ETV Bharat / bharat

భారత్‌-రష్యా సీక్రెట్లు పాక్​కు! మాస్కోలోని ఎంబసీలో ISI ఏజెంట్!- మేరఠ్​లో​ అరెస్ట్​ - యూపీలో ఐఎస్​ఐ ఏజెంట్ అరెస్ట్

Pakistani ISI Agent Arrested : పాకిస్థాన్​కు చెందిన గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. భారత్‌-రష్యా దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలపై నిఘా పెట్టింది. ఇందుకోసం మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో తన గూఢచారిని నియమించింది. ఇతడిని తాజాగా యూపీ-ఏటీఎస్​ అధికారులు అరెస్ట్​ చేశారు.

Pakistani ISI Agent Arrested
Pakistani ISI Agent Arrested
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 1:29 PM IST

Updated : Feb 4, 2024, 2:21 PM IST

Pakistani ISI Agent Arrested : భారత్‌-రష్యా వ్యూహాత్మక సంబంధాలపై పాకిస్థాన్​ నిఘా పెట్టిన విషయాన్ని ఉత్తర్​ప్రదేశ్​ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ బయటపెట్టింది. ఇందుకోసం ఐఎస్‌ఐ తన గూఢచారిని ఏకంగా రష్యా రాజధాని మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో నియమించింది​. ఇతడి ద్వారా ఇరు దేశాలకు చెందిన కీలక సమాచారాన్ని అపహరిస్తోంది పాక్​. ఈ క్రమంలో నిందితుడు(గూఢచారి) సతేందర్‌ సివాల్‌ను తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం మేరఠ్‌లో అదుపులోకి తీసుకుంది. ఇతడిని హాపూర్​ జిల్లాలోని షామహియుద్దీన్‌పూర్​ గ్రామానికి చెందిన జైవీర్​ సింగ్ కుమారుడిగా గుర్తించింది. అతడు 2021 సంవత్సరం నుంచి విదేశాంగ శాఖలో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఐబీఎస్​ఏ)గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

భారత విదేశాంగ శాఖలో ఓ ఐఎస్‌ఐ ఏజెంట్‌ చొరబడ్డాడనే రహస్య సమాచారం అందగా ఉత్తర్‌ప్రదేశ్‌ ఏటీఎస్‌ అలర్ట్​ అయింది. అతడు భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌ నిఘా సంస్థకు అందజేస్తున్నాడని, ప్రతిగా డబ్బు తీసుకొంటున్నట్లు పసిగట్టింది. అతడి కదలికలపై నిఘా పెట్టి ఆరెస్టు చేసినట్లు తెలిపింది. కాగా, ఈ సమాచారం భారత్‌కు భారీ ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత సైనిక సంస్థలు ఆదివారం దీనిపై ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశాయి.

'కేవలం డబ్బు కోసమే'
UP ATS Arrested ISI Agent : 'నిందితుడు సివాల్​కు ఐఎస్‌ఐతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. రక్షణ , విదేశాంగ శాఖ సహా భారత మిలిటరీకి సంబంధించిన విలువైన రహస్య సమాచారాన్ని ఇతడు గూఢచర్య సంస్థకు అందిస్తున్నట్లు గుర్తించాం. కేవలం డబ్బు కోసమే అతడు ఇదంతా చేశానని మా విచారణలో అంగీకరించాడు' అని ఏటీఎస్​ అధికారులు తెలిపారు. ఇక లఖ్​నవూలోని ఏటీఎస్​ పోలీస్​ స్టేషన్​లో గూఢచారి సతేందర్‌ సివాల్‌పై ఎఫ్​ఐఆర్​ నమోదైంది. ఐపీసీలోని సెక్షన్​ 121ఏతో పాటు అధికారిక రహస్యాల చట్టం-1923 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

TRAIN ఫుల్ ఫామ్​ తెలుసా? ఆ పదం ఏ భాష నుంచి వచ్చింది?

నల్ల టమాటాతో లాభాల 'పంట'- కిలో@150- ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!

Last Updated : Feb 4, 2024, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.