ETV Bharat / bharat

ట్రాక్​పై లారీ బోల్తా- రైలుకు ఎదురెళ్లి వృద్ధ జంట సాహసం- వందల మంది ప్రాణాలు సేఫ్! - lorry accident old couple train

Old Couple Avoids Major Train Accident : రైల్వే ట్రాక్​పై బోల్తా పడిన లారీని చూసి ట్రైన్​కు ఎదురెళ్లారు ఇద్దరు వృద్ధులు. రైలు ప్రమాదానికి గురి కాకుండా సాహసం చేశారు. టార్చ్​లైట్​తో లోకో పైలట్​కు సిగ్నల్ ఇచ్చి ప్రమాదం జరగకుండా చూశారు.

Old Couple Avoids Major Train Accident
Old Couple Avoids Major Train Accident
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 10:41 AM IST

Old Couple Avoids Major Train Accident : పట్టాలపై బోల్తా పడ్డ లారీ- ఎదురుగా వేగంగా దూసుకొస్తున్న రైలు- చుట్టూ ఎవరూ లేరు- చేతిలో ఓ టార్చ్​లైట్- ఇలాంటి పరిస్థితిలో వృద్ధ దంపతులు సాహసం చేశారు. రైలు ప్రమాదానికి గురికాకుండా చేసేందుకు ట్రైన్ వచ్చే దారిలో ఎదురెళ్లి హెచ్చరిక సిగ్నల్ ఇచ్చారు. టార్చ్​లైట్​తోనే రైలు లోకో పైలట్​కు సిగ్నల్ ఇచ్చి ఘోర దుర్ఘటన జరగకుండా నిలువరించారు. తమిళనాడులో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

Heroic Old Couple Avoids Major Train Accident in Tenkasi
ట్రాక్​పై బోల్తాపడ్డ లారీ

కేరళ నుంచి ప్లైఉడ్ లోడుతో వస్తున్న ఓ లారీ తమిళనాడు సరిహద్దులో ప్రమాదానికి గురైంది. తూత్తుకుడికి వెళ్లాల్సిన ఆ లారీ ఎస్.వేలవు ప్రాంతంలో అదుపుతప్పి రైల్వే ట్రాక్​పై బోల్తా పడింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అదేసమయంలో తిరునెల్వేలి నుంచి కేరళలోని పాలక్కడ్​కు వెళ్లే ఓ రైలు ఆ మార్గం గుండా వచ్చింది.

దంపతుల సిగ్నల్- పైలట్ అలర్ట్
ఆ సమయంలో అక్కడే ఉన్న షన్ముగయ్య, కురుంతామ్మల్ దంపతులు రైలును ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకున్నారు. వెంటనే రైలు వచ్చే మార్గంలో పరిగెత్తారు. చేతిలో ఉన్న టార్చ్​లైట్​తో రైలు లోకో పైలట్​కు సిగ్నల్ ఇచ్చారు. వృద్ధుల సిగ్నల్​ను గమనించిన లోకో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. బ్రేకులు వేసి రైలును ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.

షన్ముగయ్య, కురుంతామ్మల్ దంపతులు

లారీ డ్రైవర్ మృతి- క్లీనర్ సేఫ్
ట్రాక్​పై బోల్తా పడ్డ లారీ పూర్తిగా ధ్వంసమైంది. లారీ డ్రైవర్​ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్​ను ముక్కుదాల్ ప్రాంతానికి చెందిన మణికందన్(34)గా గుర్తించారు. లారీలో ఉన్న క్లీనర్ ప్రమాద సమయంలో కిందకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నాడు. అనంతరం పులియరాయ్ ప్రాంత పోలీసులు, తేన్​కాశీ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తేన్​కాశీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ట్రాక్​కు రిపేర్లు
అనంతరం, ట్రాక్​పై పడిపోయిన లారీని రైల్వే సిబ్బంది తొలగించారు. పట్టాలకు వెనువెంటనే మరమ్మతులు చేశారు. ప్రమాదం వల్ల చెన్నై నుంచి కొల్లం వైపు వెళ్లే రైలును నిలిపివేశారు. సెంగొట్టయ్- పాలక్కడ్ మధ్య నడిచే రైలు సైతం ఆలస్యంగా ప్రయాణించింది. రిపేర్లు పూర్తైన అనంతరం రైళ్ల రాకపోకలకు అధికారులు అనుమతించారు.

కశ్మీర్​ టు పంజాబ్​- డ్రైవర్ లేకుండా 78కి.మీ దూసుకెళ్లిన రైలు- టెన్షన్ టెన్షన్!

రైలులో చైన్ ఎప్పుడు లాగాలో తెలుసా? ప్రయాణికులు తెలుసుకోవాల్సిన '7' రూల్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.