ETV Bharat / bharat

భారత్​లోకి 600 మంది మయన్మార్ సైనికులు- కేంద్రాన్ని అలర్ట్ చేసిన మిజోరం - భారత్​లోకి మయన్మార్ సైనికులు

Myanmar Soldiers Flee to India : మయన్మార్​లో అంతర్యుద్ధం నేపథ్యంలో ఆ దేశ సైనికులు సరిహద్దు దాటి భారత్​లోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలోకి 600 మంది మయన్మార్ సైనికులు భారత్​లోకి చొరబడినట్లు తెలుస్తోంది. వారిని వెంటనే వెనక్కి పంపించాలని మిజోరం ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.

Myanmar Soldiers Flee to India
Myanmar Soldiers Flee to India
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2024, 1:45 PM IST

Updated : Jan 20, 2024, 1:58 PM IST

Myanmar Soldiers Flee to India : మయన్మార్‌లో తిరుగుబాటుదారులు, జుంటా ప్రభుత్వం మధ్య పోరు ఉద్ధృతమైంది. రెబల్స్‌ దాడుల నుంచి తప్పించుకునేందుకు మయన్మార్‌ సైనికులు దేశంలోకి ప్రవేశిస్తున్నారని మిజోరం ప్రభుత్వం కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. సాధ్యమైనంత త్వరగా పొరుగుదేశానికి చెందిన సైనికులను తిరిగి వెనక్కి పంపాలని కోరింది. దాదాపు 600 మంది మయన్మార్‌ సైనికులు భారత్‌లోకి చొరబడినట్లు తెలుస్తోంది.

మయన్మార్​లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేపట్టిన సైన్యానికి గత కొంతకాలంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజాస్వామ్య అనుకూలవాదులతో ఏర్పడిన సాయుధ బృందాలు సైనిక సర్కారుపై పోరాటానికి దిగుతున్నాయి. ఈ బృందాలకు, మయన్మార్ సైన్యానికి మధ్య గట్టి పోరు నడుస్తోంది. కొన్నిచోట్ల ప్రజాస్వామ్య అనుకూల గ్రూప్​లు పైచేయి సాధిస్తున్నాయి. ఈ ఘర్షణల కారణంగానే ఇప్పటివరకు 600 మంది మయన్మార్ సైనికులు సరిహద్దు దాటి భారత్​లోకి వచ్చారు.

మయన్మార్‌లోని రఖైన్‌ రాష్ట్రానికి చెందిన సైనిక క్యాంపును రెబల్స్‌కు చెందిన అరాకన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆ దేశ సైనికులు మిజోరంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వారంతా లాంగ్‌ట్లాయ్‌ జిల్లాలోని అసోం రైఫిల్స్‌కు చెందిన క్యాంపులో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితులపై మిజోరం సీఎం లాల్‌దుహోమా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చించారు. మయన్మార్‌లో నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన అనేకమంది ఆశ్రయం పొందేందుకు వస్తున్నారని, మానవతా దృక్పథంతో వారికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు మిజోరం సీఎం తెలిపారు. ఇప్పటికే 400 మంది సైనికులను వెనక్కి పంపినట్లు వెల్లడించారు.

కాగా, ఆ దేశంలో ప్రజాస్వామ్య అనుకూల గ్రూపులు కొన్ని ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. సైన్యంతో ఈ గ్రూపుల ఘర్షణ వల్ల దేశంలో అంతర్యుద్ధం ఏర్పడింది. ప్రజాస్వామ్య అనుకూల గ్రూపులు కలిసి 'త్రీ బ్రదర్​హుడ్ అలయన్స్' (టీబీఏ)గా ఏర్పడి మయన్మార్ సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇందులో మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం (MNDAA), టాంగ్ జాతీయ విమోచన సైన్యం (TNLA), అరాకన్ ఆర్మీ (AA) గ్రూపులు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన సాయుధ తిరుగుబాటు సంస్థలుగా వీటికి పేరు ఉంది.

సొంత పౌరులపై దాడి.. యుద్ధ విమానాలతో బాంబులు.. 100 మంది మృతి!

తిరుగుబాటుదారులు, సైన్యం మధ్య కాల్పులు.. 29 మంది మృతి

Last Updated : Jan 20, 2024, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.