ETV Bharat / bharat

102ఏళ్ల క్రికెటర్- యువతకు ఆదర్శంగా కశ్మీరీ తాత- కొడుకు, మనవడికి స్పెషల్ ట్రైనింగ్! - Oldest Cricketer in Kashmir - OLDEST CRICKETER IN KASHMIR

Oldest Cricketer in Kashmir : క్రికెట్‌ ఆడటానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు ఓ వృద్ధుడు. 102 ఏళ్ల వయస్సులో హుషారుగా కాళ్లకు ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్‌ చేస్తున్నారు. వందేళ్ల వయసులో కూడా యువతకు ప్రేరణగా నిలుస్తూ వాళ్లకు మెలకువలు నేర్పిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్​సభ ఎన్నికల్లో ఓటు కూడా వేశారు. ఇంతకీ ఆయన ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Oldest Cricketer in Kashmir
Oldest Cricketer in Kashmir (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 5:03 PM IST

102ఏళ్ల క్రికెటర్- యువతకు ఆదర్శంగా కశ్మీరీ తాత! (ANI)

Oldest Cricketer in Kashmir : క్రికెట్‌ ఆడటానికి వయసు అడ్డంకి కాదని ఓ శతాధిక వయోవృద్ధుడు నిరూపించారు. 102 ఏళ్ల వయసులో యువకుడిలా క్రికెట్ ఆడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏకంగా కుర్రాళ్లతో పోటీపడి మరీ క్రికెట్ ఆడుతున్నారు. ఆయనే కశ్మీర్​లోని రియాసీకి చెందిన హాజీ కరమ్ దిన్. వయసు వందేళ్లు పైబడినా కాళ్లకు ప్యాడ్స్, చేతులకు గ్లౌజులు వేసుకుని దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు హాజీ. తర్వాతి తరానికి మెలకువలు కూడా నేర్పిస్తున్నారు.

"నాకు క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం. నేను నా పిల్లలను తీసుకుని అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాను. వాళ్లు ఆడే విధానాన్ని చూస్తా. ఆటలో ఏమైనా తప్పులు చేస్తే వాటిని సరి చేస్తుంటాను" అని హాజీ కరమ్​ దిన్ చెబుతున్నారు.

ఔటైతే తిట్టడమే!
యువతకు ఆదర్శంగా నిలుస్తూ ఈ వయస్సులో కూడా గ్రౌండ్​కు వచ్చి మాతో నాన్న క్రికెట్ ఆడటం చాలా సంతోషంగా ఉందని హాజీ కుమారుడు మహ్మద్ నదీమ్ చెబుతున్నారు.

"మా నాన్న మంచి క్రికెటర్. నా కుమారుడు కూడా ఇక్కడ ఆడుతాడు. ఆయనతో ఆడుతుంటే నాకు ఆనందంగా అనిపిస్తుంది. నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆయన మాకు ఎన్నో మెలకువలు నేర్పిస్తారు. ఒక వేళ మేం ఒక్క పరుగు కూడా చేయకుండా ఔటైతే తిట్లు తింటాం. ఎందుకు ఇలాంటి షాట్ ఆడారని అప్పుడప్పుడు సరదాగా కొడతారు కూడా. అయినా కూడా మాకు ఆయన ఇలా చెప్పడం ఎంతో నచ్చుతుంది"

-- మహ్మద్ నదీమ్, హాజీ కరమ్ కుమారుడు

తాత దగ్గరి నుంచి ఎన్నో మెలకువలు
హాజీ కరీమ్​ నుంచి ఎన్నో మెలకువలు నేర్చుకుంటున్నామని ఆయన మనవడు మహ్మద్​ హాసిమ్​ నదీమ్ చెబుతున్నాడు. 'మా తాతగారి వయసు ఇప్పుడు దాదాపు 102 ఏళ్లు. నేను ఇండియన్ టీమ్​ కోసం ఆడాలనేది మా తాతయ్య కల. మా నాన్న కూడా నేను ఐపీఎల్​, ఇండియన్ టీమ్​కు ఆడాలని అనుకునేవారు. దాని కోసం నేను చాలా ఏళ్లుగా శ్రమిస్తున్నాను. నేను స్టేట్​ ప్లేయర్​ను. అనేక క్యాంప్స్​లో ఆడుతున్నాను. దాని వల్ల నాకు తగినంత ప్రాక్టీస్ లభిస్తోంది. మా తాతయ్య ఈ వయసులో మాతో పాటు వచ్చి ఇలా మెలకువలు నేర్పించడం మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది' అని మహ్మద్​ హాసిమ్​ నదీమ్ తెలిపారు.

102 ఏళ్ల వయసులో గ్రౌండ్​లోకి దిగి హాజీ క్రికెట్​ ఆడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వయసులో కూడా ఉత్సాహంగా హాజీ ఆడటం చూసి అందరూ ఆయనను ప్రశంసిస్తున్నారు.

ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి- రోజు గడిచినా దొరకని ఆచూకీ - Family Drowned In Narmada River

న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్​కు ఊరట- అరెస్ట్​ చెల్లదని సుప్రీం తీర్పు - Prabir Purkayastha Arrest

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.