ETV Bharat / bharat

'రైలు దిగుతూ మరణిస్తే పరిహారం చెల్లించాల్సిన బాధ్యత వారిదే!'- హైకోర్టు కీలక తీర్పు - Railway Compensation Rules

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 5:49 PM IST

Railway Compensation For Death
Railway Compensation For Death

Railway Compensation For Death : రైలు ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రైల్వే శాఖదేననని కర్ణాటక హైకోర్టు తెలిపింది. కదులుతున్న రైలు నుంచి దిగుతున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు మరణించిన కేసులో ఈ తీర్పునిచ్చింది.

Railway Compensation For Death : రైలు దిగుతూ ప్రమాదవశాత్తు మరణించిన ప్రయాణికులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రైల్వే శాఖదే అని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. బాధితులకు పరిహారం నిరాకరిస్తూ రైల్వే చేసిన వాదనను తోసిపుచ్చింది. ఈ మేరకు రైలు దిగుతూ మృతి చెందిన ఓ ప్రయాణికురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిందేనని ఆదేశించింది. మృతురాలి కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.4లక్షలకు ఏడు శాతం వడ్డీ కట్టి ఆ మొత్తం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు పరిహారం రూ.8లక్షలు కన్నా తక్కువ ఉంటే ఇదే మొత్తంలో అందించాలని తీర్పునిచ్చింది.

భారతీయ రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 124-ఏ ప్రకారం ట్రైన్ నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు మరణించిన బాధితురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రైల్వే శాఖదేనని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో రైల్వే క్లైయిమ్స్ ట్రిబ్యునల్(ఆర్​సీటీ) ఇచ్చిన తీర్పును న్యాయస్థానం కొట్టివేసింది.

'మృతురాలి స్వీయ తప్పిదం కారణంగానే ప్రమాదానికి గురైనట్లు రైల్వే ట్రైబ్యునల్ నిర్ధరణకు వచ్చింది. అందుకే ప్రయాణికురాలి కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు అంగీకరించలేదు. ట్రైబ్యునల్ తప్పు చేసింది.' అని కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ పీ సందేశ్ తీర్పునిచ్చారు.

అసలేం జరిగిందంటే?
2014లో జయమ్మ అనే మహిళ తన సోదరి రత్నమ్మతో కలిసి చెన్నపట్టణ రైల్వే స్టేషన్‌ కు వెళ్లింది. మైసూరులోని అశోకపురం వెళ్లేందుకు తిరుపతి ప్యాసింజర్ రైలు కోసం ఎదురుచూసింది. పొరపాటున తన సోదరితో కలిసి ట్యూటికోరిన్ ఎక్స్​ప్రెస్ ఎక్కింది. తాను వేరే రైలు ఎక్కానని గ్రహించిన జయమ్మ కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించింది. అప్పుడు ప్రమాదవశాత్తు రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. దీంతో తమకు పరిహారం ఇవ్వాలని ఆమె కుటుంబ సభ్యులు రైల్వే ట్రైబ్యునల్​ను ఆశ్రయించారు. అందుకు రైల్వే ట్రైబ్యునల్ నిరాకరించింది. ఈ తీర్పును మళ్లీ కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశారు.

మృతురాలు పొరపాటున వేరే రైలు ఎక్కిందని, దిగాలనుకున్నప్పుడు అలారం చైన్ లాగి ఉండాల్సిందని రైల్వే శాఖ తరఫు న్యాయవాది హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. అందుకే రైల్వే చట్టంలోని సెక్షన్ 123(ఈ) కింద ఎలాంటి పరిహారం అందించలేమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. మృతురాలికి పరిహారం ఇవ్వాల్సిందేని తేల్చి చెప్పింది.

తత్కాల్ టికెట్ బుక్ అవ్వడం లేదా? - ఇలా చేశారంటే మీ టికెట్ ఈజీగా కన్ఫర్మ్ అవుతుంది! - IRCTC Tatkal Ticket

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - జనరల్​ టికెట్ కోసం స్టేషన్​కు వెళ్లాల్సిన అవసరం లేకుండా - ఇంటి నుంచే ఈజీగా! - UTS App Update

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.