ETV Bharat / bharat

28 ఏళ్ల తర్వాత భారత్​ వేదికగా మిస్​ వరల్డ్​ పోటీలు- ప్రత్యేకతలివే! - మిస్ వరల్డ్ 2024 పోటీలు

Miss World 2024 Opening Ceremony : 28 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఫిబ్రవరి 20న ప్రారంభ వేడుకతో మొదలుకొని పలు పోటీలు నిర్వహించనున్నారు నిర్వాహకులు. మరి, మన దేశ ఆతిథ్యంతో పాటు మరెన్నో ప్రత్యేకతల్నీ సొంతం చేసుకున్న ఈ అందాల పోటీల విశేషాలేంటో తెలుసుకుందామా?

Miss World 2024 Opening Ceremony
Miss World 2024 Opening Ceremony
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 11:40 AM IST

Miss World 2024 Opening Ceremony : ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే అందాల పోటీలకు ఆతిథ్యమివ్వాలని ప్రతి దేశం ఉవ్విళ్లూరుతుంటుంది. అలా ఈసారి 'మిస్‌ వరల్డ్‌' పోటీలకు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఈ ఏడాది భారత్​కు దక్కింది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ అందాల పోటీలకు భారత్‌ ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి. గతంలో 1996లో తొలిసారి భారత్​లో అందాల పోటీలు నిర్వహించారు. ఆ ఏడాది గ్రీస్ భామ ఇరెనె కిరీటాన్ని ఎగరేసుకుపోయారు.

miss world 2024 opening ceremony
మిస్ వరల్డ్ 2024 షెడ్యూల్

ఇక ఈసారి దిల్లీలోని ఆశోక హోటల్​లో ఫిబ్రవరి 20న ప్రారంభ వేడుకతో మొదలుకొని పలు పోటీలు నిర్వహించనున్నారు నిర్వాహకులు. మార్చి 9న ఫైనల్‌ జరగనుంది. ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందాల భామలు కనువిందు చేయనున్నారు. మన దేశం తరఫున కర్ణాటకకు చెందిన సిని శెట్టి 'మిస్‌ వరల్డ్‌' కిరీటం కోసం పోటీ పడుతున్నారు. గత విజేత కరోలినా (పోలండ్‌) ఈసారి ప్రపంచ సుందరికి తన స్వహస్తాలతో కిరీటం అలంకరించేందుకు సిద్ధమయ్యారు.

సిని శెట్టిపైనే అందరి దృష్టి
ఈసారి జరుగుతోన్న 71వ 'ప్రపంచ సుందరి' పోటీలకు భారత్‌ ఆతిథ్యమివ్వడానికి తోడు మన దేశం తరఫున సిని శెట్టి ఈ పోటీల్లో పాల్గొంటుండడం వల్ల అందరి దృష్టీ ఆమె పైనే ఉందని చెప్పాలి. ఇలా ఈసారి తానో పోటీదారుగానే కాకుండా భారత్‌ అందిస్తున్న ఆతిథ్యంలో తానూ భాగమవడం తన జర్నీని మరింత ప్రత్యేకంగా మలచిందంటోందీ ఈ అందాల తార.

'120 దేశాలకు చెందిన అమ్మాయిలంతా ఇక్కడికి చేరుకోవడం, మన ఆతిథ్యాన్ని స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పోటీల్లో నేను భాగమవ్వడం ఒకెత్తయితే ఆతిథ్యంలోనూ భాగమవడం మరింత ప్రత్యేకంగా అనిపిస్తోంది. మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా స్ఫూర్తితోనే అందాల పోటీల్లో పాల్గొనాలన్న లక్ష్యం పెట్టుకున్నా. నిర్భయంగా, మనసు చెప్పింది చేసే ముక్కుసూటితనం ఆమె సొంతం. నాకూ నా సిద్ధాంతాల్ని నమ్ముతూ పారదర్శకంగా ఉండడమంటే చాలా ఇష్టం. జీవితంలో నేనేదీ ప్లాన్‌ చేసుకోను. ప్రతి సవాలునూ అవకాశంగా స్వీకరిస్తూ ముందుకు సాగుతానే తప్ప వెనకడుగు వేసే ఆలోచనే చేయను. ఇంతటి ప్రతిష్ఠాత్మక పోటీ అంటే కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. కానీ నేను కూల్‌గానే ఉన్నా.' అని అంటున్నారు సినీ శెట్టి. ఈ పోటీల్లో దేశం గర్వించే ప్రదర్శన చేస్తానంటున్నారు. ఎలాగైతే ఈ ముద్దుగుమ్మ ప్రతిసారీ తన భరతనాట్య ప్రదర్శనతో ప్రేక్షకుల్ని గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తుందో, మిస్‌ వరల్డ్‌ పోటీల వేదికపైనా అలాంటి ప్రదర్శనే చేయాలని భారతీయులు ఆకాంక్షిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా భారత్​లోనే మకాం
2022లో చివరిసారిగా 'ప్రపంచ సుందరి' పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో పోలండ్‌ బ్యూటీ కరోలినా మిస్ వరల్డ్​ కిరీటం అందుకున్నారు. అయితే గతేడాది ఓ ఈవెంట్‌ కోసం భారత్‌లో పర్యటించిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడి ఆతిథ్యానికి, పర్యటక ప్రదేశాల అందాలకు ముగ్ధురాలినయ్యానంటున్నారు. ప్రస్తుతం 'మిస్‌ వరల్డ్‌' అందాల పోటీల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారత్‌లోనే ఉంటున్నారు ఆమె.

