Pre And Post Holi Care Tips : ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకునే పండుగ హోలీ. ఈ పండుగ రోజున ఒకరిపై ఒకరు రంగులు పూసుకోవడం, రంగునీళ్లు చల్లుకోవడం చేస్తుంటారు. ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మీ చర్మానికి, కళ్లకు హాని కలగవచ్చు. అవును రంగుల్లో కలిపే రకరకాల కెమికల్స్ కారణంగా మీకు చర్మం, కంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే మీరు హోలీ ఆడటానికి ముందు, ఆడిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటంటే.
హోలీ ఆడటానికి వెళ్లే ముందు:
- రంగులు
హోలీ రంగుల నుంచి మీకు ఎలాంటి హాని కలగకుండా ఉండాలంటే, ఆ రంగులు సహజమైనవా కావా అని ముందు తెలుసుకోవాలి. సేంద్రీయ పద్ధతిలో తయారు చేసే రంగులు తెచ్చుకోవడం లేదా ఇంట్లోనే రంగులను తయారు చేసుకోవడం లాంటివి చేయాలి. - తేమ
చర్మాన్ని కాపాడుకోవాలంటే మీరు హోలీ రంగుల్లో మునిగి తేలడానికి ముందు మీ ముఖంతో పాటు శరీరానికి కూడా తేమను అందించాలి. ఇందుకోసం నూనె లేదా ఎక్కువ సేపు నిలిచే సన్ స్క్రీన్ లోషన్ తప్పకుండా రాసుకోవాలి. - దుస్తులు
హోలీ ఆడేముందు మీరు నిండైన దుస్తులు వేసుకోవాలి. ఫుల్ స్లీవ్ టాప్స్, ప్యాంట్ తో మీ శరీరం అంతా మునిగి పోయేలా ఉంటే చర్మంపై రంగుల ప్రభావం తగ్గుతుంది. దీంతో పాటు తలకు స్కార్ఫ్ ధరించడం వల్ల రంగుల్లోని రసాయనాల నుంచి వెంట్రుకలను కాపాడుకోవచ్చు.
హోలీ ఆడిన తర్వాత:
- మృదువైన సబ్బు
హోలీ రంగుల్లో మునిగి తేలిన తర్వాత ఇంటికి రాగానే మీరు చేయాల్సిన పనేంటంటే మీ ముఖాన్ని, శరీరాన్ని శుభ్రంగా కడుక్కోవడం. ముఖ్యంగా ఇందుకు మీరు చాలా మృదువైన సబ్బును కానీ ఫేస్ వాష్‌ను మాత్రమే ఉపయోగించాలి. - ఫేస్ మాస్క్
రంగుల్లోని హానికరమైన కెమికల్స్ నుంచి తప్పించుకోవాలంటే మీరు మీ చర్మాన్ని రీహైడ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత హైడ్రేటెడ్ ఫేస్ మాస్క్ వేసుకోవాలి. పావుగంట పాటు దాన్ని ఉంచుకుని గోరు వెచ్చని నీటితో ముఖాన్ని తిరిగి శుభ్రం చేసుకోవాలి. - రుద్దడం మానేయాలి
హోలీ ఆడి వచ్చిన తర్వాత ఒంటి మీద, ముఖం మీద ఉన్న రంగుల్ని పోగొట్టుకునేందుకు తెగ రుద్దేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీ చర్మానికి హాని కలుగుతుందని ఎంతమందికి తెలుసు. రంగుల్ని పోగొట్టుకునేందుకు సున్నితమైన సబ్బు లేదా క్రీములతో మృదువుగా రాసుకుని కడుక్కోవాలి. - తేమ
హోలీ ఆడటానికి ముందు చర్మాన్ని తేమతో ఉంచడానికి ఎలా నూనె లేదా సన్ స్క్రీన్ లోషన్లు రాసుకుంటామో, వచ్చి ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత కూడా తేమను అందించే క్రీములను రాసుకోవాలి.
కళ్లను కాపాడుకోవడం ఎలా?
- హోలీ రంగుల నుంచి కళ్లను కాపాడుకునేందుకు మార్కెట్లో ప్రత్యేకంగా కళ్ల జోడు దొరుకుతుంది. వాటిని తెచ్చి పెట్టుకుని హోలీ ఆడితే రంగుల వల్ల కంటికి ఎలాంటి సమస్య ఉండదు.
- కళ్ల చుట్టూ ఏదైనా పెట్రోలియం జెల్లీని రాసుకుని హెలీ ఆడటానికి వెళ్లండి. పెట్రోలియం జెల్లీ లేదా సున్నితమైన క్రీమలు మీ కళ్లపై ప్రమాదవశాత్తు పడ్డా దురద, చికాకు, మంట లాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
- కంటికి లెన్స్ వాడేవారు హోలీ ఆడేముందు వాటిని తీసి వెళుతుంటారు. ఇలా చేయడం మీ కంటికి చాలా ప్రమాదం. లెన్స్ మీ కంటిని అన్ని వేళలా రక్షిస్తాయి. కాబట్టి వాటిని ధరించే హోలీని సెలబ్రేట్ చేసుకోండి.
- హోలీ ఆడి వచ్చిన తర్వాత వెంటనే మీరు చేయాల్సిన పనేంటంటే కంటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇందుకు మీరు చాలా సున్నితమైన, మృదువైన సబ్బు, క్రీములను మాత్రమే ఉపయోగించాలి.
పర్యావరణ హితంగా హోలీ- ఇంట్లోనే రంగులను తయారు చేయండిలా! - Holi Colors Preparation In Home
విమానంలో ఈ ఆహార పదార్థాలను అస్సలు అనుమతించరు- అవేంటో తెలుసా? - Food Items Not Allowed In Flight