ETV Bharat / bharat

ఇంట్రస్టింగ్ : ఈ కాకులు మాట్లాడతాయి! - పాటలూ పాడతాయట!! - Interesting Facts About Crow - INTERESTING FACTS ABOUT CROW

Pied Crow Interesting Facts : సాధారణంగా మనందరికీ కాకులు అనగానే కావ్ కావ్ మంటూ నల్లగా ఉండేవి మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ, ఇప్పుడు చెప్పబోయే కాకి రంగులో కాస్త డిఫరెంట్​గా ఉండడమే కాకుండా.. మాట్లాడగలదు! అంతేకాదు.. పాటలు పాడగలదు! మరి, ఆ కాకి పేరేంటి? దాని విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

Pied Crow Interesting Facts
Pied Crow (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 9:44 AM IST

Updated : Aug 7, 2024, 1:40 PM IST

Interesting Facts About Pied Crow : కాకి ఒక నల్లని పక్షి. దీన్ని సంస్కృతంలో వాయసం అని అంటారు. సాధారణంగా అన్ని ప్రాంతాల్లోనూ కాకులు కనిపిస్తాయి. వీటిని ఎవరూ స్పెషల్​గా పెంచరు. అయినా పెంపుడు ప్రాణుల్లాగా కావ్ కావ్ అంటూ అరుస్తూ.. మన చుట్టూ ఉన్న పరిసరాల్లోనే మెలగుతుంటాయి. అయితే, మనందరికీ కాకి గురించి ఈ విషయాలు మాత్రమే తెలుసు. కానీ, ఇప్పుడు చెప్పబోయే కాకి.. రంగులో మన చుట్టూ పక్కల తిరిగే కాకుల కంటే కాస్త డిఫరెంట్​గా ఉంటుంది. అలాగే వాటి కంటే పెద్ద పరిమాణాన్ని కలిగి ఉంటుంది. వీటన్నింటి కంటే ముఖ్యంగా ఈ కాకి మాట్లాడగలదు.. పాటలు పాడగలదని బర్డ్ సైంటిస్టులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఆ కాకి పేరు.. పైడ్ క్రౌ. ఇదీ చూడడానికి మామూలు కాకుల మాదిరిగానే నలుపు రంగులో కనిపిస్తుంది. కానీ, మొత్తం బ్లాక్ కలర్​లో ఉండదు. మెడ కింద, పై భాగం తెలుపు రంగులో ఉంటుంది. అంటే.. ముక్కు, కాళ్లు, రెక్కలు, తోక బ్లాక్ కలర్​లో ఉండి.. మెడ కింద, పైన.. పొట్ట భాగం మాత్రం వైట్ కలర్​లో కనిపిస్తుంది. ఈ పైడ్ క్రౌ ఆఫ్రికా దేశాలలో ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే.. థాయ్‌లాండ్‌, గునియా వంటి దేశాల్లో కూడా అక్కడక్కడా కనిపిస్తుంది.

ఇది అన్నింట్లోనూ ఎక్కువే..!

పైడ్ క్రౌ కూడా మామూలు కాకుల మాదిరిగానే అన్ని ఆహారాలనూ తింటుంది. అంటే.. స్పెషల్​గా ఒకే ఫుడ్ అని ఏమి తినదు. ఏది దొరికితే దాంతో బొజ్జ నింపుకుంటుంది. చిన్నచిన్న కీటకాలు, పక్షుల గుడ్లు, విత్తనాలు, పండ్లు, దుంపలు ఇలా అన్నింటినీ ఈ కాకి తింటుంది. ఇవి చిన్న గుంపులుగా తిరుగుతుంటాయి. అయితే, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే.. ఈ కాకి మన దగ్గర ఉండే కాకుల కంటే పరిమాణంలో కాస్త పెద్దగా ఉంటుంది. పైడ్ క్రౌ ముక్కు, కాళ్లు కూడా పెద్దగానే ఉంటాయి.

పాటలు పాడుతుందట!

ఈ కాకి గురించి మీరు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యం విషయమేమిటంటే.. దీనికి కాస్త శిక్షణ ఇస్తే మాట్లాడగలదు! పాటలు కూడా పాడగలదు! అదేంటి.. కాకి, పాట పాడటమేంటి అనుకుంటున్నారా? కానీ, నిజం శిక్షణనిస్తే పైడ్ క్రౌ పాటలు పాడగలదట. అంటే.. బాధగా ఉన్నప్పుడు ఒకలా, సంతోషంగా ఉన్నప్పుడు మరోలా శబ్దాలు చేస్తుందట. అప్పుడు తాను ఎలా ఉన్నానన్న విషయం దాని తోటి పక్షులకు తెలిసిపోతుందన్నమాట. ఇక పైడ్ క్రౌ బరువు వచ్చేసరికి.. 520 గ్రాముల వరకు ఉంటుంది. పొడవు 46 నుంచి 52 సెంటీ మీటర్ల వరకు ఉంటుంది. సాధారణంగా అయితే, ఈ కాకి 6 సంవత్సరాలు బతుకుతుంది. అదే రక్షణ కల్పిస్తే.. 20 ఏళ్ల వరకు జీవిస్తుందని బర్డ్ సైంటిస్టులు చెబుతున్నారు.

ఇవీ చదవండి :

ఇంట్రస్టింగ్ : పాములకు రెక్కలు ఉంటాయా? - ఈ స్నేక్ గాలిలో ఎగురుతుంది మరి!

"కాకి పిల్ల మనిషికీ ముద్దే.." కావాలంటే మీరే చదవండి!

Last Updated : Aug 7, 2024, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.