ETV Bharat / bharat

ఫ్రెండ్​తో వెళ్లిన బాలికపై గ్యాంగ్​రేప్​- నిందితులకు 90ఏళ్ల జైలుశిక్ష - బాలికపై సామూహిక అత్యాచారం కేసు

Poopara Gang Rape Case : బాలికపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులకు 90 ఏళ్ల జైలుశిక్ష విధించింది కేరళలోని ఫాస్ట్​ట్రాక్​ కోర్టు. ఈ మేరకు మంగళవారం తీర్పును వెలువరించింది.

Poopara Gang Rape Case
Poopara Gang Rape Case
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 10:40 PM IST

Updated : Jan 30, 2024, 10:51 PM IST

Poopara Gang Rape Case : కేరళలోని ఇడుక్కి జిల్లా పూప్పరలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులకు 90 ఏళ్ల జైలుశిక్ష పడింది. ఈ మేరకు దేవికులం ఫాస్ట్​ట్రాక్ స్పెషల్ పోక్సో కోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. నిందితులను పూప్పరకు చెందిన సుగంధ్, శివకుమార్, శామ్యూల్​గా గుర్తించారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్లో ఒకరిపై సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల నిర్దోషిగా విడుదల చేసింది, కాగా ఇద్దరు మైనర్ నిందితులు తోడుపుజ జువైనల్ కోర్టులో ఉన్నారు.

నిందితులకు 90 ఏళ్ల జైలుశిక్ష
పూప్పరలో తన స్నేహితుడితో కలిసి టీ తోటకు వెళ్లిన 14 ఏళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన 2022 మేలో జరిగింది. ఆమెతో ఉన్న బాలిక స్నేహితుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు నిందితులు. దీనిపై మరో కేసు నమోదైంది. అత్యాచారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను దేవికులం స్పెషల్ ఫాస్ట్​ట్రాక్ పోక్సో కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ముగ్గురు నిందితులకు దేవికులం ఫాస్ట్​ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి పీఏ సిరాజుద్దీన్, 90 ఏళ్ల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.40 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. ఈ మొత్తాన్ని బాలికకు అందజేయాలని కోర్టు ఆదేశించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఎనిమిది నెలలు జైలుశిక్ష అనుభవించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

రాజస్థాన్​లో మైనర్​పై గ్యాంగ్​రేప్- నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష
రాజస్థాన్​లో ఓ 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు వ్యక్తులకు బుండిలోని పోక్సో కోర్టు 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. నిందితులకు జైలుశిక్షతో పాటు రూ. 2 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ ఈ మేరకు కోర్టు తీర్పునిచ్చింది. దోషులను టోంక్ జిల్లాలోని డియోలీ పట్టణ నివాసి రామజాస్ రాథోడ్​, హిందోలి పోలీస్​స్టేషన్ పరిధిలోని ముల్చంద్ మీనా, ముల్చంద్ రాథోడ్​, మహేంద్ర కుమార్​ రాథోడ్​లుగా గుర్తించారు.

మేనల్లుడిపై అత్త అత్యాచారం- ఏడాదిగా అలానే!- ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులు

దళిత బాలుడికి మూత్రం తాగించి దాడి- కనుబొమ్మలు పీకేసి దారుణం

Last Updated : Jan 30, 2024, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.