ETV Bharat / bharat

సూపర్‌ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని మోదీ- మన వాటా పెటా బైట్స్​లో ఉండాలట! - Modi Super Computers

Modi Super Computers : దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సూపర్‌ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సాంకేతిక విప్లవంలో మన వాటా బిట్స్‌, బైట్స్‌లో కాదు, టెరా బైట్లు, పెటా బైట్లలో ఉండాలన్నారు.

Modi Super Computers
Modi Super Computers (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2024, 8:39 PM IST

Updated : Sep 26, 2024, 10:29 PM IST

Modi Super Computers : దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సూపర్‌ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. శాస్త్రీయ పరిశోధనల కోసం 130 కోట్ల రూపాయలతో పుణె, దిల్లీ, కోల్‌కతాలో ఏర్పాటు చేసిన "పరమ్‌ రుద్ర" సూపర్‌ కంప్యూటర్లను దిల్లీ నుంచి ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. వాతావరణ పరిశోధనల కోసం 850 కోట్ల రూపాయలతో రూపొందించిన హై-పెర్ఫామెన్స్‌ కంప్యూటింగ్ సిస్టమ్‌ను ప్రధాని ఆవిష్కరించారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇదో గొప్ప విజయమని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. సాంకేతిక, కంప్యూటింగ్‌ సామర్థ్యంపై ఆధారపడని రంగమంటూ ఏదీ లేదని అన్నారు.

ఈ సాంకేతిక విప్లవంలో భారత్‌ వాటా బిట్స్‌, బైట్స్‌లో కాకుండా టెరా బైట్లు, పెటా బైట్లలో ఉండాలన్నారు. భారత్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ, పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు. సొంతంగా సెమీకండక్టర్‌ ఎకో సిస్టమ్‌ను నిర్మించి ప్రపంచంలోని సరఫరా గొలుసులో కీలకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సైన్స్‌ ప్రాముఖ్యం కేవలం ఆవిష్కరణలు, అభివృద్ధి వరకే పరిమితం కారాదన్న ప్రధాని, దేశంలో ఆఖరి పౌరుడి ఆకాంక్షలను సైతం నెరవేర్చేలా ఉండాలని ఆకాంక్షించారు.

"అంతరిక్ష రంగంలో భారత్‌ ప్రధాన శక్తిగా మారింది. ఇతర దేశాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి సాధించిన విజయాన్ని మన శాస్త్రవేత్తలు పరిమిత వనరులతోనే సాధించారు. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్‌ అవతరించింది. ఇదే ఉత్సాహంతో భారత్ ఇప్పుడు గగన్‌యాన్ కోసం సిద్ధమవుతోంది. 2035 కల్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలే అందుకు సంబంధించిన మెుదటి దశకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది" నరేంద్ర మోదీ తెలిపారు.

Last Updated : Sep 26, 2024, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.