ETV Bharat / bharat

7ఏళ్ల వయసులో బాలుడు కిడ్నాప్​- భిక్షాటన చేస్తూ జీవనం- పోలీసు సాయంతో 22ఏళ్ల తర్వాత ఇంటికి - Missing Boy Return Home

Missing Boy Return To Home After 22 Years : ఏడేళ్ల వయసులో కిడ్నాప్‌ అయిన ఓ బాలుడు 22 ఏళ్ల తర్వాత తిరిగి తన కుటుంబాన్ని కలిశాడు. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన అతడి స్టోరీ, ఏ బాలీవుడ్ సినిమాకీ తీసిపోదు. ఆ కథ ఏంటో మీరూ చదవండి.

Missing Boy Return To Home
Missing Boy Return To Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 11:18 AM IST

Updated : Jun 3, 2024, 12:20 PM IST

Missing Boy Return To Home After 22 Years : ఏడేళ్ల వయసులో కిడ్నాప్‌నకు గురైన ఓ బాలుడు 22 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. అయితే తన కుటుంబానికి దూరమైన తర్వాత కొన్ని సంవత్సరాలు పాటు భిక్షాటన చేశాడు. ఆ తర్వాత పదో తరగతి వరకు చదువుకుని మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించాడు. కానీ తన కుటుంబ ఎక్కడ ఉందో తెలీదు, వెతకడానికి ట్రై చేద్దాం అనుకున్నా, ఏమి గుర్తు లేవు. ఇలాంటి పరిస్థితిలో ఓ పోలీసు సాయంతో 22ఏళ్ల తర్వాత తన ఇంటికి చేరుకున్నాడు. తన కుటుంబ సభ్యులను చూశాక అనందంతో ఉప్పొంగిపోయాడు. భావోద్వేగంతో తల్లిని హత్తుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

అసలేం జరిగిందంటే
ఈ కథ 2003లో మొదలైంది. సహరాన్‌పూర్​కి చెందిన అమిత్​కు 7ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ రోజు వాళ్ల అమ్మ గోధమ రవ్వ తీసుకురామ్మన్ని చెప్పింది. దుకాణానికి వెళ్లిన అమిత్ కిడ్నాప్​కు గురయ్యాడు. కట్​ చేస్తే, మహారాష్ట్రలోని ముంబయిలో ప్రత్యక్షమయ్యాడు. ఎవరూ తీసుకుపోయారో తెలియదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చెత్త ఏరుకుంటూ, భిక్షాటన చేశాడు. అలా కొంత కాలం తర్వాత ఎలాగోలా దిల్లీకి వెళ్లాడు. అక్కడి పోలీసులు అమిత్​ను చిల్డ్రన్స్ హోమ్​లో చేర్పించారు. అక్కడే 5 సంవత్సరాల పాటు ఉండి పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత ఒక చిన్న ఉద్యోగం కూడా సంపాదించాడు. కానీ, అమిత్​ను తన ఇంటి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. తన ఇంటికి వెళ్లాలని ఆశ పడుతున్నాడు కానీ, అతడికి ఏమి గుర్తుకు రావడం లేదు. అయితే చోర్ చౌక్ అనే పేరు, ఆ ప్రాంతంలో ఆయిల్ మిల్లులు ఉన్నట్లు మాత్రమే అమిత్​కు గుర్తు ఉన్నాయి. వీటితో తన కుటుంబాన్ని కలిసేదెలా అని ఆవేదనకు గురయ్యాడు. అయినా కుటుంబాన్ని తిరిగి కలవాలి అన్న ఆరాటం అతనిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు.

పోలీసుల సాయంతో
ఈ క్రమంలో రాజేశ్ కుమార్‌ అనే ఏఎస్‌ఐను అమిత్​ కలిశాడు. జరిగిందంతా చెప్పి తన కుటుంబ సభ్యులను కనిపెట్టడానికి సహాయం చేయమని కోరాడు. తనకు గుర్తున్న ఆ కాస్త సమాచారాన్ని రాజేశ్ కుమార్‌కు తెలియజేశాడు అమిత్. హరియాణా స్టేట్ క్రైమ్ బ్రాంచ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌లో పనిచేస్తున్న రాజేశ్ కుమార్, అమిత్ చెప్పినదంతా జాగ్రత్తగా విని సోషల్ మీడియా, గూగుల్ సహాయంతో వెతకటం ప్రారంభించాడు. అలా చివరికి ఓ రోజు అమిత్​ కుటుంబ సభ్యులను కనిపెట్టారు. అమిత్ 22 సంవత్సరాల తర్వాత తన కుటుంబ సభ్యులను కలిశాడు. అతడిని చూసిన కుటుంబ సభ్యులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు.

7ఏళ్ల వయసులో బాలుడు కిడ్నాప్​- భిక్షాటన చేస్తూ జీవనం- పోలీసు సాయంతో 22ఏళ్ల తర్వాత ఇంటికి (ETV Bharat)

శునకానికి అరుదైన హార్ట్ సర్జరీ- దిల్లీ వైద్యుల ఘనత- ఆసియాలో ఇదే మొదటిసారి - Dog Heart Surgery

ఎన్నికల పక్రియ నిర్వీర్యానికి కుట్రలంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు- అలానే లెక్కించాలని 'ఇండియా' విజ్ఞప్తి - lok sabha election 2024

Last Updated : Jun 3, 2024, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.