉండిపోతాడు.

Robot Boy Adarsh Pathak
కీ బోర్డ్ ప్లే చేస్తున్న ఆదర్శ్ (ETV Bharat)

దూసుకెళ్తున్న ఆదర్శ్
ప్రస్తుతం ఆదర్శ్ క్రీడలు, చదువులో దూసుకెళ్తున్నాడు. సైన్స్‌ ఇంత పురోగతి సాధించడం పట్ల ఆదర్శ్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ్ వైద్యానికి రూ.2 కోట్లు ఖర్చు అయ్యాయి. ఇదంతా బాగానే ఉన్నా ఆదర్శ్​కు అమర్చిన చిప్స్ సాఫ్ట్‌ వేర్‌ ను అప్డేట్ చేయడానికి, బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ప్రతి నెలా రూ.5 లక్షలు ఖర్చవుతోందని అతడి తల్లిదండ్రులు అంటున్నారు. ఇప్పటికే ఆదర్శ్ చికిత్స కోసం ఉన్న ఆస్తి మొత్తాన్ని అమ్మేశామని తెలిపారు. సాయం కోసం ప్రధాని నరేంద్ర మోదీకి సైతం విజ్ఞప్తి చేసినట్లు ఆదర్శ్ తండ్రి ప్రదీప్ పాఠక్ పేర్కొన్నారు.

Robot Boy Adarsh Pathak
మిగతా విద్యార్థులతో కలిసి ఆదర్శ్ (ETV Bharat)

స్కూల్ అడ్మిషన్ విషయంలోనూ ఇబ్బందులు
స్కూల్ ఆడ్మిషన్ పొందే విషయంలోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని ఆదర్శ తండ్రి ప్రదీప్ అంటున్నాడు. అతడికి అడ్మిషన్ ఇచ్చేందుకు ఏ పాఠశాల ఒప్పుకోలేదని, ఆఖరికి పాపరూర్​లోని ఒక ప్రైవేట్ పాఠశాల అంగీకరించదని ప్రదీప్ తెలిపారు. మొదట్లో ఆదర్శ్ సైలంట్​గా ఉండేవాడని, ఇప్పుడు అతడిలో పురోగతి లభించిందని స్కూల్ టీచర్ శ్వేతా కుమారి చెప్పారు. ఆదర్శ్ మంచివాడని అతడి తోటివిద్యార్థులు చెబుతున్నారు. చదువుతో పాటు క్రీడలు, సంగీతంలో రాణిస్తున్నాడని తెలిపారు. స్టూడెంట్స్, టీచర్స్ అందరూ ఆదర్శ్​కు మద్దతుగా ఉంటారని పేర్కొన్నారు.

'వయసు అయిపోతోంది, పెళ్లి చేయండి!'- వాటర్​ ట్యాంక్ ఎక్కి మరీ 35ఏళ్ల మహిళ డిమాండ్!

'బ్రాండెడ్' షూసే వారి టార్గెట్- 7ఏళ్లుగా అదే పని- మీవేమైనా పోయాయా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.