Priest Returns Money : ఈ మధ్య కాలంలో బ్యాంకు లేదా ఎవరైనా వ్యక్తులు పొరపాటున గుర్తుతెలియని వ్యక్తి అకౌంట్‌ల్లోకి నగదు జమ చేయడం చూస్తున్నాం. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ పూజారి అకౌంట్లోకి కూడా అలా సుమారు కోటిన్నర రూపాయలు జమ అయ్యాయి. దీంతో షాక్ అయిన పూజారి ఆ డబ్బును 24 గంటల్లోనే తిరిగి ఇచ్చేశాడు. పూజారి చేసిన పనికి అందరూ ప్రశంసిస్తున్నారు.
మిర్జాపుర్కు చెందిన మోహిత్ మిశ్ర అనే పూజారి బ్యాంక్ ఖాతాలోకి ఆగస్టు 27న సాయంత్రం రూ.1,48,50,000 జమ అయినట్లు అతడి ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అంత పెద్ద మొత్తాన్ని తన ఖాతాకు ఎవరు వేశారా అని ఆలోచిస్తుండగా తనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మనీ క్యాపిటల్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఉమేశ్ శుక్ల అనే వ్యక్తి ఫోన్ చేసి పొరపాటున నగదు ట్రాన్స్ఫర్ చేశాడని పూజారికి చెప్పాడు. కానీ వెంటనే తిరిగి పంపించడానికి చూస్తే, అప్పటికే బ్యాంకు సమయం దాటిపోయింది. దీంతో నేను 24 గంటల్లో డబ్బులను తిరిగి జమ చేస్తానని అవతలి వ్యక్తికి హామీ ఇచ్చాడు పూజారి. ఆ తర్వాతి రోజు ఉదయం వెళ్లి చెక్కు ద్వారా మొత్తాన్ని తిరిగి జమ చేశాడు.
ఇదీ జరిగింది
మిర్జాపుర్లోని శ్రీ మా వింధ్యవాసిని సేవా సమితి సంస్థ వింధ్యాచల్ ధామ్‌లో పూజతో పాటు జాగరణ, భండారా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పూజల కోసం దేశ, విదేశాల నుంచి భక్తులు భారీ విరాళలను అందిస్తుంటారు. ఉమేశ్ శుక్ల వ్యక్తి కూడా ఈ సంస్థకు రూ. 11,000 విరాళం ఇచ్చేందుకు బ్యాంకుకు వెళ్లాడు. ఈ నగదుతో పాటు మరో అకౌంట్‌కు కోటిన్నర రూపాయలను జమ చేయాల్సి ఉంది. అయితే పొరపాటున పూజారి మిశ్ర అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇది జరిగిన 24 గంటల లోపే నగదు తిరిగి ఇచ్చిన పూజారిని స్థానికులు అభినందిస్తున్నారు.
అయోధ్య రాముడి గుడికి రూ.2100 కోట్ల చెక్- కానీ ఓ బిగ్ ట్విస్ట్!
PM Relief Fund Donation To Ayodhya : ఇటీవల ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం అందేలా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రూ.2,100 కోట్ల చెక్కు రావడం చర్చనీయాంశమైంది. ఈ చెక్కును పంపిన వ్యక్తి దానిపై తన పేరు, మొబైల్ నంబర్, అడ్రస్‌ను రాశారు. కానీ చెక్కును ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ పేరు మీద ట్రస్ట్‌కు పోస్టు ద్వారా పంపించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.