NEET UG Exams 2024 Dress Code : దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం (మే 5న) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తప్పకుండా పాటించాల్సిన పరీక్ష మార్గదర్శకాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అభ్యర్థులందరూ ఈ నిబంధనలను తప్పక పాటించాల్సి ఉంటుంది. NTA అధికారిక వెబ్‌సైట్‌లో పురుష, మహిళా అభ్యర్థులకు NEET డ్రెస్ కోడ్ 2024న మార్గదర్శకాలను పొందుపరిచింది. పరీక్ష నిర్వహణలో నిష్పక్షపాతంగా ఉండేలా ఈ నియమ నిబంధనలను రూపొందించారు.
డ్రెస్ కోడ్ ఇలా
- పరీక్షకు హాజరయ్యే పురుష అభ్యర్థులు హాఫ్ స్లీవ్ షర్టులు, టీ-షర్టులు మాత్రమే ధరించాలి. ఫుల్ హ్యాండ్స్ చొక్కాలు, హెవీగా ఉండే దుస్తులు వేసుకుంటే పరీక్ష హాల్లోకి అనుమతించరు. జేబులతో కూడిన సాధారణ ప్యాంట్స్ వేసుకోవచ్చు.
- మహిళా అభ్యర్థులు పెద్దగా హడావిడి లేని దుస్తులు వేసుకోవచ్చు. పువ్వులు, బ్రూచ్లకు అనుమతి లేదు. అలాగే కుర్తీ, లెగ్గింగ్స్, ప్లాజో కూడా అనుమతించరు.
- ప్యాంట్ షర్ట్ వేసుకొనే అమ్మాయిలు లైట్ డెనిమ్ ప్యాంట్స్, హాఫ్ హ్యాండ్స్ షర్ట్ వేసుకోవచ్చు. కానీ షర్ట్ బటన్లు మీడియం సైజులో ఉండాలి.
- అభ్యర్థులు సాధారణ చెప్పులు వేసుకోవచ్చు. కానీ బూట్లకు, హీల్స్‌కు అనుమతి లేదు.
- పరీక్ష రాసే అభ్యర్ధులు ఉంగరాలు, కంకణాలు, చెవిపోగులు వంటి మెటల్ ఆభరణాలు ధరించరాదు.
- పేపర్లు, జామెట్రీ/ పెన్సిల్ బాక్స్‌లు, ప్లాస్టిక్ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, స్కేల్స్, రైటింగ్ ప్యాడ్‌లు, పెన్ డ్రైవ్‌లు, డిజిటల్ వాచీలు, ఎలక్ట్రానిక్ పెన్నులు మొదలైనవాటిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
- పర్సులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, బెల్టులు, టోపీలు మొదలైన వాటిని ధరించవద్దు. ప్యాక్ చేసిన తినుబండారాలు, వాటర్ బాటిల్స్ కూడా అనుమతించరు.
- సిక్కు లేదా ఇస్లామిక్ మతానికి చెందిన అభ్యర్థులు కొన్ని షరతుల ఆధారంగా సంప్రదాయ దుస్తులను ధరించడానికి అనుమతిస్తారు. అయితే అందుకోసం వారు మధ్యాహ్నం 12.30 నిమిషాలకే పరీక్ష హాలుకు చేరుకోవాలి.
అభ్యర్థులు తీసుకువెళ్లాల్సిన వస్తువులు - అభ్యర్థులు తప్పనిసరిగా నీట్ అడ్మిట్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఐడి ప్రూఫ్‌ను పరీక్ష హాల్‌కు తీసుకెళ్లాలి.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా తమ పీడబ్ల్యూడీ సర్టిఫికెట్‌ను పరీక్ష హాల్‌కు తీసుకెళ్లాలి.
- రిపోర్టింగ్ సమయానికి పరీక్ష హాలుకు చేరుకోవాలి.
- ఎటువంటి నిషేధిత వస్తువులను కలిగి ఉండకూడదు ఒకవేళ ఉంటే వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తారు.
- వైద్య చికిత్స పొందుతున్న అభ్యర్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అభ్యర్థులు ఎవరైనా సరే పరీక్ష పూర్తయిన తర్వాత మాత్రమే పరీక్ష హాలు నుంచి బయటకు రావాలి. అంతకుముందు బయటకు పంపరు.
లోయలో బోల్తా పడ్డ కారు- ఐదుగురు విద్యార్థులు దుర్మరణం - Mussoorie Road Accident