Nitin Gadkari On NDA Target 400 : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి భారీ విజయం సాధిస్తుందని, ప్రధాని మోదీ నాయకత్వంపై నమ్మకం ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. బీజేపీ, ప్రస్తుత సీట్ల సంఖ్య 288ని అధిగమిస్తుందని, దక్షిణాది నుంచి క్రితం సారి కంటే ఎక్కువ సీట్లు పొందనుందని తెలిపారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలు, బీజేపీ లక్ష్యాలు, ప్రతిపక్షాల ఆరోపణల గురించి కూడా ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
'ప్రతిపక్షాలు దానిపై దృష్టి సారించాలి'
BJP Mission South : 'తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి. గత దశాబ్దంలో ప్రధాని మోదీ నాయకత్వంతో దక్షిణాదిలో బీజేపీ ప్రభావం పెరిగింది. ఎన్‌డీఏ కూటమి 400 సీట్లకు పైగా గెలుస్తుంది (Nitin Gadkari On Target 400). ఇందులో బీజేపీ సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది. ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ తీరు, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు సరికాదు. ప్రభుత్వ చర్యలు చట్టబద్ధమైనవి. ఆరోపణలు చేయడం కంటే ప్రజల విశ్వాసం పొందడంపై ప్రతిపక్షాలు దృష్టి సారించాలి' అని గడ్కరీ వ్యాఖ్యానించారు.
వాషింగ్ మెషిన్ రాజకీయాలపై వస్తోన్న ఆరోపణలు, అవినీతి ప్రతిపక్ష సభ్యులు బీజేపీలో చేరిన తర్వాత విముక్తి పొందారని వస్తున్న విమర్శలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు కేంద్రమంత్రి. చట్టపరమైన విధానాలే ఫలితాలను నిర్ణయిస్తాయని అన్నారు.
"బీజేపీ ఫండ్‌రైజింగ్ విధానాలు, ఫేవరిటిజంపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. అధికార పార్టీ సహజంగానే ఎక్కువ ఫండ్స్ పొందుతుంది. ఇది కూడా కమర్షియల్ అడ్వర్టైజింగ్‌లానే ఉంటుంది. దేశంలో బీజేపీ టీఆర్‌పీ ఎక్కువగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు నిధుల కోసం చట్టపరమైన మార్గాలను కనుగొనడం చాలా అవసరం. అందుకు గవర్నమెంట్ ఫైనాన్సింగ్ ఒక మంచి ఆప్షన్."
- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి
ఐదు లక్షల మెజారిటీయే లక్ష్యం!
భారత రాజకీయాల భవిష్యత్తును ప్రతిబింబిస్తూ, సైద్ధాంతిక నిబద్ధత, పట్టుదల ప్రాముఖ్యతను గడ్కరీ నొక్కిచెప్పారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉదాహరణలుగా పేర్కొన్నారు. తన వ్యక్తిగత ఎజెండాకు సంబంధించి, గడ్కరీ తన నియోజకవర్గానికి సేవ చేయడంలో తన అంకితభావాన్ని పునరుద్ఘాటించారు. ఐదు లక్షల ఓట్ల తేడాతో గణనీయమైన విజయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మైనారిటీ, దళిత వర్గాల నుంచి తనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
బీజేపీ 'మిషన్ సౌత్'- 83 సీట్లపై గురి- దక్షిణాదిలో మోదీ వ్యూహమిదే! - bjp mission south
పవార్ ఫ్యామిలీలో 'పవర్' పాలిటిక్స్- పోటీకి వదినా-మరదళ్లు 'సై' - Supriya Sule vs Sunetra Pawar