ETV Bharat / bharat

అటుకులతో అద్దిరిపోయే నగ్గెట్స్ - పిల్లలు వదలకుండా కుమ్మేస్తారు! - Making Process of Poha Nuggets

Poha Nuggets Making Process: సాయంత్రం అయితే చాలా మందికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఈ లిస్టులో బజ్జీలు, గారెలు, పునుగులు వంటివి రెగ్యులర్​గా ఉంటాయి. ఫర్​ ఏ ఛేంజ్.. ఈ సారి పోహా నగ్గెట్స్​ ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు వదలకుండా లాగిస్తారు!

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 5:05 PM IST

Poha Nuggets Making Process: ఈవెనింగ్ స్నాక్స్ అనేది ఆరోగ్య రిత్యా అవసరమే అంటారు నిపుణులు. అయితే.. ఎప్పుడూ బయటి నుంచి తెచ్చినవే తినడం అంత మంచిది కాదు. వాళ్లు ఎలాంటి ఆయిల్ వాడుతారో.. ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో తెలియదు. అందుకే.. అప్పుడప్పుడూ ఇంట్లో చేయండి. అదే సమయంలో.. రొటీన్ రెసిపీస్ కాకుండా వెరైటీస్ ప్లాన్ చేయండి. మీ కోసమే.. ఇప్పుడు పోహా నగ్గెట్స్​ రెసిపీ తీసుకొచ్చాం. మరి, ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

పోహా నగ్గెట్స్​కు కావాల్సిన పదార్థాలు:

  • అటుకులు - 1 కప్పు
  • ఉల్లిపాయ తరుగు - అరకప్పు
  • ఉడికించిన పచ్చి బఠాణి - పావు కప్పు
  • జీలకర్ర పొడి - అర టేబుల్​ స్పూన్​
  • కారం - పావు టేబుల్​ స్పూన్​
  • కార్న్​ ఫ్లోర్​ - 2 టేబుల్​స్పూన్లు
  • ఉడికించిన బంగాళాదుంపలు- 2(పెద్దవి)
  • క్యాప్సికం ముక్కలు - అర కప్పు
  • కొత్తిమీర తరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • డ్రై మ్యాంగో పౌడర్​ - అర టేబుల్​ స్పూన్​
  • గరం మసాలా పొడి - పావు టేబుల్​స్పూన్​
  • బియ్యం పిండి - 2 టేబుల్​స్పూన్​
  • బ్రెడ్​ క్రంబ్స్​ - 4 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - రుచికి తగినంత
  • ఆయిల్​- డీప్​ ఫ్రైకి సరిపడా

సగ్గుబియ్యంతో పసందైన వంటలు - టేస్ట్​ సూపర్​! తింటే వదిలిపెట్టరు!

తయారీ విధానం:

  • ముందుగా అటుకులను బాగా కడిగి నీళ్లలో ఒక నిమిషం పాటు నానబెట్టాలి. తర్వాత నీటిని పిండేసి అటుకులను ఒక గిన్నెలో వేసుకోవాలి.
  • తర్వాత మరో గిన్నె తీసుకుని ఉడికించిన బంగాళాదుంపలను తీసుకుని మెత్తగా చేసుకోవాలి. అందులోకి అటుకులు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • తర్వాత అందులోకి ఉల్లిపాయ తరుగు, క్యాప్సికం, ఉడికించిన పచ్చి బఠాణి, తరిగిన కొత్తిమీర వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి.
  • తర్వాత జీలకర్ర పొడి, డ్రై మ్యాంగో పొడి, కారం, గరంమసాలా, ఉప్పు, బియ్యం పిండి వేసి బాగా కలిపి ముద్దలాగా చేసుకోవాలి.
  • ఇప్పుడు పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ నగ్గెట్స్​ ఆకారంలో ఒత్తుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మరో గిన్నె తీసుకుని అందులోకి కార్న్​ఫ్లోర్​, పావుకప్పు నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న నగ్గెట్స్​ను కార్న్​ఫ్లోర్​ మిశ్రమంలో ముంచి తర్వాత బ్రెడ్​ పొడి రోల్​ చేసుకోవాలి. నగ్గెట్స్​ మొత్తానికి బ్రెడ్​ పొడి అంటుకునేలా చూడాలి. ఇలా అన్ని నగ్గెట్స్​ను చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడిచేసుకోవాలి. నూనె వేడెక్కాక రెడీ చేసుకున్న నగ్గెట్స్​ను వేసి గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేవరకు రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే ఎంతో క్రిస్పీగా ఉండే పోహా నగ్గెట్స్​ రెడీ.
  • వీటిని పుదీనా చట్నీ, టమాట కెచప్​లతో తింటే టేస్ట్​ అదిరిపోతుంది. పైన ఒరెగానో, రెడ్ చిల్లి ఫ్లెక్స్ చల్లుకుని తిన్నా బావుంటుంది. ఇక, లేట్​ చేయకుండా మీరు కూడా ఈ నగ్గెట్స్​ రెడీ చేయండి.

క్రిస్పీ పొటాటో లాలీపాప్స్​- ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినడం పక్కా!

స్నాక్స్​లో ఆయిల్ ఫుడ్ వద్దు - ఇవి తింటే అదుర్స్ - రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం!

Chicken Snacks Recipes : సండే స్పెషల్.. చికెన్ స్నాక్స్ చేసేద్దామా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.