ETV Bharat / bharat

నీతా అంబానీ మేకప్‌ ఆర్టిస్ట్‌ సాలరీ ఎంతో తెలుసా? షాక్​ అవ్వడం పక్కా! - Nita Ambani Makeup Artist - NITA AMBANI MAKEUP ARTIST

Nita Ambani Makeup Artist Salary : సెలబ్రిటీల ప్రొఫెషనల్​ అండ్​ పర్సనల్​ విషయాలు తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. వారికి సంబంధించిన వార్త ఏదైనా క్షణాల్లో వైరల్​ అవుతుంది. తాజాగా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీకి మేకప్ వేసే వ్యక్తి గురించి ఒక విషయం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Nita Ambani Makeup Artist
Nita Ambani Makeup Artist Salary (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 6, 2024, 12:50 PM IST

Nita Ambani Makeup Artist Mickey Contractor Salary : సినిమా సెలబ్రిటీలు, అత్యంత సంపన్నులైన వ్యక్తులకు మనం దేశంలో చాలా ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంటుంది. వీరికి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటుంది. అప్పుడప్పుడు సెలబ్రిటీలతో పాటు వారి దగ్గర పని చేసే వారి గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీకి.. మేకప్‌ వేసే వ్యక్తి గురించి ఒక ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది. పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల నెల జీతం కన్నా.. ఈయన ఒక్కసారి మేకప్​ వేసి ఛార్జ్​ చేసే అమౌంట్​ ఎక్కువనే టాక్​ నడుస్తోంది. ఇంతకీ ఆ హై ప్రొఫైల్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ ఎవరు ? ఈయన ఒకసారి మేకప్‌ వేస్తే ఎంత మనీ తీసుకుంటారు ? అనేది ఇప్పుడు చూద్దాం.

మేకప్ వేసేది ఈయనే! మార్చిలో జరిగిన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో నీతా అంబానీ చాలా అందంగా కనిపించారు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో చివరి రోజు నీతా అంబానీ నృత్య ప్రదర్శన చేసి అందరిని ఆకట్టుకున్నారు. అంతే కాకుండా తన లుక్స్‌, ఫ్యాషన్‌తో చాలా స్పెషల్‌గా కనిపించారు. అంత మందిలో నీతా అంబానీ స్పెషల్‌గా కనిపించడంలో ఆమె మేకప్‌ ఆర్టిస్ట్‌ పాత్ర ఎంతో ఉంది. ఇలా ఒక్క ఫంక్షన్​ అనే కాదు అంబానీ ఇంట జరిగే అన్ని వేడుకల్లో ప్రముఖ మేకప్‌ ఆర్టిస్ట్‌ 'మిక్కీ కాంట్రాక్టర్‌' (Mickey Contractor) ప్రమేయం ఉంటుంది. అయితే నీతా అంబానీకి మాత్రమే కాదు కూతురు ఇషా అంబానీ, పెద్ద కోడలు శ్లోకా మెహతా, చిన్న కోడలు రాధిక మర్చంట్​కు కూడా ఈయనే మేకప్​ వేస్తారు.

అంతేనా మన దేశంలోని హై ప్రొఫైల్‌ మేకప్‌ ఆర్టిస్టుల్లో మిక్కీ కాంట్రక్టర్‌ ఒకరు. దాదాపు 30 ఏళ్లకు పైగా ఇదే రంగంలో మిక్కీ పని చేస్తున్నారు. అంబానీ ఆడపడుచులతో పాటు ప్రముఖ బాలీవుడ్‌ తారలు దీపికా పదుకొణె, కరీనా కపూర్, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ, కాజోల్ వంటి ఎందరో హీరోయిన్‌లకు మిక్కీ మేకప్‌ వేస్తుంటారు. 1992లో సినీ తార కాజోల్‌తో కలిసి తొలి సినిమా "బేఖుడి" తో బాలీవుడ్‌లో మేకప్‌ ఆర్టిస్ట్‌గా మిక్కీ తన కెరీర్‌ను ప్రారంభించారు. తర్వాత ఎన్నో సూపర్‌ హిట్‌ బాలీవుడ్‌ చిత్రాలకు మేకప్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశారు.

ఎంత ఛార్జ్‌ చేస్తారంటే ? అయితే, మిక్కీ ఒక సెషన్‌కు మేకప్‌ వేయడానికి సుమారు రూ. 75,000 నుంచి రూ. 1 లక్ష వరకు ఛార్జ్‌ చేస్తారట. ఇంకా హై ప్రొఫైల్‌ సెలబ్రిటీల విషయంలో ఇది ఇంకా ఎక్కువగానే ఉంటుందట. అందుకే మిక్కీ కాంట్రాక్టర్‌ను మన దేశంలోనే అత్యంత ఖరీదైన మేకప్‌ ఆర్టిస్ట్‌లలో ఒకరిగా చెప్పుకుంటారు. మిక్కీ మొదట్లో జపాన్‌లోని టోక్యోలో హెయర్ డ్రెస్సర్‌గా పని చేసేవారు. తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బాలీవుడ్‌లోని ప్రముఖ సినిమాలు "హమ్ ఆప్కే హై కౌన్", "దిల్ తో పాగల్ హై", "కుచ్ కుచ్ హోతా హై", "కల్ హో నా హో", "మై నేమ్ ఈజ్ ఖాన్" వంటి ఎన్నో చిత్రాలకు మిక్కీ మేకప్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశారు.

ఫుల్​ ట్రాఫిక్​లో నీతాకు ముకేశ్​ అంబానీ లవ్​ ప్రపోజల్​- 'సమాధానం ఇస్తేనే కార్​ స్టార్ట్ చేస్తా' - Love Story

రూ.1200తో మొదలైన హీరోయిన్ - అంబానీ కంటే ముందే "రోల్స్‌ రాయిస్‌" కొనేసింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.