Road accident in Ambala : హరియాణాలోని అంబాలాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20మందికిపైగా గాయపడ్డారు. వీరందరూ ప్రయాణిస్తున్న మినీ బస్సు అంబాలా- దిల్లీ-జమ్ము జాతీయ రహదారిపై ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను అంబాలా కంటోన్మెంట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులందరూ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి వెళ్తున్న యాత్రికులని పోలీసులు తెలిపారు.
-
\STORY | 7 killed, 20 injured as truck hits bus in #Ambala
— Press Trust of India (@PTI_News) May 24, 2024
READ: https://t.co/U7lvpjl8My https://t.co/pcRomkLqO7
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్ నుంచి మినీ బస్సులో ఒకే కుటుంబానికి చెందిన 30 మంది మాతా వైష్ణోదేవి దర్శనానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరందరూ ప్రయాణిస్తున్న బస్సు అంబాలా వద్ద ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మరణించగా, మరో నలుగురు ఆస్పత్రికి తరలించేసరికి ప్రాణాలు కోల్పోయారు. మిగతా 20మంది అంబాలా కంటోన్మెంట్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారని పోలీసులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ట్రక్కును సీజ్ చేశామని వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల వెనుక నుంచి వెళ్తున్న మినీ బస్సు వాహనాన్ని ఢీకొట్టిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మినీ బస్సు నుజ్జునుజ్దైందని తెలిపారు.
-
Haryana | Seven people died and more than 20 people were injured in a bus accident on the Ambala-Delhi-Jammu National Highway: Dr. Kaushal Kumar, Civil Hospital, Ambala Cantt https://t.co/Iu332pIKq4 pic.twitter.com/6JcaJ4gxSv
— ANI (@ANI) May 24, 2024
ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
కొద్ది రోజుల క్రితం కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని మట్టి లోడ్‌తో వెళ్తున్న లారీ బలిగొంది. రోడ్డు పక్కన నిల్చున వారిపై ఆ లారీ బోల్తా పడడం వల్ల అక్కడికక్కడే వారంతా మృతిచెందారు. ఘటన జరిగిన అనంతరం లారీ డ్రైవర్ వెంటనే పరారయ్యాడు. బాగల్కోట్ జిల్లాలోని బిలాగి తాలుకాలోని యత్నట్టి క్రాస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితులంతా పొలంలో పని చేసి తమ స్వగ్రామానికి వెళ్లేందుకు రోడ్డు పక్కనే నిల్చున్నారు. ఆ సమయంలో రోడ్డుపై మట్టితో వేగంగా వస్తున్న లారీ టైరు పేలింది. దీంతో అదుపుతప్పి ఆ లారీ రోడ్డు పక్కన ఉన్న వారిపైకి బోల్తా పడింది. వారంతా మట్టిలో కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందారు.