ETV Bharat / bharat

రాజకీయ కారణాలతో దేశ సంస్కృతినే అవమానించారు!: మోదీ - modi latest speech

Modi Assam Visit Today : స్వాతంత్ర్యం తర్వాత అధికారంలో ఉన్నవారు తమ రాజకీయ కారణాలతో దేశ సంస్కృతిని అవమానించే ఒరవడి సృష్టించారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దేశంలో పుణ్యక్షేత్రాల గొప్పతనాన్ని గుర్తించలేదని ఆరోపణలు చేశారు.

Modi Assam Visit Today
Modi Assam Visit Today
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 2:25 PM IST

Updated : Feb 4, 2024, 3:09 PM IST

Modi Assam Visit Today : దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీర్ఘకాలంపాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు భారత్‌లోని పవిత్ర స్థలాల ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. వాటిని పాటించడం అవమానకరం అనే భావన కల్పించారని మండిపడ్డారు. గత జ్ఞాపకాలను తుడిచేసిన ఏ దేశం కూడా పురోగతి సాధించలేదని తెలిపారు.

ఆదివారం అసోంలో పర్యటించిన ఆయన రాష్ట్రంలో రూ.11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. దేశంతోపాటు దక్షియా ఆసియాతో ఈశాన్య ప్రాంత అనుసంధానాన్ని ఇవి మెరుగుపరుస్తాయని మోదీ తెలిపారు. గత దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో పర్యటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించారన్నారు.

"భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత అధికారంలో ఉన్నవాళ్లు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను విస్మరించారు. వాటిని పాటించడం అవమానకరం అనే భావన కల్పించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పవిత్ర స్థలాలను పట్టించుకోలేదు. రాజకీయ లబ్ధి కోసం మన గతాన్ని మరుగున పడేలా వ్యవహరించారు"

-- ప్రధాని నరేంద్ర మోదీ

గత జ్ఞాపకాలను తుడిచేసిన ఏ దేశం కూడా పురోగతి సాధించలేదని మోదీ చెప్పారు. "అవి కేవలం పర్యటక ప్రదేశాలు మాత్రమే కాదు. వేల ఏళ్లనాటి భారత నాగరికతకు చిహ్నాలు. సంక్షోభాలను ఎదుర్కొని దేశం స్థిరంగా ఎలా నిలబడిందో చెప్పే గుర్తులు. గత పదేళ్లలో ఈ పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చింది" అని ప్రధాని తెలిపారు. గత పదేళ్లలో అసోంలో శాంతిని పునరుద్ధరించామని మోదీ వివరించారు. సుమారు 7వేల మంది తుపాకులను వదిలేసి జనజీవన స్రవంతిలో కలిశారని గుర్తుచేశారు. రికార్డు స్థాయిలో పర్యటకులు అసోంలో పర్యటిస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు.

త్వరలో చారిత్రక ప్రదేశాలను తీర్చిదిద్దేందుకు కొత్త పథకాన్ని ప్రారంభిస్తామని మోదీ తెలిపారు. అందుకే ఈ ఏడాది బడ్జెట్‌లో పర్యటకంపై దృష్టి సారించామని చెప్పారు. గత 10 ఏళ్లలో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు నాలుగు రెట్లు పెరిగిందని ప్రధాని పేర్కొన్నారు. అసోం నుంచి ప్రధాని ఎన్నికైనప్పుడు కూడా ఇంతకుముందు ఇలా చేయలేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును ప్రస్తావించకుండా వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Feb 4, 2024, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.