'ప్రపంచదేశాల్లో అత్యుత్తమంగా ఆతిథ్య సేవలందించే దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉంటుంది. 'మిస్‌ వరల్డ్‌' పోటీల కోసం గత కొన్ని రోజులుగా నేను ఇండియాలోనే ఉంటున్నా. నేను భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. ఇక్కడికొచ్చిన ప్రతిసారీ పుట్టింటికొచ్చిన భావన కలుగుతుంటుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అందరూ ఓ కుటుంబంలా కలిసిమెలిసి ఉండడం, ప్రేమ ఆప్యాయతలు, గౌరవమర్యాదలు, దయాగుణం ఇవన్నీ నన్నెంతగానో ఆకర్షించాయి. ఈ విలువలే ప్రపంచ దేశాలకూ ఆదర్శంగా నిలుస్తాయి. ఏదేమైనా ఈ పోటీల నేపథ్యంలో మరో నెల రోజుల పాటు ఇక్కడ గడిపే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది' అన్నారీ ప్రపంచ సుందరి.

మరో ఘనత భారత్ సొంతం
ఈసారి ప్రపంచ సుందరి పోటీలకు భారత్‌ ఆతిథ్యమివ్వడం, సిని శెట్టి ఈ పోటీల్లో పాల్గొనడమే కాదు, మరో ప్రత్యేకత కూడా భారత్ సొంతమైంది. అదీ ప్రముఖ డిజైనర్‌ అర్చనా కొచ్చర్‌ రూపంలో! ఈసారి మిస్‌ వరల్డ్‌ పోటీలకు 'అధికారిక ఫ్యాషన్‌ డిజైనర్‌'గా ఆమెను ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే ఈసారి ఈ పోటీల్లో పాల్గొనే 120 దేశాలకు చెందిన అందాల భామలకు ఆమె దుస్తులు రూపొందించనున్నారు. అయితే వాళ్ల శరీరాకృతి, అభిరుచుల్ని బట్టి ఆయా ఈవెంట్లకు దుస్తులు రూపొందించడమంటే మాటలు కాదు. అయినా దీన్నో సవాలుగా కాకుండా తనకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానంటున్నారు అర్చన. అయితే గతంలోనూ అంతర్జాతీయ వేదికలపై పలు ఫ్యాషన్‌ వీక్స్‌లో తన ఫ్యాషన్‌ నైపుణ్యాల్ని ప్రదర్శించి మెప్పించిన ఆమె సెలబ్రిటీ డిజైనర్‌గానూ పేరుప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. శ్రద్ధా కపూర్‌, కంగనా రనౌత్‌, సోహా అలీ ఖాన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, సమీరా రెడ్డి, ఇలియానా వంటి అగ్రతారలు ఆమె క్లైంట్స్‌ లిస్ట్‌లో ఉండడం గమనార్హం.

రాజ్యసభకు సోనియా గాంధీ ఏకగ్రీవ ఎన్నిక- తొలిసారి పెద్దల సభకు

'జమ్ముకశ్మీర్​ అభివృద్ధికి ఆర్టికల్ 370 ప్రధాన అడ్డంకి- దానిపై సినిమా రావడం మంచి విషయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.