Ramoji Film City Award : బంగాల్ రాజధాని కోల్‌కతాలో ట్రావెల్ అండ్ టూరిజం నిర్వహించిన ఫెయిర్‌లో రామోజీ ఫిల్మ్ సిటీకి బెస్ట్ డెకరేషన్ అవార్డు లభించింది. టూరిజం ఫెయిర్‌లో ఆర్ఎఫ్సీ ఏర్పాటు చేసిన డెకరేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిస్వా బంగ్లా మేళా ప్రాంగణంలో మూడు రోజులపాటు జరిగిన ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్‌కు భారీగా సందర్శకులు హాజరయ్యారు. కశ్మీర్, సిక్కిం, లతాగుడితో సహా పలు రాష్ట్రాలు సందర్శకులకు తమ ప్రాంతంలోని ముఖ్య పర్యాటక ప్రదేశాల గురించి స్టాల్స్ వివరించాయి. అలాగే ఈ ఫెయిర్‌కు వచ్చినవారు తమ తదుపరి హాలీడే ట్రిప్ కోసం అవసరమైన సమాచారాన్ని తెలుసుకున్నారు.
ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్‌లో హైదరాబాద్‌కు చెందిన రామోజీ ఫిల్మ్ సిటీకి బెస్ట్ డెకరేషన్ అవార్డు లభించడంపై ఆ సంస్థ జనరల్ మేనేజర్ షోవన్ మిశ్రా, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ టీఆర్ఎల్ రావు సంతోషం వ్యక్తం చేశారు. వీరిద్దరికీ రామోజీ ఫిల్మ్ సిటీ బెస్ట్ డెకరేషన్ అవార్డును ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ చైర్మన్ , సీఈఓ సంజీవ్ అగర్వాల్ అవార్డును అందించారు.
10వేల మంది హాజరు
మూడు రోజులపాటు కోల్‌కతాలో జరిగిన ట్రావెల్ అండ్ టూరిజం నిర్వహించిన ఫెయిర్‌కు 10,000 మంది హాజరయ్యారని రామోజీ ఫిల్మ్ సిటీ జనరల్ మేనేజర్ షోవన్ మిశ్రా తెలిపారు. ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రామోజీ ఫిల్మ్ సిటీలో ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ నిర్వహించే అవకాశాన్ని కూడా మిశ్రా ప్రస్తావించారు. "ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించే అవకాశం ఉంది. ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్‌కు మంచి స్పందన వచ్చింది. బెంగాలీలకు సెలవు దొరికినప్పుడు ప్రయాణం చేయడమంటే చాలా ఇష్టం. మరికొన్ని నెలల్లో దుర్గా పూజ ఉంటుంది. అందుకే ప్రయాణాలకు ఇప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారు. హాలీడే ట్రిప్‌నకు వెళ్లాలనుకునేవారు ఈ ఫెయిర్‌కు వచ్చి వివిధ స్టాల్స్‌ను సందర్శించారు. వివిధ పర్యటక ప్రదేశాల గురించి అడిగి తెలుసుకున్నారు" అని రామోజీ ఫిల్మ్ సిటీ జనరల్ మేనేజర్ షోవన్ మిశ్రా పేర్కొన్నారు.
ఈ ఫెయిర్‌కు ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, కశ్మీర్, ఒడిశా, నేపాల్, అసోం, తెలంగాణ, బంగాల్, బంగ్లాదేశ్, బెంగళూరు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్ వంటి రాష్ట్రాలు, థాయిలాండ్, శ్రీలంక దేశాల నుంచి సందర్శకులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, సిక్కిం, త్రిపురకు చెందిన రాష్ట్ర టూరిజం శాఖలకు చెందిన ప్రతినిధులు ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలకు చెందిన స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. మూడు రోజుల ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ చివరి రోజు(ఆదివారం) ఆసక్తికరమైన కార్యక్రమంతో ముగిసింది. ఇందులో పాల్గొన్న సందర్శకులు చిరస్మరణీయ అనుభవాన్ని పొందారు. చాలా మంది హాలీడే ట్రిప్‌ను ప్లాన్ చేసుకునేందుకు ఈ ఫెయిర్‌కు తరలివచ్చారు. అటువంటి వారికి ఈ ఫెయిర్ బాగా ఉపయోగపడింది.