ETV Bharat / bharat

ఫ్లాట్​లో 4వేల కిలోల చెత్త మధ్య తల్లీకూతుళ్ల జీవనం- రోజూ ఆన్​లైన్​లో ఫుడ్ ఆర్డర్లు- ఇంటి నిండా బొద్దింకలే! - Mother And Daughter Live In Garbage

Mother And Daughter Live In Garbage : భర్త మరణంతో మానసికంగా కుంగిపోయిన తమిళనాడుకు చెందిన ఓ మహిళ తన కుమార్తెతో కలిసి కొన్నేళ్లుగా ఉంట్లోనే ఉండిపోయింది. ఇంటిని శుభ్రం చేయకపోవడం వల్ల టన్నుల కొద్దీ చెత్తాచెదారం పేరుకుపోయింది. డంపింగ్ యార్డ్​లా ఉన్న ఇంట్లోనే ఆన్​లైన్​లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేవారు. అక్కడ పడుకునేవారు.

Mother And Daughter Live In Garbage
Mother And Daughter Live In Garbage (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 11:11 AM IST

4వేల కిలోల చెత్త మధ్య తల్లీకూతుళ్ల జీవనం (ETV Bharat)

Mother And Daughter Live In Garbage : తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన తల్లీకూతుళ్లు కొన్నేళ్లుగా అలా ఇంట్లోనే ఉండిపోయారు. డంపింగ్ యార్డ్​లా మారిపోయిన ఇంట్లోనే నివసిస్తున్నారు. దుర్వాసన వచ్చినా పట్టించుకోకుండా అక్కడే తింటూ, అక్కడే నిద్రిస్తున్నారు. అసలెందుకు వారలా చేస్తున్నారు? వారికి ఏమైందంటే?

భర్త మరణంతో కుంగిపోయిన రుక్మిణి
కోయంబత్తూరులోని ఓ అపార్ట్​మెంట్​లో రుక్మిణి తన భర్త, కుమార్తెతో కలిసి నివసించేది. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త మరణించినట్లు తెలుస్తోంది. భర్త చనిపోయిన తర్వాత రుక్మిణిని చూసేందుకు బంధువులెవరూ రాలేదు. అప్పుడు ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. అప్పటి నుంచి రుక్మిణి, ఆమె కూతురు ఇంటి నుంచి బయటకు రావడం మానేశారు. ఆన్​లైన్​లో తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకునేవారు. అప్పుడప్పుడు ఇంట్లోనే వంట చేసుకునేవారు. రుక్మిణి భర్త రిటైర్డ్ టీచర్. ఆయన మరణించడం వల్ల పింఛను రుక్మిణికి వస్తోంది. ఆ డబ్బులతో వారు ఆన్​లైన్ ఫుడ్​ ఆర్డర్లు పెట్టుకునేవారు. అప్పుడప్పుడు రుక్మిణి, ఆమె కుమార్తె తమకు కనిపించేవారని ఇరుగుపొరుగువారు చెప్పారు.

Mother And Daughter Live In Garbage
కుప్పలుతెప్పలుగా చెత్త (ETV Bharat)

ఇంట్లోనే టన్నుల కొద్దీ చెత్త
ఆన్​లైన్​లో ఆర్డర్‌ చేసిన ఫుడ్ డబ్బాలు, కవర్లలో వచ్చేది. ఆహారాన్ని తినేసి కవర్ల, డబ్బాలను ఇంట్లోనే వదిలేసేవారు. దీంతో ఇంట్లోనే టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయి డంపింగ్ యార్డ్​లా మారింది. ఈ క్రమంలో రుక్మిణి ఇంటి నుంచి దుర్వాసన రావడం వల్ల ఇరుగుపొరుగువారు ఎరే నెంజమ్‌ ఫౌండేషన్​కు చెందిన మహేంద్రన్​ను సంప్రదించారు. ఆయన రుక్మిణి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా కుదరలేదు. పలు ప్రయత్నాల తర్వాత రుక్మిణి ఇంట్లోకి వెళ్లారు. ఒక్కసారిగా గుప్పుమని దుర్వాసన వచ్చింది. ఇంట్లోని ఆహార ప్యాకెట్లపై పురుగులు, బొద్దింకలు ఉన్నాయి.

Mother And Daughter Live In Garbage
వంటగది (ETV Bharat)

వెంటనే మహేంద్రన్ సెల్​ఫోన్​లో వీడియో తీసి కార్పొరేషన్‌ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న కార్పొరేషన్ అధికారులు పారిశుద్ధ్య కార్మికులతో రుక్మిణి ఇంట్లోని 4,000 కిలోల చెత్తను తొలగించారు. ఇంటిని సైతం శుభ్రం చేశారు. "రుక్మిణి ఇంట్లో కాసేపు కూడా ఉండలేకపోయాం. ఇన్నాళ్లు ఈ ఇంట్లోనే తల్లీకూతుర్లు ఎలా ఉన్నారనిపించింది. అలాగే కొన్ని డబ్బాలపై బొద్దింకలు, మంచంపై పురుగులు ఉన్నాయి. ఆ ఇంట్లో నుంచి భయంకరమైన దుర్వాసన వచ్చింది" అని మహేంద్రన్ ఈటీవీ భారత్​కు చెప్పారు.

Mother And Daughter Live In Garbage
ఈటీవీ భారత్​తో మాట్లాడుతున్న మహేంద్రన్ (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.