Narendra Modi On Subhash Chandra Bose : స్వాతంత్య్రం అనంతరం భారత్లో బంధుప్రీతి, రాజవంశం అనేవి ఆధిపత్యం చెలాయించి దేశ అభివృద్ధిని అడ్డుకున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. యువత, మహిళలు దేశ రాజకీయాలను బంధుప్రీతి, అవినీతి నుంచి విముక్తి చేయగలరని తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, సహకారం దేశంలోని యువతకు స్ఫూర్తి అన్నారు. దిల్లీలోని ఎర్రకోటలో జరిగిన పరాక్రమ్ దివస్(నేతాజీ 127వ జయంతి) సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.
-
#WATCH | Delhi | Prime Minister Narendra Modi inspects an exhibition at Red Fort, organised on the occasion of Parakram Diwas. #NetajiSubhasChandraBose pic.twitter.com/LjFw0IOWDk
— ANI (@ANI) January 23, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Delhi | Prime Minister Narendra Modi inspects an exhibition at Red Fort, organised on the occasion of Parakram Diwas. #NetajiSubhasChandraBose pic.twitter.com/LjFw0IOWDk
— ANI (@ANI) January 23, 2024#WATCH | Delhi | Prime Minister Narendra Modi inspects an exhibition at Red Fort, organised on the occasion of Parakram Diwas. #NetajiSubhasChandraBose pic.twitter.com/LjFw0IOWDk
— ANI (@ANI) January 23, 2024
అప్పట్లో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను నేతాజీ బాగా అర్థం చేసుకున్నారని, వాటి గురించి అందరినీ హెచ్చరించారని ప్రదాని మోదీ తెలిపారు. నేతాజీ ప్రజలను జాగృతం చేయడంపై దృష్టి పెట్టారని అన్నారు.'స్వాతంత్ర్యం తర్వాత భారత్లో బంధుప్రీతి, వంశపారంపర్యం వంటివి దేశ ప్రజాస్వామ్యాన్ని శాసించడం ప్రారంభించాయి. భారత్ అభివృద్ధి చెందాల్సిన వేగం కంటే అభివృద్ధి చెందకపోవడానికి ఇవి కూడా ప్రధాన కారణం. బానిసత్వం అనేది పాలనకు మాత్రమే సంబంధించినది కాదని, ఆలోచనలు, పనులలో కూడా ఉందని నేతాజీకి తెలుసు. అందుకే ఆయన ఆ కాలంలోని యువతను మేల్కొల్పడంపై దృష్టి సారించారు.' అని మోదీ పేర్కొన్నారు.
-
#WATCH | Delhi | Prime Minister Narendra Modi tries his hands on a carving tool as he inspects a bust of #NetajiSubhasChandraBose at the exhibition at Red Fort, organised on the occasion of Parakram Diwas. pic.twitter.com/3eA8m7HpeI
— ANI (@ANI) January 23, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Delhi | Prime Minister Narendra Modi tries his hands on a carving tool as he inspects a bust of #NetajiSubhasChandraBose at the exhibition at Red Fort, organised on the occasion of Parakram Diwas. pic.twitter.com/3eA8m7HpeI
— ANI (@ANI) January 23, 2024#WATCH | Delhi | Prime Minister Narendra Modi tries his hands on a carving tool as he inspects a bust of #NetajiSubhasChandraBose at the exhibition at Red Fort, organised on the occasion of Parakram Diwas. pic.twitter.com/3eA8m7HpeI
— ANI (@ANI) January 23, 2024
బీజేపీపై మమత ఫైర్
ఎన్నో ఏళ్లు గడుస్తున్నా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చనిపోయిన తేదీ ఇంకా తెలియకపోవడం దేశ దురదృష్టమని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆయనకు ఏమైందో ఇప్పటికీ మనకు తెలియదనీ దేశానికి ఇది సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని ఆయన విగ్రహానికి మమతా బెనర్జీ నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మమతా బెనర్జీ మాట్లాడారు.
మరోసారి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటించడాన్ని ప్రస్తావించిన మమతా ఈ రోజుల్లో రాజకీయ ప్రచారానికీ సెలవు ప్రకటిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారికి మాత్రం ఏమీ చేయడం లేదని విమర్శించారు. నేతాజీ అదృశ్యంపై దర్యాప్తు చేస్తామని అధికారంలోకి వచ్చే ముందు బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 20 ఏళ్లుగా నేతాజీ జన్మదినం నాడు జాతీయ సెలవు ప్రకటించాలని ప్రయత్నాలు చేస్తున్నా అవి విఫలమయ్యాయనీ తనను క్షమించాలని మమతా బెనర్జీ ప్రజల్ని కోరారు.